Here’s Our Tribute To The CEO Of Andhra Pradesh!

 

తిరుపతి నుండి తిరుమల శ్రీవారి దర్శనానికి మెట్ల మార్గంలో కాలినడకన వెళ్ళాలి.. 20 ఏళ్ళ వయసులో ఉన్నవాళ్ళు కూడా చమటలు కక్కి ఆపసోపాలు పడుతూ విశ్రాంతి తీసుకొని వెళ్తారు.. ఒక వ్యక్తికి ఆరవై సంవత్సరాలు ప్రభుత్వ అంచనా ప్రకారం 60 దాటిన వారిని వృద్ధులుగా పరిగనిస్తారు… అలాంటి వయస్సులో ఉన్న వ్యక్తి ఆగకుండా, ఏ అలుపు లేకుండా తిరుమల కొండను ఎక్కేశాడు… తనతో ఉన్న సెక్యురిటీ సిబ్బంది సైతం ఆయన వేగాన్ని అందుకోలేక పోయారు.. ఇంతకి ఎవరా వ్యక్తి ? ఆ వ్యక్తే నారా చంద్రబాబు నాయుడు. మీకో ఆలోచన రావచ్చు.. అదేంటి ఒక రాజకీయ నాయకుడు గురుంచి వివరించాలంటే ఆయన సాధించిన విజయాల గురుంచి చెప్తారు కాని అతని ఫిట్ నెస్ గురుంచి చెప్పడమేంటి? అని… కాని ఒక లీడర్ మంచి క్రమశిక్షణ మూలంగ కూడా దేశభవిషత్తు మూడిపడి ఉంటుంది దానిని బలంగా నమ్మే వ్యక్తి చంద్రబాబు… అందుకే ఆయన ప్రతిరోజు ఉదయం 4గంటలకే నిద్రలేస్తారు, యోగా, మెడిటేషన్, శారీరక వ్యాయమం చేశాకనే మిగితా కార్యక్రమాలు, శాకహారం మాత్రమే తీసుకుంటారు.. అలాంటి నిబద్ధత వల్లనే 62 సంవత్సరాల వయస్సు లో, 208 రోజులలో 2800 కిలోమీటర్లు పాదయాత్ర చేసి తెలుగు దేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చాడు… ఇప్పుడు ఏ దిక్కు లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్వతం లాంటి నమ్మకం ఒక్క చంద్రబాబు..

1

 

చంద్రబాబు పుట్టింది ఒక సాధరణ మధ్యతరగతి రైతు కుటుంబంలో… చిన్నతనం నుండి కష్టపడి ఇంటినుండి కిలోమీటర్ల నడక దాటి చదువును చేరుకునేవాడు..అలానే ఎం.ఏ ఎకనామిక్స్ పూర్తి చేశాడు.. Ph.D చేస్తున్న సమయంలో రాజకీయాలలోకి మొదటిసారిగా కాంగ్రేస్ పార్టిలోకి వచ్చి కేవలం 28 సంవత్సరాలకే M. L. A గా Ministry గా తన భాద్యతలను నిర్వహించాడు… ఆయన ప్రతిభకు ముగ్ధుడైన ఎన్.టి.ఆర్ తన మూడో కూతురు భువనేశ్వరితో పెళ్ళిచేశారు.. 1983 లో N.T.R పార్టి స్థాపించిన కూడా చంద్రబాబు కాంగ్రేస్ లోనే కొనసాగారు.. తరువాత N.T.R కోరిక మేరకు టి.డి.పి లోకి వచ్చారు..తరువాత కొన్ని రాజకీయ కారణాలతో టి.డి.పి ని చంద్రబాబు తన ఆధినంలోకి తీసుకున్నారు..

NTR-Chandrababu-Naidu

 

ఇక ఆరోజు నుండి అప్పడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భవిషత్తునే మార్చేశారు.. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ ని.. హైదరాబాద్ అంటే గోల్కొండ, బిర్లామందిర్, చార్మినార్ మాత్రమే గుర్తించే ఈ ప్రాంతాన్ని నేడు ప్రపంచంలోనే హైదరాబాద్ అంటే ఒక ఐటి సంచలనంగా తీర్చిదిద్దారు.. ప్రత్యక్షంగా లక్షల్లో ఐ.టి ఉద్యోగులు, పరోక్షంగా ఇంకెంతో మంది కి ఉపాది కల్పిస్తున్నారు. ఈరోజు వేలకోట్ల బిజినెస్ తో ఐటి రంగం కలకలలాడుతుంది… దీనంతటికి ముఖ్య కారణం ఒక్క చంద్రబాబు… అమెరికా లాంటి దేశాలకు వెళ్ళి ప్రపంచంలోనే అత్యత్తమ సాఫ్ట్ వేర్ దిగ్గజాలతో మాట్లాడి తెలుగు వారిపై నమ్మకం కలిగించి Microsoft, Dell, Google, IBM, Deloitte, Oracle లాంటి దిగ్గజాలను ఆహ్వానించి వారి పెట్ట్టుబడులతో మన హైదరాబాద్ ను ప్రపంచమంతా గమనించేలా అభివృధ్ది చేశారు.. భారతదేశానికి వచ్చే అత్యుత్తమ నాయకులందరు హైదరాబాద్ ను Visit చేసేంత స్థాయికి పెంచారు… అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, టోని బ్లేయిర్ (UK Prime Minister) లాంటి Leaders హైదరాబాద్ ను సందర్శించారు..ప్రధాన మంత్రి నరేంద్రమోడి అంతటి వ్యక్తి కూడ చంద్రబాబును ఆదర్శంగా తీసుకొని గుజరాత్ ను అభివృద్ధి చేశానని చాల సంధర్భాలలో చెప్పారు..ఏ ఆహ్వనం లేకపోయినా హైదరాబాద్ లో జరుగుతున్న అద్భుతాలను పరశీలించడానికి Microsoft Chief బిల్ గేట్స్ వచ్చాడంటే చంద్రబాబు ప్రతిభను అర్ధం చేసుకోవచ్చు…

4

 

అంతే కాదు నేడు మనం వాడుతున్న Computers, Laptops, Smartphone లాంటి వస్తువులు ఇంత తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయంటే దానికి ఆనాడు బాబు నాటిన ఐ.టి విత్తనాలే కారణం… ఐటి ఒక్కటే కాదు జన్మభూమి, డ్వాక్రా గ్రూపులు, రైతు బజార్, శ్రమధానం లాంటి ఎన్నోRevolutionary కార్యక్రమాలు రూపొందించారు.. గవర్నమెంట్ లో అవీనితి జరగుకుండా ఈ సేవ లాంటి ఆన్ లైన్ పద్ధతులు మొదలుపెట్టారు. వరుసగ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 10 సంవత్సాలు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని పార్టీని ప్రభుత్వాన్ని సమర్ధవంతంగా నడిపిస్తున్నారు..ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ నుండి నేటి సోనియ, రాహూల్, వైస్.రాజశేఖర్ రెడ్డి, వైస్.జగన్ వరకు ఎంతోమందిని సమర్ధవంతంగా రాజకీయంగా ఎదుర్కుంటున్నారు..ఈ రోజు T.D.P అంటే రాజకీయ నాయకులను తయారు చేసే ఒక విశ్వవిధ్వాలయంగా మారింది.. ఏ పార్టీ లో కాని టి.డి.పి నుండి వచ్చిన నాయకులే.. స్వర్గీయ ఎన్.టి.ఆర్ తెలుగు వారికి ప్రపంచంలో ఒక గుర్తింపు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు తెలుగు వారి శక్తిని ఈ ప్రపంచానికి రుచి చూపిస్తున్నారు..

Some interesting pictures from the life of CBN

 

5

 

3

 

7

 

8

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: