Contributed By Spandana Hariesh
“Happy Engineers Day” Today is birthday of greatest engineer of our country Sri Mokshagundam Visweswarayya , Which is celebrated as engineers day in his memory . Remembering this great soul through his contribution to our holy city Tirupati and Tirumala ,His efforts for transforming the toughest route to an easily accessible road is something every engineer today should take inspiration from.As per records Tirumala Ghat road completed 74 years, which was built under his supervision and his planning , even after many years still we are using the same bus route ,One can imagine the kind of perfection in his planning ,Same goes with SV Auditorium .As citizens of this lovely city we should always be grateful for his contributions...
తిరుమల ఘాట్ రోడ్డు. ఎంత పేరుందో.. అంత ప్రమాదకరమైన మలుపులు. ఆదమరిస్తే పెనుప్రమాదం. వందల అడుగుల ఎత్తు. ఇలా ఎంతో చరిత్ర కలిగింది తిరుమల ఘాట్ రోడ్డు. తిరుమల ఘాట్ రోడ్లు మొత్తం రెండున్నాయి. మొదటి, రెండు ఘాట్ రోడ్డులుగా ఉన్నాయి. ఒక ఘాట్ రోడ్డు తిరుమలకు వెళ్లడానికి, మరో ఘాట్ రోడ్డు తిరుమల నుంచి కిందికి రావడానికి. తిరుపతి నుంచి తిరుమలకు ఘాట్ రోడ్డులో వెళ్ళాలంటే కనీసం 30 నుండి 40నిమిషాలకుపైగా సమయం పడుతుంది. అదే తిరుమల నుంచి తిరుపతికి రావాలంటే 45 నిమిషాల సమయ౦
ఘాట్ రోడ్లంటే సాదా సీదా రోడ్లు కావు. ఎన్నో మలుపులు. శేషాచలం అడవుల్లో నుంచి వేసిన రోడ్లు ఇవి. 1944వ సంవత్సరం ఏప్రిల్ 10లో నాటి ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ ఘాట్ రోడ్డును వేశారు. మొదటగా ఘాట్ రోడ్డును అప్పటి మద్రాస్ గవర్నర్ ఆర్తూర్ హోప్ ప్రారంభించారు. మొదట్లో ఘాట్‌రోడ్డులో చిన్నపాటి బస్సులు వెళ్లేవి. అవి క్రమేపి పెద్దదిగా మారాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య వేసిన రోడ్లపైనే రోడ్లు వాడుతున్నారే గానీ, వేరే రోడ్లు మాత్రం వేయలేదంటే ఆయన ఘాట్ రోడ్డు వేయడానికి ఎంత శ్రమపడ్డారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
ఎంతో ప్రమాదకరమైన మలుపుల రోడ్లను వేయడమంటే సాదా సీదా విషయం కాదు. అప్పట్లోనే ఘాట్ రోడ్డు వేయడానికి సంవత్సరంకుపైగా సమయం పట్టిందంటే ఎంతకష్టమో ఇట్టే అర్థమైపోతుంది. అయితే ప్రస్తుతం తితిదే ఇంజనీరింగ్ అధికారులు మాత్రం తారు రోడ్డు మీద తారు రోడ్లు వేస్తూనే ఉన్నారు.
1944 సంవత్సరంలో వేసిన రోడ్లుపైనే మరో రోడ్లు వేయడం నిజంగా వారిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తితిదే అధికారులను మాత్రమే కాదు తిరుమలకు వచ్చే భక్తులందరికీ ఘాట్ రోడ్లను చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.
Photos Captured By Sasi Sasidhar