Meet దర్శనం మొగిలయ్య ,12 మెట్ల కిన్నెర వాయిద్యకారులు AKA, The Man You Saw In Bheemla Nayak Lyrical Video

Andaru ee roju release ayina, Bheemla Nayak title song vinnaaru kadhaa.. Aithe sure ga starting lo vachina peddaayana ni aayana chethilo unna instrument ni gamaninche untaaru kadha..

ఆ వాయిద్యం పేరు కిన్నెర. తెలంగాణ మూలల్లో పుట్టిన ఒక అపురూపమైన వాయిద్యం. హిందు మరియు బుద్ధిజం పురాణాల్లో, సగం మనిషి సగం గుర్రం ఆకారం లో ఉండే సంగీతానికి ప్రతీక గా పిలవబడే, కిన్నర అనే గాంధర్వ గాయని నుండి ఈ పేరు ఆ వాయిద్యానికి పెట్టారు.

అంతరిస్తున్న ఈ వాయిద్యాన్నీ వాయించే చాలా అరుదైన కళాకారులు దర్శనం మొగిలయ్య గారు. DEPARTMENT OF LANGUAGE AND CULTURE TELANGANA ఈయన గురించి 2017 లో ఒక డాక్యుమెంటరీ కూడా తీశారు.

పాలమూరు జిల్లా, ఔసలికుంట గ్రామం… మొగిలయ్య గారి నివాసం. లింగాల గ్రామం లాంటి పక్క గ్రామాల్లో సంత జరిగే చోట కిన్నెర చేత బట్టుకుని, ఆశువుగా పాట పాడుకుంటూ.. జీవనం సాగిస్తున్న ఈయన పాటల్లో, తెలంగాణ సంస్కృతి, చరిత్ర, అందాలు ముఖ్యాంశాలు గా ఉంటాయి… ఎదుటి వ్యక్తి గురించి ఆసువుగా (అప్పటికప్పుడు) పాట కట్టి పాడటం ఈయన ప్రత్యేకత.

అలా సంత అంత తిరిగి ఎవరిని అడగకుండా.. ఇచ్చినవి తీస్కుని తన జీవనాన్ని సాగిస్తున్నారు.. పొట్ట కూటి కోసం, కూలి పనులు చేస్తున్న… తరాల నుండి వస్తున్న కిన్నెర కళని వదలల్లేదు..

తెలంగాణ ఉద్యమ కారుడు, పండగ సాయన్న చరిత్ర గానం. మొగిలయ్య గారి ప్రత్యేకత

కిన్నెర వాయిద్యాన్ని, ఒక వెదురు కర్ర పైన, ఎద్దు కొమ్ములతో చెయ్యబడ్డ 12 మెట్లు (ఇవి 7 నుండి 12 వరకు ఉండచ్చు) భిన్నమైన బరువులో ఉండే ఆనపకాయలు, ఆ మెట్లకు ఉక్కు తీగలని కట్టి వాటికి గురుగింజలని, పడగాలని జోడించి, పదునైన పుల్ల కి (ఆ పుల్ల ని బుద్ధిమంతుని పుల్ల అంటారు) బిగించి, తయారు చేస్తారు.

ఈ కిన్నెర కు చివర ఉన్న ఆనపకాయకు ఒక చిలకబొమ్మను కడతారు, వాయించే తీరు ని బట్టి ఆ చిలక ఎగురుతుంటే, చూడటానికి చాలా బాగుంటుంది. బుర్ర కథ లో “తందానా దేవా తందనాన” అనే వాక్యం ఎక్కువ వినిపిస్తుంది.. అలాగే ఈయన పాడే కిన్నెర పాటల్లో “శెభాష్” అనే పదం వినిపిస్తుంది.

2019 లో ప్రపంచం లో వివిధ వాయిద్యాల గురించి తెలుసుకునే ఒక జాపనీస్ వ్యక్తి తన ట్విట్టర్ అకౌంట్ లో పెట్టిన మొగిలయ్య వీడియో చాలా వైరల్ అయ్యింది..

ఆ వీడియో లో ఆయన పాడిన పాటని పోలినట్టు, భీమ్లా నాయక్ పాట లో మొదటి లైన్స్ ని మొగిలయ్య గారి చేత పాడించారు థమన్.

ఇలా అవకాశం బట్టో, అవసరం బట్టో, మన సంస్కృతి మూలమైన కళ ని కళాకారులని వెలికితీయడం వల్ల, ఆ కళ గురించి ఇంకొంత మందికి తెలిసే ఆస్కారం ఉంది. ఈ రోజు మనకు కిన్నెర గురించి తెలిసినట్టు.

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , ,