10 Stepping Stone Movies Of K. Viswanath Garu To Reach Mile Stone Like Sankarabharanam

కళాతపస్వి విశ్వనాథ్ గారి గురించి, ఆయన సినిమాలా గురించి చెప్పేంత వయస్సు అనుభవం లేకపోయినా, ఆయన సినిమాలు చూసి అనుభూతి చెంది, జీవితం లో అన్వయించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఎంతో మంది లో ఒకరి గా రాయాడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. ప్రతి దర్శకుని ప్రయాణం లో ఒక సినిమా మైలురాయిలా నిలుస్తుంది. అలాంటి మైలు రాయి లాంటి సినిమా శంకరాభరణం, ఈ సినిమా తరువాత విశ్వనాథ్ గారు తీసిన ఎన్నో సినిమాలు కళాఖండాలు గా చరిత్ర లో చెక్కు చెదరకుండా నిలిచి పోయాయి.. కానీ శంకరాభరణానికి ముందు కూడా, విశ్వనాథ్ గారు ఆణిముత్యాలు లాంటి సినిమాలు, సగటు మనిషి జీవితానికి అద్దం పట్టే సినిమాల కు రచయిత గా, దర్శకునిగా పని చేశారు . వాటిని ఒకసారి చూసొద్దాం రండి ….
ఆత్మగౌరవం:
శబ్దగ్రాహకుడిగా (audiographer) గా తోడికోడళ్ళు లాంటి సినిమాలకు, సహాయ దర్శకునిగా మూగ మనసులు లాంటి సినిమాలకు పనిచేసిన విశ్వనాథ్ గారు మొదటి సారి దర్శకత్వం చేసిన సినిమా ఇది. పాటలు, కథ చాలా హృద్యంగా గా ఉంటాయి..
సుడిగుండాలు:
విశ్వనాథ్ గారు, రచయిత గా పని చేసిన సినిమా ఇది. ఈ మధ్య చర్చ గా మారిన “‘BoisLockerRoom’ Chat” కు సంబంధించి, పిల్లల్లో చెడు ప్రభావాల గురించి చాలా బాగా ప్రస్తావించిన సినిమా ఇది.
Nindu Dampathulu:
కథ పరంగా, స్వయంకృషి కి కొంచెం దగ్గరగా ఉంటుంది సినిమా. చివర్లో ఉండే court drama చాలా బాగుంటుంది.
Chelleli Kapuram:
కథానాయకుడిని అందగాడిలా చూపించక పోవడం అప్పట్లో సాహసమే, కానీ కథ బలం ఉన్న సినిమా ఇది. “ఆడవే మయూరి” ఇప్పటికి గుర్తుండిపోయే పాట.
నేరము శిక్ష:
కృష్ణ గారి నటించే కొత్తల్లో ఆయనకీ మంచి విజయాన్ని ఇచ్చిన సినిమా ఇది. Fyodor Dostoevsky’s Crime and Punishment అనే చిత్రం ఈ సినిమాకి స్ఫూర్తి..
Sarada:
ఎమోషనల్ డ్రామా నచ్చే వాళ్లకి చాలా బాగా నచ్చే సినిమా ఇది. శారద గారి నటన చాలా బాగుంటుంది. పాట ఇంకా బాగుంటాయి.
ఓ సీత కథ
ఈ సినిమా కథ ని అప్పట్లో తీయడం మామూలు విషయం కాదు. ఇప్పుడు చుసిన ఆశ్చర్యం వేయక మానదు…
జీవన జ్యోతి
ఈ సినిమా చూసి కంట తడి పెట్టని వారు అప్పట్లో లేరంటే అతిశయోక్తి కాదు.. చాలా సున్నితమైన కథని చాలా హృద్యంగా తెరెకెక్కించారు విశ్వనాథ్ గారు.
సీత మహాలక్ష్మి
అప్పటి సినిమా, ఇప్పటి సమాజాన్ని కూడా అద్దం పట్టగలదు అనడానికి ఒక ఉదాహరణ ఈ సినిమా. సినిమా నేపథ్యం లో నడిచిన ఎన్నో సినిమాలు మూలం లాంటి సినిమా ఇది. పాటలు చాలా బాగుంటాయి.
సిరి సిరి మువ్వ:
శంకరాభరణం లాంటి శిఖరానికి పైన చెప్పిన సినిమాలు దారి ని పరిస్థ, మొదటి మెట్టు లాంటి సినిమా ఇది. కథానాయికకి మాటలు లేకుండా చేసి, అభినయం తో ఆ పాత్రని తీర్చిదిద్దారు.
ఇవి కొన్ని మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి, శంకరాభరణం తరువాత వచ్చిన స్వర్ణకమలం, సాగరసంగమం, స్వాతిముత్యం లాంటి ఎన్నో ఆణిముత్యాలు వచ్చాయి. వాటిలో మీకు నచ్చినవి చెప్పేయండి.
If you wish to contribute, mail us at admin@chaibisket.com