10 Times When Tollywood Lyricists Described Cities Beautifully With The Highest Lyrical Value!

 

అందాన్ని మరింత అందంగా అద్భుతంగా వర్ణించడం చాల క్లిష్టమైనది . మన తెలుగు సినిమాలలో సందర్భానుసారంగా కొన్ని నగరాల గురించి పాటలు ఉంటుంటాయి . వందల ఏళ్ళ చరిత్ర కలిగిన అటువంటి నగరాల వైభవాన్ని, ప్రాశస్త్యాన్ని పండిత పామర జనరంజకంగా అద్భుతమైన సాహితి విలువలతో రాయడం లో మన తెలుగు రచయిలతది అందె వేసిన చేయి . మన తెలుగు రచయితల చేత పాటల రూపం లో అత్యబ్దుతంగా వర్ణింపబడిన కొన్ని నగరాలూ …ఆ పాటలలో మన రచయితల చేసిన పద ప్రయోగాలు ఓసారి మనమూ చూద్దాం …. మన రచయితలకి కృతజ్ఞతలు చెప్పుకుందాం ఇంతటి గొప్ప సాహిత్యాన్ని మనకందించినందుకు……

 


1. హైదరాబాద్ నగరాన్ని, విశేషాలను వివరిస్తూ సినారే గారు రాసిన గీతం
చిత్రం మట్టిలో మాణిక్యం – పాట రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్
ఒక తలపై రూమి టోపీ ఒక తలపై గాంధీ టోపీ
క్యా భాయ్ అని అంటాడొకడు ఏమోయ్ అని అంటాడొకడు
మతాలు భాషలు వేరైనా మనమంతా భాయి భాయి
రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్


 


2. అమెరికా గొప్పతనాన్ని గూర్చి చెబుతూ అంతర్లీనంగా జీవిత సారాన్ని ఈ పాటలో పొందుపర్చారు వేటూరి గారు – చిన్నికృష్ణుడు చిత్రం, పాట-జీవితం సప్త సాగర గీతం
ఏది భువనం ఏది గగనం తారా తోరణం – ఈ మియామి సియర్స్ టవరు స్వర్గ సోపానమూ
ఏది సత్యం ఏది స్వప్నం డిసినీ జగతిలో – ఏది నిజమో ఏది మాయో తెలియని లోకము.
హే…బ్రహ్మ మానస గీతం – మనిషి గీసిన చిత్రం
చేతనాత్మక శిల్పం – మతి కృతి పల్లవించె చోట


 


3. కలకత్తా నగరాన్నీ విశ్వకవి రవీంద్రుడు కూడా వర్ణించంత గొప్పగా వర్ణించారు వేటూరి గారు
చూడాలని ఉంది చిత్రం – పాట – యమహా నగరి
వందేమాతరమే అన్న వంగా భూతలమే మిన్న జాతికే గీతిరా
మాతంగి కాళినిలయ చౌరంగీ రంగుల దునియా నీదిరా
వినుఁగురు సత్యజిత్రే సితారా ఎస్ డి బర్మన్ కి ధారా థెరెసా కి కుమారా కదలి రారా
జనగన మనముల స్వరపద వనముల హృదయపు లయలను
శృతిపరచిన ప్రియ సుఖ పిక ముఖ సుఖ రవళులతో


 


4. రాయలసీమ లో జనించిన మహామహుల గూర్చి చెబుతూ సీమ గొప్పతనాన్ని ఈ పాటలో చంద్రబోస్ గారు చక్కగా ఆవిష్కరించారు – చిత్రం సీతయ్య
ఇదిగో రాయసీమ గడ్డ దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డా
హరుని కంటికి కన్నర్పించిన కన్నప్ప భక్తవరుడు
విజయనగర సామ్రాజ్య ధురంధర కృష్ణరాయ భూ విభుడు
చరిత్రకెక్కిన ధరణి ఇది – పదాలనే స్వరపధాన నడిపిన అన్నమయ్య కృతులు
ఇహపరాల కలిపినా వీరబ్రహ్మేంద్ర తత్వ గతులు – అలలై పొంగిన అవని ఇది


 


5. కాశి నగరాన్ని తన సాహిత్యం తో మన కనుల ముందుకు తీసుకొచ్చారు సిరివెన్నవారు చిత్రం ఇంద్ర , పాట – భమ్ భమ్ బోలె
వారణాసిని వర్ణించే నా గీతికా – నాటి శ్రీనాధుని కవితే వినిపించగా
ముక్తి మార్గం చూపే మణికర్ణికా – అల్లదె అంది నా ఈ చిరుఘంటిక
నమక చమకాలై ఏద లయలే కీర్తన చేయగా – యమకు యమకాలై పదగతులే నర్తన చేయగా
ప్రతీ అడుగు తరిస్తుంది ప్రదక్షిణగా – విలాసంగా శివానంద లహరి మహాగంగా ప్రవాహంగా మారి


 


6. అమెరికా కి అందమైన అమ్మాయికి పోలిక పెడుతూ చంద్రబోస్ గారు రాసిన గీతం – చిత్రం ప్రేమాయనమః
అమెరికా అమెరికా అందమైన అమ్మాయ్ లాంటి అమెరికా
అంతులేని ఆనంద నిధుల అమరిక
ఎంతచూసినా తనివి తీరని కవలిక
ఎంతచదివిన అర్ధం కానీ తికమక


 


7. మదురై కి మన తెలుగువారికి గల సంబంధాన్ని తన పదాలతో అద్భుతంగా వివరించారు వేటూరి గారు – చిత్రం అర్జున్ – పాట – మధుర మధుర తర మీనాక్షి
మధురానీలు మా తెలుగు నాయకుల మధుర సాహితీ రసికతలో
కట్టబొమ్మ తొడగొట్టి లేచిన తెలుగు వీర ఘన చరితలలో
తెలుగు తమిళం జత కట్టెనెన్నడో మీనాక్షి
మనసు మనసు ఒకటైన జంటకి నీ సాక్షి


 


8. హిమానీనదాల్లో ఉన్న బదరికాశ్రమం వైభవాన్ని తనదైన శైలిలో అందించారు వేటూరి గారు
చిత్రం బద్రీనాథ్ – పాట – ఓంకారేశ్వర శ్రీహరి నగరి
హరి పాదం అడుగున గంగ – కలి పాపం తను కడగంగా – కనులే కనలేని విరజానది ఇల దిగి రాగా
కలలా కనిపించే జల ధార సరస్వతి పొంగ – సుడులు తిరిగి వడిగ ఉరుకులెత్తగ
చెడులు కడిగి పుణ్య ఫలమునివ్వగ శ్రుతులు కృతులు జతులు గతులు చెలరేగా…..
ఓంకారేశ్వర శ్రీహరి నగరి ఇదుగోరా బదరీ


 


9. పాత కొత్త ల కలయికే హైదరాబాద్ నగరం అని సులభంగా భాగ్యనగరం గురించి వర్ణించారు విశ్వా గారు – చిత్రం హ్యాపీ
ముత్యాలు గాజులు షెహరు అనుకుంటే పొరబడతారు – మనుముందుకు సాగే తీరు గమనిస్తే జై కొడతారు
మన గోల్కొండ సాలార్ జంగ్ చార్మినార్ – ఘన చరితేలే అని చెపుతుంటారు
కానీ చీటికీ మాటికీ నెక్లెస్ రోడ్లు ఐమాక్ హాళ్లు – తెగ సరదాగా ఎప్పుడు చుడుతుంటారు
చల్ చల్ రే చల్ మేరె సాతి హమ్ బన్గయే హైదెరాబాదీ


 


10. రాయలసీమ గడ్డ వైభవాన్ని సులభసరళంగా వర్ణించారు గోరెటి వెంకన్న గారు, చిత్రం శ్రీ రాములయ్య
హరి హర బుక్కరాయ అడవికేటకెళితే కుందేళ్లు కుక్కలా యెంత బడ్డాయంటే
పౌరుషాల పురిటి జీవ గడ్డమ్మో ….. జీవ గడ్డమ్మో
సత్రాలు సాధువులు భైరాగి తత్వాలు సీమ ఊరుఊరునా మారుమోగుతాయి
శిధిలమైన గుళ్ళు శివ నందులమ్మో …… శివ నందులమ్మో
వీర బ్రహ్మం మతము సీమకే మకుటం
ననుగన్న నా తల్లి రాయలసీమ రాతనాలసీమ తనువెల్ల తరగని గనులున్న సీమ గిరులున్న సీమ


 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , ,