Checkout What “TNR” Had To Say About Our New Short Film “Kalakarudu”!

 

Chaibisket’s new short film “Kalakarudu” released yesterday and the response we received was truly overwhelming. And out of all this a small surprise for the team was TNR’s take on Kalakarudu.

Here’s what he had to say to about our short film:

“ఆత్మసంతృప్తి లేకుండా చేసే ప్రతీ పని ఆత్మహత్య తో సమానం”
—————————————————————
10నిమిషాల డ్యూరేషన్ ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్ ఇప్పుడే చూశాను, రెగ్యులర్ రొటీన్ ప్రేమ,హార్రర్,కామెడీ షార్ట్ ఫిలింస్ తో విసిగిపోయి ఉన్న మీకు ఒక కొత్త హార్ట్ టచింగ్ ఫీలింగ్. నేను చాలా రోజుల తర్వాత షేర్ చేస్తున్న ఒక షార్ట్ ఫిల్మ్ తక్కువ ఆర్టిస్ట్స్ తో చాలా కాంపాక్ట్ బ్లాక్స్ లో ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చెయ్యడం ఎలాగో అప్పుడెప్పుడో సంతోష్ శివన్ చేసిన “ది టెర్రరిస్ట్” సినిమా లో చూశాను. 18 సంవత్సరాల క్రితం ఆబిడ్స్ స్వప్న థియేటర్ లో చూసిన ఆ సినిమా ఫీల్ నాకు ఇంకా గుర్తుంది. మళ్ళీ సరిగ్గా అదే ఫీల్ నాకు ఈరోజు కలిగింది. ఈ పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ లో అన్ని డిపార్ట్మెంట్స్ పనితనం కనపడింది.
ART – filmian
CAMERA – Venkata ramana
MUSIC – Karthik
EDITING – Pavan

ఇలా అందరూ వాళ్ళ వర్క్ ని చాలా అద్భుతంగా చేశారు. ఒక సినిమాకు తీసుకోవాల్సినంత పాషన్ తో ఆర్ట్ వర్క్ చేశారు.

ఫైనల్ గా ఈ సినిమా డైరెక్టర్ తిలక్…
[టైటిల్స్ లో తిలక్ అని ఉంది..ఫేస్ బుక్ లో నితిన్ అని ఉంది .ఏది కరెక్టో తెలీదు నాకు]
ఈయన వయసెంతో నాకు తెలీదు. ఇంతక ముందు ఏం చేశాడో కూడా నాకు తెలీదు. బట్ గొప్ప టేస్ట్ తో చాలా మెచ్యూరిటీ తో తీశాడు. ఇలాంటి షార్ట్ ఫిల్మ్ కి డబ్బులు ఖర్చు పెట్టిన నిర్మాతలు అనురాగ్ & శరత్ ని ఖచ్చితంగా అభినందించాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ఇందులో ముఖ్య పాత్ర వేసిన సుహాస్ ని చివర్లో ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అతని వాయిస్ లోని బేస్,కళ్ళలో ఉన్న ఇంటెన్సిటీ అద్భుతం.. చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు.

చాలా మంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఆలోచనని ఈ ఫిల్మ్ మారుస్తుందని నమ్ముతున్నాను. ఇలాంటి డెడికేషన్ మరియు పాషన్ తో చేసే మీ ఈ పని మిమ్మల్ని అందనంత ఎత్తుకి తీసుకెళ్తుంది. చివరగా ఈ షార్ట్ ఫిల్మ్ లో వీళ్ళు చెప్పిన మాటతోనే ముగిస్తాను.
“ఆత్మసంతృప్తి లేకుండా చేసే ప్రతీ పని ఆత్మహత్య తో సమానం”

ఇలాంటి మంచి షార్ట్ ఫిలింస్ తద్వారా గొప్ప సినిమాలు రావాలనే ఆకాంక్ష తోనే ఒక బాధ్యత తో నేను ఈ పోస్ట్ పెడుతున్నాను. ఈ షార్ట్ ఫిల్మ్ తప్పకుండా చూడండి. ఈ షార్ట్ ఫిల్మ్ చూడటానికి మీ జీవితం లో విలువైన ఒక పది నిమిషాలు ఖర్చు చేసినా అంత కన్నా విలువైన పది విషయాలు ఖచ్చితంగా తెలుసుకుంటారు. నాది గ్యారెంటీ..
థ్యాంక్యూ – TNR

 

ICYMI Here’s The Video:

 

 

Also Do subscribe to “Chaibisket Shorts” here.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , ,