Meet The Woman, Who Is Excelling Baby Photography & Capturing Memories Beautifully

 

మీరంటే ప్రివెడ్డింగ్, వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ అని రకరకాల ఫోటోలు దిగారు!! అరె నాకు మాత్రం ఏ ఫోటో షూట్ లేదు!! అని రేప్పొద్దున సరదాకైనా మీ పిల్లలు అంటే ఎలా ఉంటుంది.? సరదా అని కాదు, జీవితంలోని అనుభవాలను ఎదుగుదలను ఒక్కొక్క జ్ఞాపకంగా మరల చూసుకోవడానికి ఫోటో అనేది పిల్లలకిచ్చే కానుక. ఈ మధ్యకాలంలోనే చైల్డ్ ఫోటోగ్రఫీ కూడా విస్తరించింది. స్మరిత.. ఈ పేరు, తన వ్యక్తిత్వం ఒకే రకమైనవి, ఊహ తెలియని వయసులోనే పిల్లలకు మధురమైన జ్ఞాపకాలను అందించడమే వారి పని.


 

ఎలా మొదలుపెట్టారు.?
తల్లిదండ్రుల ప్రేమకు భౌతికరూపం పిల్లలు, పిల్లలంటే స్మరితగారికి చాలా ఇష్టం. వారు ఎక్కడ కనిపించినా కానీ పలుకరించకుండా ఉండలేరు, కుదిరితే వారితో కాసేపు ఆడుకుంటారు కూడా. స్మరిత గారు హైదరాబాద్ లో పుట్టిపెరిగి పెళ్లి తర్వాత అమెరికా వెళ్లారు(ప్రస్తుతం హైదరాబాద్ కు తిరిగి వచ్చారు). అమెరికాలో ఉన్నప్పుడు వారి చుట్టుపక్కల సన్నిహితుల పిల్లల బర్త్ డే సెలెబ్రేషన్స్ లకు ఫోటోలు తీయ్యడం, అందులోనూ పిల్లల పట్ల ప్రేమ, ఫోటోగ్రఫీలో నిజాయితీ మిళితం అవ్వడం వల్ల ఫోటోలు అద్భుతంగా వచ్చాయి, చూసిన ప్రతి ఒక్కరూ అభినందించకుండా ఉండలేకపోయారు. ఆ తర్వాతి కాలంలో స్మరిత గారు ఇందులోనే ఎక్కువ రీసెర్చ్ చెయ్యడం, ఇష్టాన్నే కెరీర్ గా ఎంచుకుంటే బాగుంటుందన్న ఉద్దేశ్యంతో చైల్డ్ ఫోటోగ్రఫీ మొదలుపెట్టారు.


 

పిల్లలతో ఫోటోషూట్ ఆషామాషీ కాదు:
స్మరిత గారు 6 సంవత్సరాలుగా ఐదువందల న్యూ బోర్న్ బేబీల ఫోటోషూట్ చేశారు. పెద్దవారికంటే ఇలా ఉండండి, అలా ఉండండి అని డైరెక్షన్స్ ఇస్తూ షూట్ చెయ్యొచ్చు, కానీ పిల్లలకు ఇలాంటి డైరెక్షన్స్ ఇస్తే ఒక్కోసారి భయపడి ఏడుస్తారు. ఇలాంటి ఇబ్బందులు స్మరిత గారు చక్కగా హ్యాండిల్ చెయ్యగలరు, పిల్లలు సంతోషంగా ఆడుకుంటున్నట్టే ఉంటుంది వారి ఫోటోగ్రఫీ కూడా. అలాగే స్మరిత గారి వర్కింగ్ స్టైల్ పూర్తిస్థాయిలో భిన్నంగా ఉంటుంది. ముందుగా పేరెంట్స్ ను కలుసుకుని వారి బాబు/పాప ఎలా ఉంటారు, ఎలాంటి రంగులు ఇష్టం, అల్లరి చేస్తుంటారా, సైలెంట్ గా కామ్ గా ఉంటారా.? ఇలా వారి గురుంచి అన్ని రకాలుగా తెలుసుకుని అప్పుడే షూట్ కు వెళతారు. షూట్ మొదలైనప్పుడు కూడా వారిని కంగారు పెడుతూ ఇటు చూడు, ఇలా నిలబడడు లాంటి ఇబ్బందులు కూడా పిల్లలకు ఏ మాత్రం ఉండకుండా అద్భుతాలను సృష్టిస్తారు.
 

సపోర్ట్ ఎలా ఉంటుంది.?
అత్తమామలు, హస్బెండ్ నవీన్ గారి సపోర్ట్ 100%.. కాదు కాదు 600%, 1,000% ఉంటుందని స్మరితగారు ఆనందంగా చెబుతారు. స్మరిత గారి మొదటి ఫోటోషూట్ చాలా ప్రయసతో కూడుకున్నది, గంటల తరబడి ప్రయాణం చేసి స్మరిత గారి హస్బెండ్ షూట్ దగ్గరికి తీసుకువెళ్లడం దగ్గరి నుండి, అన్ని పనులు మానుకుని అక్కడే షూట్ అయిపోయేంతవరకు వేచి ఉండడం వరకు.. ఇప్పటికి అదే సపోర్ట్. ప్రస్తుతం వారికి బాబు కలిగారు. ఒక్కోసారి స్మరిత గారు ఫోటో షూట్ కు వెళ్ళినప్పుడు పాపను జాగ్రత్తగా చూసుకుంటారు, స్మరిత గారి ఇష్టాలను అంతే గౌరవిస్తారు. అత్త మామలు కూడా అంతే, ఒక రహస్యం చెప్పాలంటే స్మరిత గారి కన్నా అత్తమామలే ఫోటో షూట్ అన్నా, తనకు వచ్చే అభినందనలను వీరే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు.


 

అవార్డ్స్:
ఆరు సంవత్సరాల కాలంలో చేసిన వందలాది ఫోటోషూట్ లో ప్రతి ఒక్క దంపతులు కూడా స్మరితగారిని ఫోటో చూస్తున్నప్పుడు స్మరించుకోలేక ఉండలేరు, పిల్లల అభినందనలు మాత్రం వారికి కాస్త ఊహ తెలిసాక ఎలాగూ వస్తాయిలెండి. స్మరిత గారికి తల్లిదండ్రుల అభినందనలతో పాటుగా ప్రతిష్టాత్మకమైన అవార్డులు కూడా వారిని వరించాయి. విమెన్స్ డే నాడే ఢిల్లీ లోని ఓ సంస్థ తరుపున బెస్ట్ న్యూ బోర్న్ అండ్ మెటర్నిటీ ఫోటోగ్రాఫర్ అవార్డు, అలాగే అమెరికాలో ఉన్నప్పుడు పేరెంట్స్ ఛాయిస్ కింద బెస్ట్ న్యూ బోర్న్ బేబీ ఫోటోగ్రాఫర్ అవార్డు, దీనితో పాటు అమెరికాలో గుర్తింపు పొందిన ఎన్నో మ్యాగజైన్లలోనూ స్మరిత గారి జర్నీ పబ్లిష్ అయ్యింది.


 

స్మరిత గారిని కలుసుకోవాలంటే: https://www.facebook.com/smaritavinnakotaphotography/

 

E-mail ID: hello@smaritavinnakota.com

 


 

1.


 

2.


 

3.


 

4.


 

5.


 

6.


 

7.


 

8.


 

9.


 

10.


 

11.


 

12.


 

13.

 

14.

 

15.


 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , ,