సురేందర్ డెంటిస్ట్ మరియు, అద్భుతమైన ఆర్టిస్ట్. ఈ రెండింటిలో నీకు ఏదిష్టం.? అని ఎవరైనా కొత్తగా అడిగితే కాసేపు ఆలోచించుకుని రెండు ఇష్టమే అని చెబుతాడు. సురేందర్ పుట్టుక నుండి ప్రస్తుత జీవన ప్రయాణం వరకు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. సురేందర్ పుట్టడం కూడా డాక్టర్లు కష్టమన్నారు, కానీ 'సురేందర్' అనే డాక్టర్ గారు సీజీరియన్ చేసి ఆయుష్షుని పోశారు. ఆ డాక్టర్ గారిపై కృతజ్ఞతతో నాన్న 'సురేందర్' అని నామకరణం చేశారు. సురేందర్ కు ఊహ తెలిసిననాటి దగ్గరి నుండి నాన్న సురేందర్ పుట్టుకకు ఆ డాక్టర్ ఎలా శ్రమించారు, అసలు డాక్టర్ వృత్తి అంటేనే ఎంత గొప్పది.. అనే విషయాలను చెబుతుండడం మూలంగా సురేందర్ సహజంగానే డాక్టర్ అవ్వాలనే బలంగా కోరుకున్నారు. అలాగే తనలోని ఆర్టిస్ట్ ని కూడా సురేందర్ సహజంగానే గుర్తించగలిగారు.
సైన్స్ లో 98, మిగిలిన అన్నింటిలో ఫెయిల్: సురేందర్ హైదరాబాద్ లోని పి.ఓబుల్ రెడ్డి స్కూల్ లో చదువుకున్నాడు. చిన్నతనం నుండి సైన్స్ సబ్జెక్ట్ లోని డ్రాయింగ్స్ ని అద్భుతంగా వేసేవాడు. 10th క్లాస్ లో జరిగిన ఒకానొక డ్రాయింగ్ కాంపిటీషన్ లోనూ హైదరాబాద్ లోనే మొదటి ప్రైజ్ అందుకున్నాడు. నేను పెద్దయ్యాక డాక్టరే అవుతా అనే కాంక్ష తీవ్రంగా ఉండడం వల్ల మిగిలిన సబ్జెక్టులను ఒకానొక సమయంలో పూర్తిగా విస్మరించాడు, ఫలితంగా సైన్స్ లో 90కి పైగా మార్క్స్ తో క్లాస్ ఫస్ట్ వస్తే మిగిలిన అన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యేవాడు. ఒకసారి నాన్న స్కూల్ కు వచ్చినప్పుడు ఈ విషయం తెలిసి అందరిముందు చెంపపగులగొట్టేసరికి సైన్స్ లో 90కి పైగా మార్కులు తెచ్చుకున్నట్టుగా మిగిలినవాటిల్లోనూ 90కి పైగా మార్కులు తెచ్చుకున్నాడు.
ఆర్టిస్ట్.?/ డెంటిస్ట్.? సురేందర్ ఎంసెట్ బాగా రాసి మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు, Meghna institute of dental sciences, (Nizambad) లో చదువుతుండగా ప్రతిరోజు లైబ్రరీలో చదువుతుండగా Dr.Netter బుక్స్ తో ఎక్కువగా గడిపేవారు. Dr.Netter ఫేమస్ మెడికల్ illustrator, విద్యార్థులు చదివే మెడికల్ బుక్స్ అన్నింటిలో నెట్లర్ గారు వేసిన illustrations ఉంటాయి. వాటిని ఎక్కువ పరిశీలిస్తూ ఉండడం వల్ల సురేందర్ కూడా అలాంటి illustrations వెయ్యాలని తపించాడు(ప్రస్తుతం అలాంటి పుస్తకం సురేందర్ రూపొందిస్తున్నాడు). వన్ ఇయర్ ఇంటర్న్షిప్ చేస్తూ నాలెడ్జ్ కోసం ఉదయం 8 నుండి సాయంత్రం వరకు కాలేజ్ లో నేర్చుకోవడం, పాకెట్ మనీ కోసం ఆ తర్వాత సాయంత్రం నుండి రాత్రి 8 వరకు ఒక క్లినిక్ లో జాబ్ చెయ్యడం, తనలోని ఆర్టిస్ట్ ఎదుగుదలకై రాత్రి 10 నుండి 2 వరకు ప్రతిరోజు రూమ్ లో ఏదో ఒక బొమ్మ గీసేవాడు, ఇలా సంవత్సరం పాటు కొనసాగింది. ఈ సంవత్సర కాలంలో సురేందర్ అటు సబ్జెక్ట్ లో ఇటు ఆర్ట్ లో ఎంతో నేర్చుకున్నారు. ఒకానొక సమయంలో పూర్తిస్థాయిలో ఆర్టిస్ట్ అవ్వాలనే కోరిక కలిగినా ప్రొఫెసర్ సాంబశివరావు గారి గైడెన్స్ మూలంగా రెండింటిని బ్యాలెన్స్ చేసుకున్నాడు.
సురేందర్ కు డెంటిస్ట్ గా, ఆర్టిస్ట్ గా మరచిపోలేని జ్ఞాపకాలున్నాయి. 'నేను కొన్ని హాస్పిటల్స్ కు వెళ్ళాను, కానీ వెళ్లిన ప్రతిచోటా నొప్పితోనే ట్రీట్మెంట్ జరుగుతుంది, మీరు ట్రీట్మెంట్ చేస్తే ఏ మాత్రం నొప్పి ఉండదండి' అని ఇటు పేషెంట్స్ నుండి, ఒకసారి సీనియర్ ఆర్టిస్ట్ ప్రదీప్ సురేందర్ బొమ్మలు చూసి 'నువ్వు ఇంత బాగా డ్రాయింగ్ బాగా వేస్తున్నావంటే డెంటిస్ట్ గా కూడా పేషేంట్స్ ను బాగా చూసుకోగలవు' అనే అభినందనలు.. తనకు ఎంతో బూస్ట్ నిస్తాయని సురేందర్ అంటుంటాడు. తన ఫ్యామిలీ, ప్రొఫెసర్ సాంబశివరావు గారు అలాగే స్నేహితులు మేఘన, వినయ్, సాయి కిరణ్ లు ఎక్కడ తన జర్నీ ఆగిపోకుండా అన్ని రకాల సపోర్ట్ ని అందించారు. ఒక రంగంలో రాణించాలంటే మరొక ఇష్టాన్ని త్యాగం చెయ్యడం అనేది పాత పద్ధతి, సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటే కనుక సురేందర్ లాంటి ప్రయాణం అందరికీ సాధ్యమే.
He is on Instagram: https://www.instagram.com/invites/contact/?i=kge4gosfldzc&utm_content=3xjwbo6