Musings Of A Guy Who Attended His Crush’s Wedding

Contributed by Nayab Sikindar Shaik
నిన్ను ప్రేమించానని ఎప్పుడు అనుకోలేదు..!
ప్రేమించాలనీ ఎప్పుడూ అనుకోలేదు..!!
అలాగే ప్రేమిస్తానని కూడా ఎప్పుడూ అనుకోలేదు…!!!
ఎందుకంటే నాకు ఏ క్షణం ఆ ఆలోచన వచ్చిన…
నువ్వంటే ఇష్టంలేదు…
నువ్వంటే ద్వేషం…
నువ్వంటే….నాకు ప్రేమలేదు అనుకున్న..! అనుకుంటూనే ఉన్న !
అలా అనుకుంటూనే నీ పెళ్లికి వచ్చా…..
నిన్ను చూడనంతవరకు బాధ , ఆనందం రెండు ఉన్నాయి..!
ఇంకా నిన్ను చూడలేదు అనే బాధ..! నీ పెళ్లి అనే ఆనందం..!
ఆ..
పెళ్లిసందడిలో దీపాల వెలుగుల మధ్య నుంచి అలా నడుస్తూ వస్తుంటే నిన్ను చూసా…
చూసి చాలా కాలం అయ్యింది కదా…కళ్లల్లో నీళ్లుతిరిగాయి..!😢
అంతలోనే..! నీ ముఖంలో చిరునవ్వు చూసి…
ఏమైందో తెలియదు కానీ
చేతిలో పెట్టుకున్న ఐసుముక్క కరిగి నీళ్ళలా మారినట్టు…
నీ పెదాలపై నవ్వుచూసి ఆనందభాష్పాలు కాస్త కన్నీటి భాష్పలుగా మారాయి..!
ఆశ్చర్యంగా ఉంది కదూ…?
నీకే కాదు…నాకు కూడా అలాగే ఉంది..!
ఇష్టంలేదు , ప్రేమించలేదు…అనుకున్న వ్యక్తికి పెళ్లి జరుగుతుంటే
స్థిరంగా ఉండాలి…లేక ఆనందంగా ఉండాలి…!
ఏమంటారు ?
అంతేకాని కంట్లోంచి నీళ్లు రావడం….. ఏంటి…విచిత్రంగా..!
నేను ప్రేమించలేదు కదా..!
నాకు తనంటే ఇష్టంలేదు కదా ! మరి ఎందుకీ కన్నీళ్లు ?
తను నా నుంచి దూరంగా వెళ్లిపోతుందన ?
కాదు.! ఎందుకంటే తాను నాకు భౌతికంగా దూరంగా ఉన్న…
ఎల్లప్పుడూ నా ఆలోచనల్లో నాకు దెగ్గరగానే ఉంటుంది..!
మరి తనని చూడలేకపోయానాన ?
ఈ క్షణం తనని పెళ్లిలో చూస్తున్నానుగా…!
మరి అయితే ఎందుకీ కనీళ్లు ? ఎందుకో తెలుసా ?
నేను తనని ప్రేమించుండక పోవచ్చు…!
నేను తనని ద్వేషించుండోచ్చు…!
కానీ…
తన చూపులను , చిరునవ్వును చూసి చాలా అర్ధం చేసుకున్న…!
ఎంతలా అంటే…
చివ్వరికి నాకు తెలియకుండానే నేను తనని ప్రేమించానని గ్రహించలేకపోయా…!
అలా నేను ఎంతగానో ప్రేమించిన , ఎంతగానో ద్వేషించిన , ఎంతగానో కావాలనుకున్న …
మనదిలే ఎక్కడికి పోతుంది అనుకున్న తనకి మన ముందే …
పెళ్లి జరుగుతుంటే….
ఆ క్షణంలో తన ముఖంపై చిరునవ్వుంటే…కానీళ్లు రాకుండా ఎలా ఉంటాయి..!
ఇక ! ఏదో ఒకరోజు వస్తుందిలే అనే ఆలోచన లేదు…
శాశ్వతంగా వెళ్ళిపోతుంది..!
ఈ పెళ్లి జరిగే లోపు….
కొద్ధి క్షణాల పాటు…తను నాది అనే భ్రమలో
తన కోసం చివ్వరి నెత్తుటి కన్నీరు కారుస్తున్న…
సినిమ్మల్లో చూసి ఎదో అనుకున్న…
మొదటిసారిగా నీవల్ల అనుభవించినప్పుడు అర్ధమైంది ఆ భాదేంటో అని..!
ఏడవడం , బాధపడటం , కనీళ్లు రాల్చడం చూసి ‘నటన’ అనుకున్న….
ఆ సందర్భాన్ని అనుభవించినప్పుడు తెలిసింది…
మనం ప్రేమించిన వాళ్ళకి మనముందే పెళ్లి జరుగుతుంటే
ఎవ్వరికి చెప్పుకోవాలో తెలీక , తమలో తాము కుమిలిపోతున్న వాడి గుండె నిగ్రహానికే తెలుసు ” నిజమైన ప్రేమ అంటే ఏంటో ” !
ఆ క్షణంలో ప్రేమ గురించి మాట్లాడే అర్హత అతనికి తప్ప ఆ భగవంతునికి కూడా ఉండదేమో…
ఆ నిమిషం నాకు తెలిసింది , నిస్సహాయ స్థితిలో ఉండే వాడు అనుభవించే నరకమెంతో అని..!
If you wish to contribute, mail us at admin@chaibisket.com