Presenting A Tribute To Mukesh Ambani Saab With Dandalayya Song For Giving Us Jio!

 

అడగనిదే అమ్మయినా పెట్టదు ,తపస్సు చేస్తే తప్ప దేవుడు కూడా వరాలు ఇవ్వడు ,మరి అడగకముందే పిలిచి మరీ వరాలిచ్చేవాడ్ని ఏమనాలి ,ముకేశ్ అంబానీ అనాలి . ఆరు నెలలుగా మనకి ఎంతో ఆనందాన్ని వినోదాన్ని ఇచ్చాడు. అసలు మనకేమాత్రం కృతజ్ఞత ఉన్నా ఆయన ఫోటోని మన ప్రొఫైల్ పిక్ గా పెట్టుకోవాలి. ఆయనకి ఇలా ఓసారి మన ధన్యవాదాలు చెప్పుకుందాం .

 


నెట్వర్క్స్ అన్నిటిని ఏలిన మొనగాడా
ఫ్రీ ఆఫర్స్ తో మనసుని గెలిచిన మావాడా
ఫ్రీ గా నెట్ అంటూ నెట్ (వలలో) వేశావు
నెట్టింట్లో మమ్ము బందీ చేసావు
లిమిటెడ్ డాటాతో తంటాలు పడుతుంటే
మళ్ళీ నువ్వొచ్చి పండగ తెచ్చావు
నీ ఆఫర్ తో బతికేసినవాళ్ళం
జియో తోనే జీవించినవాళ్ళం మేమయ్యా
దండాలయ్యా దండాలయ్యా మాతోనే నువ్వుండాలయ్య
దండాలయ్యా దండాలయ్యా మా దేవుడివి నువ్వేనయ్యా
రీఛార్జ్ చేసే బాధే లేదంటూ లవర్ తో రోజంతా మేం సోదే వేసాము
సినిమాలు , సెన్సార్ వీడియోస్ డౌన్లోడే చేసేస్తూ రాత్రంతా జాగారాలే మాకీ ఆర్నెల్లు
నీ జియో కి బానిసలమయ్యా…. నువ్వే మా బాసువయ్యా
మా హొపు నువ్వు …….లైఫు నువ్వే
మా పాటల బాణీలన్నీ నువ్వే అంబానీ
దండాలయ్యా దండాలయ్యా మాతోనే నువ్వుండాలయ్య
దండాలయ్యా దండాలయ్యా మా దేవుడివి నువ్వేనయ్యా

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , ,