India’s First ‘Baby Spa’ Opens In Hyderabad & Finally Young Parents Can Go To Work Peacefully

 

ఒకప్పుడు ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మలు ఉండడంతో పిల్లల పెంపకం విషయంలో ఏ చిన్న అనుమానం వచ్చిన వారి సంరక్షణలో తెలుసుకునేవారు.. కల్తీలేని స్వచ్ఛమైన నూనెతో మసాజ్ చెయ్యడం దగ్గరి నుండి స్నానం విషయంలోనూ జాగ్రత్తలు పాటించేవారు.. లేత వయసులో సరిగ్గా మసాజ్ చేస్తే భవిషత్తులో వారి ఎదుగుదలకు, ఒక మంచి రూపం రావడానికి బలమైన పునాదినిస్తుంది.. నెలలు నిండిన బిడ్డకు అతి ముఖ్యమైన ఈ సేవలు చెయ్యడానికి పిల్లల కోసం ప్రత్యేకంగా బేబీ స్పా ను ప్రారంభించారు..



స్వాతి గారు లక్ష్మీస్ హ్యుందాయ్ డైరెక్టర్. ఓసారి లండన్ వెళ్ళినప్పుడు ఓ “బేబీ స్పా” కనిపించింది. చిన్నపిల్లలకు ఈ స్పా ఎలా ఉపయోగపడుతుందని ఆ రోజు అంత అవే ఆలోచనలతో ఉండిపోయారు. గూగుల్ లో సెర్చ్ చేస్తే అందులో మరిన్ని లోతైన విషయాలు తెలిశాయి. ఇక్కడ స్వాతి గారిని మరింత ఆలోచనకు లోను చేసింది మాత్రం “భారతదేశంలో ఒక్కటి కూడా బేబీ స్పా లేకపోవడం”. ఇండియా వచ్చేసిన తర్వాత తనకు తెలిసిన డాక్టర్లను హైడ్రోథెరపీ బెనిఫిట్స్ గురుంచి కులంకుషంగా అడిగి తెలుసుకున్నారు. పిల్లల ఆరోగ్యానికి అవసరమయ్యే బీబీ స్పా ను మొదటిసారి హైదరాబాద్ లో మొదలుపెట్టాలని అనుకున్నారు. ఈ ప్రయాణంలోనే లారా సెవెనస్ కలిశారు.


లారా లండన్ లో స్విమ్ కోచ్. పిల్లలకు స్పా అవసరమని బేబీ స్పా ను లండన్ లో అందుబాటులోకి తెచ్చారు. లారా స్వాతి కలయికలో ఈ స్పా రూపుదిద్దుకుంది. ఈ స్పా 15 రోజుల నుండి 8 నెలల పిల్లల కోసం. పిల్లల శరీరానికి మసాజ్, హైడ్రోథెరపీ లో భాగంగా పిల్లలను టబ్ లోని నీటిలో వదిలేస్తారు. పిల్లలు కాళ్ళు చేతులు ఆడించడం వల్ల అవసరమైన మసాజ్ అందుతుంది. పిల్లల మసాజ్ కోసం ఉపయోగించే నూనె ద్రాక్ష గింజల నుండి తీసుకుంటారు. ఇక్కడ ప్రత్యేకంగా ట్రైన్ ఐన నర్సులు, ఫిజియోథెరిపిస్టులు, పిడియాట్రిషన్స్ సంరక్షణ లో మసాజ్, హైడ్రోథెరపీ సాగుతుంది. హైడ్రోథెరపీ కోసం ఉపయోగించే బబ్బీ ఫోమ్ పిల్లలకు ఏ విధమైన హాని చెయ్యదు. ఈ టబ్ కే ప్యూరిఫైర్లు అమర్చడం వల్ల నిరంతరం శుద్ధి జరుగుతుంది.

for more info: 76599 00900



 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: , , , ,