9 Best Movies From The Prestigious USHAKIRAN MOVIES Banner!

 

ఈ ఉషాకిరణాలు తిమిర సంహరణాలూ. … ఈ పద్యం తెలియని తెలుగువారుండరు . మన చిన్నతనంలో మనకి తెలీకుండానే కంఠతా వొచ్చిన పద్యం ఇది . రామోజీరావు గారు ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్లో ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలని నిర్మించారు . ప్రయోగాలకి , విలువలతో కూడిన చిత్రాలకి ఉషాకిరణ్ మూవీస్ పెట్టిందిపేరు. గాన గంధర్వుడు బాలు గారితో , జానకమ్మ గారితో సంగీత దర్శకత్వం చేయించినా,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారి తో (ఒక రాజు ఒక రాణి ) సింగల్ కార్డు పాటలు రాయించినా . నూతన నటులతో ఇండస్ట్రీ హిట్ , ఇవన్నీ ఉషాకిరణ్ మూవీస్ కి మాత్రమే సాధ్యం . ఉషాకిరణ్ మూవీస్ మనకి అందించిన అపురూప చిత్రాలు ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు. వాటిల్లోంచి కొన్నిటిని ఓసారి చూద్దాం

 


1. శ్రీవారికి ప్రేమలేఖ

UM1

 


2. మౌన పోరాటం – ఒక యదార్థ సంఘటనని ఆధారంగా చేసుకొని రూపొందించిన చిత్రం. సమాజం లో,ప్రభుత్వం లో కదలిక తీసుకొచ్చిన సినిమా

UM2

 


3. మయూరి – నాట్య మయూరి సుధాచంద్రన్ గారి జీవితకథని వెండితెరపై ఆవిష్కరించిన చిత్రం . సుధాచంద్రన్ గారు తన పాత్రని తానే పోషించారు

UM3

 


4. ప్రతిఘటన -అప్పట్లో ఈ చిత్రం ఓ ప్రభంజనం

UM4

 


5. అశ్విని – సుప్రసిద్ధ అథ్లెట్ అశ్విని నాచప్ప జీవిత కథని ఆధారంగా తీసిన చిత్రం

UM5

 


6. పీపుల్స్ ఎన్కౌంటర్ – శ్రీకాంత్ ని నటుడిగా పరిచయం చేసిన చిత్రం. 90వ దశకం లో ఉన్న నక్సలైట్ ఉద్యమ నేపథ్యం లో సాగే కథ

UM6

 


7. చిత్రం – కొత్త దర్శకుడు కొత్త సాంకేతిక బృందం కొత్త తారగణం తో కొంగొత్తగా రూపొందించిన
” చిత్రం ”

UM7

 


8. నువ్వే కావాలి – ఏఎన్నార్ గారి ప్రేమాభిషేకం తరువాత 20 సెంటర్లలో 200 రోజులు ఆడిన మొదటి సినిమా. కథ కథనాల బలం తో ప్రేక్షకుల మనసు దోచుకున్న చిత్రం

UM8

 


9. ఆనందం – ఎన్ని సార్లు చూసినా కొత్త అనుభూతినిచ్చే ఆనందం

UM9

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , ,