ఎన్టీఆర్ గారి దాన వీర శూర కర్ణ గురించి మనకు తెలియని విషయాలు!!

తెలుగు వాళ్లైనా, తెలుగు సినిమా గురించి తెలిసిన వాళ్లైనా “దాన వీర సూర కర్ణ” గురించి తెలియని వారు ఉండరు. అది అప్పట్లో ఎంత సంచలనమో ఇప్పటికీ అంతే. ఆ సినిమాలో సంభాషణలు ఇప్పటికి వాడుతున్నారంటే అర్ధం అవుతుంది వాటి స్థాయి ఏంటో. ఎన్టీఆర్ ఎంత పెద్ద నటుడో అందరికి తెలిసిందే కాని అంతకన్నా గొప్ప దర్శకుడు, కథా రచయితా, నిర్మాత అని ఎంతమందికి తెలుసు. దాన వీర సూర కర్ణ సినిమా గురించిన విషయాలు తెలుసుకుంటే మైండ్ మెంటలెక్కి పోద్ది. అందరికి తెలియాలని ఇక్కడ తెలియపరుస్తున్న..
 
1. ఎన్టీఆర్ మూడు పాత్రల్లో(అన్నీ సమానమైన స్థాయి, నిడివి ఉన్న పాత్రలు) కన్పిస్తారు. కృష్ణ, సుయోధన మరియు కర్ణ.
 
dvsc6
 
2. ఈ సినిమాకు దర్శకత్వం, కథా, రచన, కథనం (స్క్రీన్ప్లే) అందించింది ఎన్టీఆర్. నిర్మాత కూడా ఆయనే.
 
dvsc9
 

3. 4 గంటల 24 నిమిషాల నిడివి గలిగిన ఈ సినిమా చిత్రీకరణ కేవలం 43 రోజుల్లో పూర్తి అయ్యిందంట.
 
dvsc original
 
4. బాలకృష్ణ, హరికృష్ణ, ఎన్టీఆర్ కలసి నటించిన చివరి చిత్రం ఇది(అంతకుముందు తాతమ్మ కథ).
 
dvsc11
 
5. ఈ చిత్రానికి మాటలు అందించిన కొండవీటి వెంకట కవి కి ఇదే మొదటి సినిమా. అంతకు ముందు సంస్కృత కళాశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేసేవారట.
 
dvsc13
 
6. చలపతి రావు ఐదు పాత్రల్లో కనిపిస్తారు. అందులో మూడు పాత్రలు జరాసంద, అతిరధ, ఇంద్ర మిగతా రెండు అతిధి పాత్రలు.
 
chalapathi
 
7. బాలకృష్ణ, హరికృష్ణ లకు మేకప్ ఎన్టీఆర్ చేసేవారట.
 
dvsc2
 
8. బాలకృష్ణ, హరికృష్ణ లు కూడా కొన్ని సార్లు సెట్ లాకు పెయింట్ లు వేసేవారట.
 
dvsc1

 

9. జనవరి 14 1977 లో 14 ప్రింటులు, 15 న ఇంకో 16 ప్రింటులతో విడుదల అయిన సినిమా కోటి రూపాయల వసూళ్లు సాధించిందట.
 
dvsc14

 

10. సినిమా ఖర్చు అప్పట్లోనే 10లక్షల రూపాయలు.
 
dvsc4
 
11. 1994 లో 30 ప్రింట్ లతో రెండో సారి విడుదల అయినప్పుడు ఇంకో కోటి రూపాయల వసూళ్లు సాధించిందంట.
 
dvsc10
 
12. 4 గంటల 24 నిమిషాల నిడివి గలిగిన సినిమాలో ఎన్టీఆర్ 4 గంటల సేపు కన్పిస్తారు.
 
dvsc12
 

దర్శకత్వం చేయటమే చాలా కష్టం అలాంటిది నిర్మాత, స్క్రీన్ ప్లే తో సహా అంత పెద్ద సినిమాని 43 రోజుల్లో తీసి విడుదల చేసి వసూళ్ళ సునామి సృష్టించటం అంటే మాటలు కాదు. బహుశా.. యుగ పురుషుడు అని ఆయన్ని ఇందుకే అంటారేమో.

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , ,