What If … Big Boss Contestants Were Given Telugu Padhyaalu/Poems Which Aptly Suit Them Based On Their Activity?

సుభాషితాలు,శతక పద్యాలు అన్నీ మనిషి గుణగణాల గురించి మనిషి ఎదుర్కునే సమస్యని ఎలా అధిగమించాలి అనే దాని గురించే ఎక్కువగా చెబుతుంటాయి . బిగ్ బాస్ షో లో పోటీదారులకి సరిగ్గా సరిపోయే కొన్ని పద్యాలు ఇక్కడ పేర్కొనడం జరిగింది .అవేమిటో ఓసారి చూద్దాం.
PS.ఇది కేవలం సదరు వ్యక్తులని పోటీదారులుగా పరిగణించి అన్వయించినవే తప్ప వారిని వ్యక్తిగతంగా ఉద్దేశించినవి కాదు
1. ముమైత్ – ధనరాజ్ – ఈ ఇద్దరికీ ఈ పద్యం సరిగ్గా సరిపోతుంది
కూరిమిగల దినములలో
నేరములెన్నడు గలుగనేరవు మరి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ

2.సంపూర్ణేష్ బాబు ఈ పద్యాన్ని ఒక్కసారి గుర్తు చేసుకొని ఉంటె షో ఇంకోలా ఉండేది ఈపాటికి
అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తీయగనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ.

3. ధనరాజ్
ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి, యన్యుల మనముల్
నొప్పించక, తా నొవ్వక,
తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ.

4. శివబాలాజీ
తన కోపమే తన శత్రువు
తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ
తన సంతోషమే స్వర్గము
తన దుఃఖమే నరకమండ్రు నిక్కము సుమతీ.

5. హరితేజ – ఎవరేం చెప్పినా వింటుంది తనకి నచ్చింది చేస్తుంది
వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనే వేగపడక వివరింపఁదగున్
గని కల్ల నిజము దెలిసిన
మనుఁజుడెపో నీథిపరుడు మహిలో సుమతీ.

6. అర్చన
చెప్పులోని రాయి చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు కాలిముల్లు
ఇంటిలోని పోరు ఇంతింతగాదయా
విశ్వదాభిరామ వినురవేమ

7. ప్రిన్స్ – ఆదర్శ్ – పుణ్య పురుషులు = అసలైన ఆటగాళ్లు
ఉప్పుకప్పురంబు నొక్కపోలికనుండు
చూడ చూడ రుచుల జాడ వేరు
పురుషులందు పుణ్య పురుషులు వేరయా
విశ్వదాభిరామ వినుర వేమా

8. ముమైత్ ఖాన్
పరగ రాతిగుండు పగలగొట్టగవచ్చు
కొండలన్నీ పిండిగొట్టవచ్చు
కఠినచిత్తు మనసు కరిగింపగా రాదు
విశ్వదాభిరామ వినురవేమ

9. కత్తి కార్తీక
ఉపకారికి నుపకారము
విపరీతము గాదు సేయ వివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ.

10. మహేష్ కత్తి
తప్పులెన్నువారు తండోపతండంబు
లుర్వి జనులకెల్ల నుండు తప్పు
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు
విశ్వదాభిరామ వినురవేమ

11. సమీర్
అనువుగాని చోట అధికులమనరాదు
కొంచమైన నదియు గొడవగాదు
కొండ యుద్ధమందు కొంచమై ఉండదా
విశ్వదాభిరామ వినురవేమ

12. కల్పన
మిరపగింజ చూడ మీద నల్లగనుండు
గొరికిచూడ లోన జురుకు మనును
సజ్జనులగువారి సారమిట్లుండురా
విశ్వదాభిరామ వినురవేమ

If you wish to contribute, mail us at admin@chaibisket.com