కొంత మంది అమ్మాయిలకి ఆది అబ్బాయిలకి రీసెంట్ గా సాయి పల్లవి ,నివేత,అనుపమ ఇలా లిస్ట్ పెద్దదే
ఒక సినిమా లో ఒక కారెక్టర్ connect అయితేనో లేదా చూడడానికి కొంచెం బావుంటేనో మనం పెట్టుకునే పేరు Crush
నిజంగా మాట్లాడుకోవలంటే మనం ఇప్పుడు చూపించే ఈ క్రష్ అనే ఫీలింగ్ అసలు ఫీలింగ్ ఏ కాదేమో అనిపిస్తుంది
ఒకసారి పాత రోజుల్లోకి వెళదామ?
"అది ఇంటర్ హాస్టల్ లో ఔటింగ్ ఇచ్చిన రోజులు .ఎప్పుడు లేని ఆనందంతో ఎగురుకుంటు "ఏమాయే చేసావే " విజయవాడలో కపర్ది థియేటర్ లో ఫస్ట్ రోజు హాస్టల్ ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళాం . సినిమా లో చెప్పినట్టు ఆ మలయాళ వాసన కి పడిపోయి హాల్ నుండి బయటకు వచ్చాక ఎదో తెలియని మాయ నిజంగా కమ్మేసింది . మనసు అంత సమంత .. సమంత .. ఒకటే పేరు
20 rs కి ఒక గంట నెట్ సెంటర్ లో కూర్చుని ఆ సినిమా పాటలు వింటూ ఆ షాప్ అద్దంలో నుండి సమంత ఉన్న పోస్టర్ చూసి ఒక తెలియని vibration మళ్ళీ వెళ్దాం !! సినిమా కి మళ్ళీ వెళ్దాం !! అని మనసు చెప్తోంది
ఎప్పుడు లేదు ..మళ్ళీ అదే సినిమా ఫస్ట్ షో కి టికెట్ బ్లాక్ లో ఒక్కడినే కొన్నుక్కుని చూసి ఒక తృప్తి తో హాస్టల్ కి బయల్దేరాను సహజంగా మనం డే స్కాలర్ అయితే ఇంటికి వచ్చి వేరే పని చేస్తూ సినిమా ని కాసేపు మర్చిపోతాం కానీ మన లాంటి వాళ్ళు అదే మాయలో పడిన వాళ్ళు మన చుట్టూ అదే మాటలు hostel లో మాట్లాడుతూ ఉంటే అందులో మనం ఒక పార్ట్ అవుతూ చెప్పుకునే కబుర్లు మాటల్లో చెప్పలేం
ఇప్పటి లాగా ఫోన్ లో Wall పేపర్ కాదు హాస్టల్ లో రూమ్ లో నిజంగా wall మీద పేపర్ అంటించికుని నిద్రపోయే ముందు ఆ ఫోటో చూస్తూ పడుకునే వాళ్ళం
హాస్టల్ లో walkman ఉన్న వాడిని ఫ్రెండ్స్ చేసుకుని హాస్టల్ పైకి ఎక్కి మబ్బులుని చూస్తూ ఆ పాటలు వింటూ సమంత గుర్తు చేసుకునే వాళ్ళం !!
ఇది కాక వీక్లీ మ్యాగజైన్ లో తన గురించి ఏ ఆర్టికల్ వచ్చిన study hour లో ప్రతి ఒక్క ఫ్యాన్ దగ్గర shuffle చేస్తూ చదివే వాళ్ళం
ఒక రియాలిటీ షో తను వస్తోదంటే హాస్టల్ చివర ఉన్న dhaba ఓనర్ ని manage చేసి మరీ అది చూసి వచ్చేవాళ్ళం
లాస్ట్ లో ఆ సినిమా తీసేస్తున్నారంటే ఒక్కసారి థియేటర్ లో చూడడానికి 8 టైం అనుకుంటా అప్పటికి అయిన మళ్ళీ queue కట్టేసామ్
ఆ తర్వాత ఏం జరిగింది !!
కొద్దీ రోజులకి ఆ సినిమా ఒరిజినల్ DVD వచ్చింది అది ఇప్పటికీ అరిగిపోయి ఇంట్లో నన్ను చూస్తూ నవ్వుతూ ఉంటుంది "
మీకు కూడా ఒక crush అనే ఫీలింగ్ సమంత తో స్టార్ట్ అయి ఉంటే hi 5 బాస్ !!
నిజంగా crush అనే ఫీలింగ్ love కన్నా ఒక్క విషయంలో చాలా బెటర్ కదా ఏ expectation లేకుండా ఎంత హాయిగా ఉండచ్చో కదా