Meet Deepika, An Artist Who Is Turning Old Clothes and Books Into Beautiful Paintings

 

మధ్యలోనే ఆపేశారు:
అప్పటివరకూ ఫైన్ ఆర్ట్స్ కూ ఒక కోర్సు ఉంటుందని, యూనివర్సిటీ స్థాయిలో ఎంట్రస్ టెస్ట్ పెట్టి మరి అడ్మిషన్స్ తీసుకుంటారని దీపిక గారికి తెలియదు. రొటీన్ డిగ్రీలో జాయిన్ అయ్యి, మొదటి సంవత్సరం పూర్తైన తర్వాత జే.ఎన్.టీ.యూ ఫైన్ ఆర్ట్స్ గురుంచి తెలిసిన వెంటనే అమ్మ నాన్నలను ఒప్పించి ఎంట్రన్స్ టెస్ట్ లో 34వ ర్యాంక్ సాధించి తనకెంతో ఇష్టమైన పెయింటింగ్ టాలెంట్ ను మరింత మెరుగుపరుచుకున్నారు.


 

గోడలకు పెయింటింగ్ వెయ్యడమేగా!!
ఈ రెండు మూడు సంవత్సరాల నుండి అకాడమిక్ క్వాలిఫికేషన్ కన్నా ఫైన్ ఆర్ట్స్ చేసినవారికి ఎక్కువ గుర్తింపు లభిస్తుంది, కానీ దీపిక గారు ఫైన్ ఆర్ట్స్ లో జాయిన్ అయిన రోజుల్లో పరిస్థితులు అలా లేవు. “ఏంటి పెయింటింగ్ హా!!, అంటే గోడలకు రంగులు వేయడమే కదా!! దీనికీ అమ్మానాన్నలను బాధపెట్టి హైదరాబాద్ కు వెళ్లి చదువుకోవాలా.? అయినా మీ అమ్మాయిని గారాభం చేసి పెంచారండి.. మీ మాట ఇక వింటుందా!!” ఇలాంటి మాటలు విభిన్న రంగంలో దూసుకుపోవాలని దీపిక గారిలాంటి ఎందరికో ఎదురయ్యే ఉంటుంది. దీపిక గారు ప్రస్తుతం ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మొబైల్ అప్లికేషన్ డిజైనర్ గా పనిచేస్తున్నారు, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎంత సంపాదిస్తున్నారో ప్రస్తుతం అంతే శాలరీ తీసుకుంటున్నారు(భవిషత్తులో మరింత గుర్తింపు రాబోతుంది). ఎవరో ఏమో అనుకుంటారని తనని తాను బాధపెట్టుకోలేదు. ఒక పక్క ఉద్యోగం చేస్తూనే మిత్రుడు మురళీధర్ గారితో కలిసి purple nest ద్వారా ఇష్టమైన పనిని చేస్తూ ఎన్నో ఆవిష్కరణలు చేస్తున్నారు.

 

ప్రతిఒక్కరూ ఒక ఆర్టిస్ట్:
దీపిక గారి దృష్టిలో ప్రతిఒక్కరూ ఒక ఆర్టిస్ట్ యే. ఉప్పుకారం, మసాలాలు పర్ఫెక్ట్ గా వేసి రుచికరమైన వంటలు చేసే వంటమనిషి ఒక ఆర్టిస్ట్ యే, వేల వాహనాలు రోడ్డు మీద తిరుగుతున్నా మిగిలిన వారికి ఏ ఇబ్బంది కలుగకుండా గమ్యాన్ని చేర్చే డ్రైవర్ ఒక మంచి ఆర్టిస్ట్ యే.. ఇలా కళ్లారా చూస్తే ప్రతి ఒక్కరిలోనూ మరొకరితో పోల్చుకోలేనటువంటి టాలెంట్ ఉంటుందని తన నమ్మకం.

పెయింటింగ్ ఎవ్వరైనా వెయ్యొచ్చు, ఇలాగే వెయ్యాలి, అచ్చుగుద్దినట్టుగా.. అనే రూల్స్ ఏమీ లేవు, రంగులను ఎంచుకుని మీ భావాన్ని వ్యక్తికరిస్తే చాలు అదొక కళాఖండం అవుతుంది. మీరు ఎంత డిప్రెషన్, బాధలో ఉన్నాకాని మీకు వచ్చినట్టుగా ఏదైనా ఒక పెయింటింగ్ వెయ్యండి “మీరు చాలా స్టేబుల్ అవుతారు, రిలాక్స్ అవుతారు. పెయింటింగ్ కు అంత శక్తి ఉందని దీపిక గారి అభిప్రాయం.”

 

ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలకోసం..
గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకునే పిల్లలకు “చదువు, మధ్యాహ్న భోజనం” ఇవ్వే వారికి గొప్పవిగా మిగిలిపోతున్నాయి. పిల్లల్లో ఉహాశక్తి ఎక్కువగా ఉంటుంది, పెద్దవారిమైన మనకు బౌండరీస్ ఉంటాయి కానీ వారి ఎదుగుతున్న మనసులో ఇవ్వేమీ ఉండవు. ప్రయివేటు స్కూళ్ళల్లో పెయింటింగ్ క్లాస్ టీచర్లు ఉన్నారు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో అంతగా లేరు అందుకని భవిషత్తులో తన టీం తో కలిసి పిల్లలకు ఉచితంగా క్లాసులు నిర్వహించబోతున్నారు.

దీపిక గారు రకరకాల వర్క్ షాప్స్ కండెక్ట్ చేస్తుంటారు. ఇందులో పిల్లలు కూడా వస్తుంటారు. పవిత్ర క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని క్రిస్మస్ ట్రీ ఎలా తయారుచేస్తే బాగుంటుందో పిల్లలకు వివరిస్తున్నారు. “పేపర్ ఫోల్డ్ చేసి మూడు చెట్లను గీశారు, అయిదు అద్దాలను అతికించారు, అలాగే జింగిల్ బెల్స్ ను పెన్ తో గియ్యాలి..” ఒక చిన్న పాప మాత్రం “ఒక చందమామ, భూమి, సూర్యుడు, నక్షత్రాలు.. వీటన్నిటితో దాన్ని తయారుచేసింది.” దీపిక గారు అక్కడికి వచ్చి ఇదేంటని అడిగితే ఆ పాప “ఇది ఒక విశ్వం” అని సమాధానమిచ్చింది. ఆ పాప చదువుతుంది ఫస్ట్ క్లాస్.. ఇంత చిన్న వయసులో అంత జ్ఞానం ఎలా వచ్చిందోనని దీపిక గారు షాక్ అయ్యారు. బహుశా ఇలాంటి ఆశ్చర్యమే దీపిక తల్లిదండ్రులు కూడా ఒకానొక సమయంలో అనుభవించి ఉంటారు కూడా..

 

ఇప్పుడు దీపిక గారి కొన్ని ఆవిష్కరణలు చూద్దాం..

 

1. నాన్న గారి పాత డెనిమ్ జీన్స్ తో చేసిన క్లాత్ బ్యాగ్ ఇది.


 

2. అన్ని పెయింటింగ్స్ లో ఇండియన్ ట్రెడిషన్స్ ని పొందుపరచడం తనకు ఇష్టం. భారతదేశంలో ప్రసిద్ధి చెందిన తోలు బొమ్మలు కాన్వాస్ మీద..


 

3. మధుబాని దీపిక గారి ఫెవరేట్ ఆర్ట్ ఫామ్. ఆ స్టైల్ ను అడాప్ట్ చేసుకుని వేసి చేసిన పిల్లో!!


 

4. ఒకవేళ డిజైన్స్ పుస్తకాల మీద వేస్తే ఎలా ఉంటుందో చూద్దామని..


 

5. ఈ ఒంటెకు ఇండియన్ ట్రెడిషన్ లో సింగారించారు.


 

6. జ్యుట్ ఫాబ్రిక్, అబ్ స్ట్రాక్ట్ ఫాబ్రిక్ తో కలిపి, రోల్ అప్ పౌచ్ తో కుట్టి, పెయింటింగ్ వేస్తే ఇలా వచ్చేసింది.


 

7. మధుబాని స్టైల్ లో చేప డిజైన్ చాలా బాగుంటుంది. ఆ డిజైన్ లోనే బ్యాగ్ షేప్ ఉంటే ఇదిగో ఇలా ఉంటుంది.


 

8. Warli కూడా ఇండియన్ ఆర్ట్. చూడటానికి సింపుల్ గా కనిపిస్తుంది కానీ చాలా మీనింగ్ ఉంటుంది.


 

9. ఇది కూడా మధుబాని పెయింటింగ్. ఈ బ్యాగ్ మీద ఉన్న ఏనుగులు నిత్యం మన దేవాలయాలపై చూస్తూనే ఉంటాం.


 

For More Information You Can Visit: http://www.purpleneststudios.com

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , ,