A Poem Asking Revolutionary Poet Sri Sri Garu To Come Back Again & Inspire Us!

 

శ్రీశ్రీ,తన కవితలనే కాగడాలుగా చేసుకొని చీకటిని పారద్రోలిన కవి.తన కలాన్నేశతఘ్నిగా మార్చి,అగ్నిగోలాల్లాంటి కవితలతో కోట్ల మంది మనస్సులో జ్వాలని రగిలించాడు.ఎన్ని తరాలకైనా స్ఫూర్తి శ్రీశ్రీ,తెలుగు వాడి కీర్తి శ్రీశ్రీ.

నేటి సమాజానికి శ్రీశ్రీ అవసరం ఎంతో ఉంది,మనం వేసుకున్న ముసుగులు తెలగించేందుకు, మనల్ని భ్రమల్లోంచి బయటకి
తీసుకొచ్చేందుకు,మనం ముందు ఉన్న చీకటి పొరల్ని తొలగించేందుకు శ్రీశ్రీ మళ్ళీ రావాలి.ఊహా లోకంలో విహరిస్తున్న మనకి వాస్తవ
ప్రపంచాన్ని పరిచయం చేసేందుకు శ్రీశ్రీ కావాలి.రండి అందరం ముక్తకంఠంతో పిలుద్దాం.

ఓ శ్రీశ్రీ నువ్వు కావాలోయ్ ఈ నవ శకానికి
ఓ శ్రీశ్రీ నువ్వు రావాలోయ్ ఈ శోకం
తీర్చడానికి..

యవ్వనంలో వార్ధక్యాన్ని అనుభవిస్తున్న యవ వృద్ధుల కోసం నువు రావాలి

నైరాశ్యాలు,నిర్వేదాలతో ఆగిపోయిన మమ్మల్ని కదిలించేందుకు నీ కవితలు మళ్ళీ కావాలోయ్ శ్రీశ్రీ ….

అంతరంగాలలో అంతర్యుద్దాలు చేస్తున్న నేటి యువతకి నీ పాఠాలు మళ్ళీ కావాలోయ్ శ్రీశ్రీ….

ఈ ప్రపంచ పద్మవ్యూహాన్ని చేధించేందుకు,అనంత విశ్వపుట౦చులు చేరేందుకు నువు మా తోడుండాలోయ్ శ్రీశ్రీ…..

నిస్తేజంతో నలిగిపోతే,నిస్సతువ,నిస్పృహలు కుంగదీస్తే,శ్రీశ్రీ….నీ కవితలూ,నీ మాటలే ఉత్సాహన్నీ,ఉత్తేజాన్నీ నింపే ఉత్ప్రేదకాలు…

నిర్జీవంగా పడివున్న జీవచ్చవాలని సైతం పునరుత్తేజితులని చేసి ఊపిరి పోసే శక్తి నీ మాటలకే ఉంది..

అందుకే నువ్వు మళ్ళీ రావాలి…

గాధనిద్రలో ఉన్న సమాజాన్ని దీర్ఘసృతితో,తీవ్రధ్వనితో నీ కవితాశంఖారావంతో నిద్రలేపాలి..

పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైపైకి అని ఒక్కసారి నీతో గొంతుకలిపి పాడేందుకు…

కదం తొక్కుతూ పదం పాడుతూ మరో ప్రపంచంవైపు నీతో కలిసి అడుగేసేందుకు నువ్వు రావాలోయ్ శ్రీశ్రీ…

శ్రీశ్రీ నువు వస్తాయన్న ఆ జగన్నాథ రధచక్రాలు ఇంకా రాలేదు,ఎక్కడ ఆగిపోయాయో

నువు రా శ్రీశ్రీ మనం కలిసి వెళ్లి ఆ రధాలను భూమార్గం పట్టిద్దాం,భూకంపం సృష్టిద్దాం…

మమ్మల్ని మునుముందుకు నడిపించేందుకు,మా పెను నిద్దుర వదిలించేందుకు,మాకు పరిపూర్ణపు బ్రతుకునిచ్చేందుకు నువ్వు
రావలోయ్ ….

కథా వశిష్టులమై,వ్యధావిశిష్టులమై,పరిచ్యుతులమై పిలుస్తున్నాము ఒక్కసారి రా శ్రీశ్రీ

ఇదిగో శ్రీశ్రీ ఇక్కడ నిలబడి ఆహ్వానిస్తున్నాను నిన్ను…..రా….. కలసి చేద్దాం మరో మహా ప్రస్థానం…….

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , ,