15 Simple Yet Important Life Lessons That One Can Learn From Every Bigg Boss Contestant!

బిగ్ బాస్ దాదాపు రెండు నెలలుగా మన దినచర్య లో ఒక భాగం అయిపోయింది. మరో మూడు రోజుల్లో ఈ షో ముగుస్తుంది. ఈ షో లోని పోటీదారులు ఇంట్లో ఉన్న కాలంలోని వారి జీవితం లోనుంచి వారు చేసిన తప్పుల నుంచి మనకి మన జీవితానికి ఉపయోగపడే కొన్ని జీవిత సత్యాలని తెలిసో తేలికో మనకి తెలిసేలా చేసారు. నేర్చుకోవాలే గాని ఎవరి నుండైనా ఏమైనా నేర్చుకోవొచ్చు. మరి బిగ్ బాస్ పోటీదారులు తమ అనుభవాల ద్వారా మనకి చెప్పిన జీవిత సత్యాలేంటో ఓసారి చూద్దామా
1.ప్రిన్స్ – ఎదురేమొచ్చినా ఎవరేమిచ్చినా చేదైనా తీపైనా చిరునవ్వుతో స్వీకరించు

2.మహేష్ కత్తి – తప్పో ఒప్పో, అవతలివాడు నీకు జై అన్నా, నై అన్నా నీ మాట మీద నువ్వు నిలబడు

3.నవదీప్ – ఎక్కడైనా ఎప్పుడైనా నవ్వు నవ్వించు . సంతోషం సగం బలం

4.శివ బాలాజీ – కోపమైనా ప్రేమైనా సమానంగా పంచు

5.కల్పన – పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోయినా గుండెల్లో ధైర్యాన్ని పెదాలపై చిరునవ్వుని వదలకు

6.ఆదర్శ్ – క్లిష్ట సమయాల్లోనే నువ్వెంటో నువ్వెంతో తెలుసుకోగలవు

7.హరితేజ – ఎవరేమన్నా ఏమనుకున్నా నీకు నచ్చిందే చేయ్ ,నీకు వచ్చిందే చేయ్

8.ధనరాజ్ – నలుగురికోసం కాదు ముందు నీకోసం నువ్వు ఆలోచించుకో ..నీకోసం నువ్వు నిలబడు

9.ముమైత్ – గుడ్డిగా నమ్మడం,మూర్ఖంగా ప్రతీకారాలు తీర్చుకోవడం రెండూ నీకే చేటు చేస్తాయి

10.సమీర్ – ఉన్నది ఎంత కాలం అని కాదు,ఉన్నంత సేపు హాయిగా ఆనందంగా ఉండు

11.దీక్ష – నీకోసం ప్రత్యేకంగా ఎవరూ వచ్చి నిలబడరు . నువ్వే పోరాడాలి నిన్ను చూసి నవ్వినా నవ్వుతూ సాగిపోవాలి

12.మధుప్రియ – ఏడిస్తే రారేవారు తీర్చరు నీ భాదెవరు

13. అర్చన: ఈ ప్రపంచం నిన్ను నమ్మకపొయినా.. నిన్ను నువ్వు నమ్ముకొ..అదె నిన్ను చివరి వరకు తీసుకెల్తుంది..

14. జ్యోతి: గెలుపు తర్వాత, ముందు నీ విలువ పెంచుకో.!!

15. సంపుర్ణేష్ బాబు: జీవితమన్నాక కొన్ని సార్లు నటించాల్సి ఉంటుంది, సర్ధుకుపోవాల్సి ఉంటుంది.

If you wish to contribute, mail us at admin@chaibisket.com