This Govt School Teacher Of A Remote Village in Telangana Deserves All Respect For Changing The Lives Of His Students!

జడ్చర్ల మండలం చౌటగడ్డతండా సుమారు 40 కుటుంబాలు ఉండే ఓ మారుమూల గ్రామం అది. పెద్దగా చదువుకున్న వాళ్ళు కూడా అంతగా లేరు అక్కడ. ఇవి మా హక్కులు, దేశ న్యాయశాస్త్రం మాకిలాంటి హక్కులు అందించింది వాటిని ప్రభుత్వం వారు ఏ ఆటంకం లేకుండా అందించాలి అనే కనీస లౌక్యం కూడా తెలియని ప్రాంతంలో “బోగం నరేందర్” అనే టీచర్ ఆ గ్రామంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ ను తన సొంత డబ్బు, చందాలతో అన్ని రకాలుగా అభివృద్ది చేస్తున్నారు.

స్కూల్ క్యాంపస్:
క్లాస్ రూమ్స్ ఎంత బాగుండాలో స్కూల్ గ్రౌండ్, ఆ క్యాంపస్ కూడా అంతే బాగుండాలి.. అది స్టూడెంట్స్ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. నరేందర్ గారు పిల్లల చేత స్కూల్ అంతా మొక్కలు నాటించి వాటి బాగోగులను కూడా వారికే అప్పగించారు. వాటర్ హార్వెస్టింగ్ ప్లాంట్(వాన నీటిని ఫిల్టర్ చేసే మిషిన్), చెత్తను నిల్వచేసి వాటి నుండి ఎరువులు తయారుచేసేలా ఏర్పాట్లు చేశారు. ఇంట్లో లా పరిశుభ్రంగా ఉండేలా టాయిలెట్స్, కిచెన్ లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.



కలెక్టర్ ఆనందం:
స్కూల్ కాంపౌండ్ వాల్ నుండి క్లాస్ రూమ్స్, లైబ్రరీ, ఆఖరికి వాష్ రూమ్స్ ఆవరణాలు కూడా విద్యార్ధులకు ఏదో మంచి విషయం చెప్పేలా ఉందని ఈ పాఠశాలను ఈ మధ్యనే జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ గారు చూసి ఆనందంతో కూడిన ఆశ్చర్యానికి లోనయ్యారు..


నరెందర్ గారి శ్రమ:
నరెందర్ గారు ఈ స్కూల్ కు ఎనిమిది సంవత్సరాల క్రితం ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. సరిగ్గా 8 సంవత్సరాల క్రితం ఈ స్కుల్ అంతా నిర్మాణుశ్యంగా, చెట్లు లేకుండా ఓ ఆత్మ లేని శరీరంలా కల తప్పి ఉండేది. ప్రభుత్వం వారు సంవత్సరానికి 5,000 రూపాయలు మాత్రమే గ్రాంటుగా అందించేది. ఈ సమయంలోనే నరెందర్ గారికి ఒక గొప్ప యుద్ధం చేసే అవకాశం లభించింది. లక్షన్నర రూపాయాలు ఖర్చుపెట్టి ఆ స్కూల్ ను అద్భుతంగా మార్చివేశారు. పాఠశాలకు “చిన్నారుల కలల ప్రపంచం” అని పేరు పెట్టి ఏ విద్యార్ధి మీద ఒత్తిడి లేకుండా జీవిత పోరాటానికి రేపటి ప్రేమ నిండిన సైనికులుగా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం ఈ గ్రామంలో ఉన్న 37మంది పిల్లలందరూ ఈ పాఠశాలలోనే చదువుకుంటున్నారు. ఈ మారుమూల స్కూల్ లో చదువుతున్న పిల్లలే రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను గెలుచుకుంటున్నారు. ఇది ఒక విజన్ నిండిన ఉపాధ్యాయుని విజయం.


If you wish to contribute, mail us at admin@chaibisket.com