సిగరెట్ మాట్లాడితే : If Cigarette Had A Voice, This Is What It’d Say To Us

అవును నన్ను తాగకండి ప్లీజ్.

నన్ను తాగితే  ఏం మజా వస్తది రా మీకు, నా వాసన ఎలా ఉంటుందో.. నన్ను తాగాక మాట్లాడే మీ Friends తో (ఉంటే girlfriend తో) మాట్లాడతావ్ కదా వాళ్ళని అడుగు చెప్తారు.

నన్ను తాగక ఆ వాసన రాకుండా ఉండటానికి halls లు, center ఫ్రెష్ లు  (ఎమన్నా తిట్టుకోండి నాకు తిట్లు రావు) తాగడం ఎందుకు, హాల్స్ వేసుకోవడం ఎందుకు. నన్ను తాగుతూ ఎంత style గా నుంచుంటావో సామి, ఇలానే నన్ను packetlu, packetలు కానిచేస్తే.. future లో అసలు నుంచో గలవో లేదో చూస్కో.

నన్ను ఎవడైనా తాగేసేలోపు. తనలో చేర్చుకునే లోపు నా బాధ చెప్పేసుకుందామని ఫిక్స్ అయ్యా..

ఈ పొగ తాగడం అనే concept లేకపోయుంటే , నేను చెట్టు గానే మిగిలే వాడ్ని ,అస్సలు పుట్టేడోడ్ని కాదు , పీడా విరగడయ్యేది.

మీరు తాగుతారు కాబట్టే గా నన్ను పొగాకు గా పుట్టించారు. సరే పుట్టించారు  పర్లేదు. సిగరెట్ గా మార్చారు.  ఆలా మారిన నన్ను ముట్టించి ఆవిరిలా మార్చి మీలోకి నన్ను పంపిస్తే నాకెంత బాధ గా ఉందొ తెలుసా. నరకం అనుభవిస్తున్న…

మీ కడుపులో పెరిగే మురికికి అనారోగ్యానికి, దాన్ని వల్ల మీరు పడే బాధకి మూల కారణం నేను అని తెలిసిన ప్రతి క్షణం మీలోపల అణువు గా మారిన నేను అనుభవిస్తున్న బాధను చెప్పలేను.

నువ్వు దగ్గుతున్న ప్రతిసారి, నీ భార్య పడే బాధ . పిల్లలు పడే దిగులు. నాకు అర్థం అవుతోంది నీకు ఎందుకు అర్థం కావట్లేదు.

ఇప్పుడిప్పుడే నన్ను తాగడం మొదలు పెట్టిన పిల్లలని చూస్తుంటే, వాళ్ళ భవిష్యత్తుని ఎలా చూస్తానో అనే భయం వేస్తుంది.

నన్ను తాగుతూ ఒక కవి రాస్తున్న పుస్తకాన్ని చూస్తున్న ప్రతి సారి ఆ కాగితంగా మారిన ఆ చెట్టు వరాన్ని చూసి, సిగరెట్ గా మారిన నా శాపాన్ని చూసి ఎక్కడలేని కుళ్ళు వచ్చేస్తుంది.

జీవితం పెట్టె బాధలని తట్టుకోలేక, ఒత్తిళ్ల ని face చేయడం avoid చేయడానికి నన్ను ఒక సాకు గా ఉపయోగించే ప్రతి సారి, వీళ్ళకి బతికే ధైర్యం ఇమ్మని ఎందరి దేవుళ్ళకి మొక్కుతానో..

నా వల్ల అండగా నిలవాల్సిన వాళ్ళని  పోగొట్టున్న కుటుంబాలకు ,  ఎన్నో కలలకి ప్రతిరూపంగా పెంచుకుంటున్న కొడుకుని పోగొట్టుకున్న తల్లులకు క్షమాపణలు చెప్పుకుంటున్న.

నన్ను తాకద్దు అన్న అమ్మాయిని తాకే మీరు, నన్ను తాగొద్దు అని ప్యాకెట్ పై చెప్తున్నా నన్ను తాగే మీరు. మారేవరకు, దయచేసి సమాజం లో జరగాల్సిన మార్పులు గురించి నన్ను తాగుతూ discussion పెట్టకండి.
ఫైనల్ గా ఒక్క మాట. నన్ను తాగకండి మీరు పోవడం నాకిష్టం లేదు.

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , ,