వెయ్యి కాదు, లక్ష కాదు ఏకంగా ఒక కోటి మాస్కుల డిస్ట్రిబ్యూషన్.. అందరూ సిటీలో ఉన్నవారి గురించి ఆలోచిస్తే, గ్రామాల్లో ఉండేవారి గురించి ప్రతిమ ఫౌండేషన్ వారు పట్టించుకుంటున్నారు. Prevention is better than cure అంటారు, ప్రస్తుతానికి తెలంగాణ గ్రామాలలో ఏ ఒక్క కేసు నమోదు కాకపోయినా ముందునుండే జాగ్రత్తలు పాటించి ఈ ఫౌండేషన్ వారు ఒక కోటి మాస్కులను పంపిణీ చేస్తున్నారు.
కోవిడ్19 వ్యాపిస్తుంది, వాటి నుండి మన ప్రాణాలను కాపాడుకోవాలంటే ఏమేమి జాగ్రత్తలు పాటించాలో గ్రామాల్లో అవగాహన ఉన్నా మాస్కులు దొరకడం ఇక్కడ మరీ కష్టంగా ఉంటుంది. ఒక్క మాస్కులు అనే కాకుండా ఇంటి పరిసరాలను క్లీన్ గా ఉంచడం కోసం డస్ట్ బిన్, డెటాల్ హ్యాండ్ వాష్ లను కూడా అందిస్తున్నారు. ఈ మాస్కులు అత్యంత నాణ్యమైనవి, మూడు లేయర్లతో కూడిన పాలి కాటన్ ఫ్యాబ్రిక్ దీనికోసం వాడుతున్నారు, ఈ మాస్క్ ఒక్కసారి వాడి పడేసేలా కాకుండా దాదాపు 10 నెలల వరకు రెగ్యులర్ గా వాష్ చేసుకుంటూ రైతులు ఉపయోగించుకోవచ్చు.
మాస్క్ తో పాటుగా కోవిడ్19 ఎలా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది, వారినుండి రక్షణ పొందడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఇమ్యూనిటి పెంచుకోవడానికి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది, ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఎవరికి కాల్ చెయ్యాలి మొదలైన అనేక విషయాలకు సంబంధించిన ఒక పాంప్లీట్ కూడా ఇస్తున్నారు. ఏప్రిల్ 13న ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రస్తుతానికి 30 లక్షల మాస్కుల వరకు పంపిణీ చేసింది, త్వరలోనే తెలంగాణలోని ప్రతి గ్రామానికి వెళ్లబోతుంది.
150 వాలంటీర్లతో పాటు, మాస్క్ రవాణా కోసం 10 అంబులెన్స్ వరకు దీనికోసం సిద్ధం చేశారు. ఫలానా గ్రామంలోని రైతులకు ఈ మాస్కులు పంపిణీ చేసేముందు ఆ ఊరి సర్పంచ్ ను కలుస్తారు, ఊరిలో ఎంతమంది నివసిస్తున్నారు? ఎన్ని మాస్కులు అవసరం ఉంటుంది తెలుసుకుని ప్రతిమ ఫౌండేషన్ వాలంటీర్లు సర్పంచ్ సమక్షంలో రైతులకు ఇస్తారు. ఒక్కో మాస్క్ తయారీకి రూ.35 వరకు ఖర్చు అవుతుంది, వీటిని మహిళ టైలర్స్ దగ్గర కుట్టిస్తూ వారికి కూడా పని కల్పిస్తున్నారు.