చిన్ననాటి జ్ఞాపకాలు…మరిచిపోలేని గురుతులు…తరిగిపోని సిరులు!

ఈ ఆటలు గుర్తున్నాయా మీకు….అసలు ఉంటాయనైన తెలుసా !?
 
తాడు గట్టిగా చుట్టి విసురుతుంటే… పక్కోడి బొంగరాన్ని గింగిరాలు తిరిగేలా కొట్టేవాళ్ళం.
నేల మీదే కాదు అర చేతి మీద తిప్పే వాళ్ళం గుర్తుందా !!!
 
1
 
అర్ధ రూపయిస్తే సోడా ఇచ్చే వాళ్ళు…తాగుతుంటే అదో మజా…
కలర్ సోడా అయితే మహా సరదా…కొట్టినప్పుడు వచ్చే పుస్.. సౌండ్ మర్చిపోగలమా??
 
2
 
ఏది కొట్టాలో చెప్పు….అర్జునిడి బాణం అయిన మిస్ అయ్యిద్దేమో కాని మన గురి తప్పదు అసలు.
డబ్బాలు డబ్బాలు నింపే వాళ్ళం గెలిచిన గోళీలతో !
 
3
 
ఎండా కాలం మధ్యానం టైం కి వచ్చేస్తారు.. పుయ్యుం పుయ్యుం అంటూ సౌండ్ చేసుకుంటూ..
కలర్ ఐస్.. సేమియా ఐస్ అంటూ అబ్బో ఎన్ని రుచులో…!
 
4
 
సైడు తొక్కుడు ఓకే కాని సీటు ఎక్కి తోక్కుతున్నడంటే హీరో అన్నట్టె ఆ రోజుల్లో…
సొంత సైకిల్ ఉందంటే దేవుడే … ఒక్క రౌండ్ ఇవ్వరా నువ్వేం చెప్పినా చేస్తా !!
 
7
 
పావలాకి నాలుగు ఇచ్చే వాళ్ళు…నలుపు ఎరుపు పసుపు నారింజ ఎన్ని రంగులో…
ఒక్కటి సప్పరించటానికి మినిమం పావు గంట వీజి గా పట్టేది
ఏదైనా నిమ్మ తొనలు సప్పరిస్తుంటే వచ్చే కిక్కే వేరబ్బ !!
 
8
 
వర్షం పడి నీళ్ళు ఆగితే చాలు…పాత పేపర్లు అన్ని పడవలై పోయేవి
పేపర్ చించటం సగానికి మడవటం పడవ చేసేయ్యటం కాలవలో వదిలెయ్యటం
తెర చాప పడవ, కత్తి పడవ…నా పడవ ఇంకా మునగాలే రా, అగొ భద్రయ్య కొట్టు దాటేసింది !!!
 
10
 
ఆడటానికి ఏమి లేవా.. అయితే ఐదు రాళ్ళు దొరికితే చాలు..
రాళ్ళతో వేళ్ళ మీద సర్కస్ చేయించే వాళ్ళం… అచ్చెం గిల్లలు !!
 
11
 
పిస్తోలు రీళ్ళు..పిస్తోలు ఉండేది కాదు కాని రీలు కొనేవాళ్ళం
గోడ కేసి గీకటమో..రోడ్ మీద రాకటమో..ఏం చేసినా సౌండ్ మాత్రం పక్కా
దీపావళి కి నెల ముందు, ఆ తర్వాతా వీటి హడావిడి తగ్గేది కాదు !!
 
12
 
ఏడు రాళ్ళూ ఒక దాని మీద ఒకటి పెట్టి ఒక బంతి తీసుకొని కొట్టటం ఏంటో…
వాటిని తిరిగి ఒక దాని పై ఒకటి పెట్టటం ఏంటో…అలా పెట్టె వాడి వీపు పగల కొట్టటం ఏంటో !!
 
14
 
పండక్కి తాత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత గొడవ చేసేవాళ్ళమో
గోలి సోడా తాగటం సరదా అయితే గోల్డ్ స్పాట్ తాగటం పండగన్నట్టే లెక్క.. !!
 
5
 
అష్టా చెమ్మ.. ఇంట్లో ఆడనిచ్చేది కాదు అమ్మ
నాలుగు చింత పిక్కలు ఏరుకొని.. బండ కేసి రుద్ది రుద్ది సగం చేసి.. ఎక్కడ ప్లేస్ ఉంటె అక్కడ
సుద్ద ముక్కతో గీసేసి ఆడటం మొదలెట్టే వాళ్ళం.. గవ్వలు ఉన్నాయంటే సూపర్ ఎహే !
 
15
 
దీపావళి అంటే మర్చిపోలేని ఇంకో సూపర్ ఐటెం….పాం బిళ్ళలు
రూపాయికి ఓ పాకెట్టు.. పాకెట్టుకు పన్నెండు వరకు ఉంటాయి..
ఒక అగ్గి పెట్టె.. అంటిస్తే చాలు అందరికి వీజీగా తెలిసిపోయేలా వాసన, పొగ వచ్చేది!
 
13
 
ఒంగుడు దూకుడు…మోకాళ్ళ చిప్పల మీద మరిచిపోలేని గురుతులు మిగిల్చింది
దెబ్బ తగిలినా ఆగుతామా అంటే లేదు..దూకు నా సామిరంగా.. దూకు !!
 
9
 
పతంగుల గొడవలు…మనీ ఉంటె మాంజా కొనటం.. లేపోతే దారం తోనే వేసేయ్యటం
రేయ్ నాది ఎక్కువ పైకి పోయింది…నాది తెంపుతావా సచ్చావ్ రా నా చేతిలో.. !!
 
6
 

 
ఒక్కటని కాదు.. కర్ర బిళ్ళ, కోతి కొమ్మచ్చి, పిచ్చి బంతి అంటూ వీపు పగలకొట్టటం, రాముడు సీత, పేపర్ల మీద నాలుగైదు పేర్లు రాసి ఆడిన షో ఆట, కూల్ డ్రింక్ మూతలతో పెంకులాట, రాళ్ళతో ఆడిన ఆట, దాగుడు మూతలు, దొంగ పోలీస్, గ్రీటింగ్ కార్డులు గాల్లో ఎగరేయటం, రింగ్ రింగ్ రింగ్ రింగ్ … స్టాప్ అబ్బో ఇంకా ఎన్నో …
 
జ్ఞాపకాల ఊరికి ప్రయాణం మొదలెట్టాలి కాని బస్సు ఎక్కిన దగ్గరి నుండి ప్రతి మలుపు లో తెలీని ఆనందం, ప్రతి కుదుపు లో ఏదో సంతోషం, ప్రతి స్టాప్ లో కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది.
మరి ఇంకెందుకు లేటు… బస్సెక్కి అనేయండి. రై రైటు…. రై రైటు…

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , ,