Meet Narendra, The Man Who Is Bringing The Revolutionary Ayn Rand’s Novel In Telugu

 

అయాన్ రాండ్ ని ఒక్కసారి చదివితే చాలు తను మన మెదడులో తిష్ట వేసి కూర్చుంటారు. బేసిక్ గా అయాన్ రాండ్ ను ఫాలో అయ్యేవారు ఎవ్వరైనా సరే they believe individualism, they believe what they are!! ప్రపంచం మొత్తం నీకు ఎదురుతిరగనీ!! నిన్ను నువ్వు నిలుపుకోకపోతే ఇంకెందుకు జీవితానికి అర్ధం అని అడుగుతుంది అయాన్ రాండ్. So ఎప్పుడైతే వాళ్ళను వాళ్లు నిలుపుకుంటారో they became the torchbearer of the society. కొంతమంది అనుకుంటూ ఉంటారు ఇతరులకు సహాయం చెయ్యాలి, సహాయం చెయ్యాలని “ఇతరులకు సహాయం చేయడమంటే ఏమీ లేదు, నీకు నువ్వు సహాయం చేసుకోవడమే.. నీకు నువ్వు సహాయం చేసుకోవడంలో నుండే ఇతరులకు సహాయం చెయ్యడం మొదలవుతుంది”.. ఎప్పుడైతే నువ్వు పనిని బాగా చేస్తావో ఆ పనిలో నీకు ఆనందం దొరుకుతుంది. అలాంటి ఆనందం మనుషులలో ఉంటుంది అనే నమ్మకం నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వు బ్రతుకుతావు జీవితంలో అని అయాన్ రాండ్ అంటారు.


 

కోట్లాదిమందిని ప్రభావితం చేసిన The fountainhead ను తెలుగు అక్షరాలలోకి తీసుకువచ్చిన నరేంద్రకుమార్ గారితో ఒక చిన్న చర్చ..

 

1. మిమ్మల్ని చూస్తుంటే మిమ్మల్ని పుస్తకాలు బాగా దున్నుతున్నట్టుగా ఉన్నాయి..

నరేంద్ర: చిన్నతనంలో ఇంట్లో టీవీ లేదు కాబట్టి నాకు పుస్తకాలతో అప్పుడే పరిచయమయ్యింది. Compensation(నాన్న ఇచ్చేవారు) కోసం నేను లైబ్రెరీకి వెళ్ళేవాడిని. అప్పుడు అందరూ చదివే చందమామ, బాలమిత్ర, న్యూస్ పేపర్లు చదివేవాడిని.. ఎప్పుడైతే వయసు, జ్ఞానం పెరగడం మొదలవుతుందో అప్పుడే రామ్ గోపాల్ వర్మ గారిని ఫాలో అయ్యాను. ఆయన బ్లాగ్ చూసేవాడిని. RGV హిప్పోక్రసీకి చాలా దూరంగా ఉన్నాడనిపించింది. First time ఒక సెలెబ్రెటీ don’t caring about the respect that socity is giving to him. RGV గారి వల్ల సీరియస్ థింకర్స్ పరిచయమయ్యారు. history of philosophy will durant, నిషే, అయాన్ రాండ్ ఇంకొంతమంది గొప్ప రచయితల పుస్తకాలంటే ఇష్టం. నేను చదివిన పుస్తకాలలో నాకు బాగా నచ్చిన పుస్తకం మాత్రం “గాడ్ ఫాదర్”.

 

2. The fountainhead Release అయ్యి ఇప్పటికి 76(1943) సంవత్సరాలు అవుతుంది. తెలుగులో గొప్ప అనువాదకులు ఉన్నారు. ఎవ్వరూ చేయలేదు. మీకెప్పుడు అనిపించింది అనుసృజన చెయ్యాలని.?

నరేంద్ర: మిగిలిన రచయితలు ఎందుకు అనువాదం చెయ్యలేకపోయారో నాకు తెలియదు, నేను మాట్లాడదలుచుకోలేదు. అనువాదం చెయ్యాలని నాకెందుకు అనిపించిందంటే “నేను ఫౌంటెన్ హెడ్ గురుంచి నా ఫ్రెండ్స్ మాట్లాడడం, ఒకసారి RGV గారిని ఫౌంటెన్ హెడ్ లోని ఒక క్యారెక్టర్ పోల్చుతూ ఒక ఆర్టికర్ రాశాను.. ఇలా కొన్ని సంఘటనలను నా మిత్రులు గమనించారు. అయాన్ రాండ్ ను నువ్వు బాగా అర్థం చేసుకున్నావు. నువ్వు ఎందుకు ట్రాన్స్ లేట్ చెయ్యకూడదు అని సజెస్ట్ చేశారు”. నేను పుస్తకం చదివి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది.. నాలుగు సంవత్సరాల నుండి అనువాదించాలని అనుకున్నాను. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుండి అనుసృజన మొదలుపెట్టాను. ఈరోజు రిలీజ్ అవుతుంది.

 


 

4. సాధారణ పాఠకుడిగా చదువుతున్నప్పుడు కన్నా అనుసృజన చేస్తున్నప్పుడు ఏమైనా మరింత లోతైన విషయాలు తెలిశాయా.?

నరేంద్ర: తొమ్మిది సంవత్సరాల క్రితం the fountainhead ను నేను ఐదు రోజుల్లో చదివాను. ఇలాంటి మనుషులు ఆలోచనలు కూడా ఉంటాయని ఆశ్ఛర్యపోయా!! మనం వర్మ గారిని చూస్తున్నాం కదా అంతకన్నా పదింతలు intense గా ఉంటాడు రోర్క్. చదువుతున్నప్పుడు ఇంత excite అయ్యాను. ట్రాన్స్ లేట్ చేస్తున్నప్పుడు మాత్రం “నాకు అర్ధం అయ్యింది వేరే వాళ్లకు అర్ధమయ్యేలా చెప్పాలి”. కథను చూసి నేను excite అవ్వడం వేరు, నా excitement ని మాత్రమే తీసుకుని వేరేవాళ్లకు అర్ధమయ్యేలా చెప్పాలనిపించింది. నేను చదివినప్పటి కన్నా అనువాదం చేస్తున్నప్పుడే ఇంకా ఎక్కువ అర్ధం చేసుకున్నా, మీరు పుస్తకం చదివితే నేను ఎంతలా అర్ధం చేసుకున్నానో తెలుస్తుంది.

 

5. The fountainhead పుస్తకంలోని పేజీల సంఖ్య 753, కానీ అహంలో 256 మాత్రమే. అంటే సగానికన్నా తక్కువ. కొంపదీసి మీకు నచ్చని సంఘటనలు తీసేసి కుదించారా.?

నరేంద్ర: నేను రాసేటప్పుడు ఇన్ని పేజీలలో రాయాలని అనుకోలేదు. కానీ దీన్ని 400 పేజీలలో పూర్తి చెయ్యాలా? 200 పేజీలలో పూర్తిచేయ్యలా.? లేదంటే 100 పేజీలా అంటే ఇది కంప్లీట్ గా నా Judgement. ఇది చాలా Important scene కదా ఎందుకు తీసేసావ్ అని రేపెవరైనా ప్రశ్నిస్తే నాకు అవసరం లేదు, నాకు Important అనిపించింది మాత్రమే పెట్టానని చెబుతా. అంటే మనం ఒక సినిమా చూశామనుకోండి దాంట్లో మనకు దేన్ని skip చేసి మన ఫ్రెండుకు చెప్పాలో మనకు తెలుసు. ఆ సీన్ లో అది జరిగింది ఇది జరిగిందని చెబుతారు మధ్యలో దాన్ని అనవసరం అనిపించినదాన్ని skip చేస్తారు. ఏం చెప్పి అతన్ని excite చెయ్యాలో మీకు తెలుసు. ట్రాన్స్ లేట్ చేస్తున్నప్పుడు మాత్రం ఆ సోల్ మాత్రం మిస్ అవ్వకూడదని అనుకున్నాను.

 

6. “అహంకారం”, “అహం” అనే పదాలు ఎక్కువగా చెడు వ్యక్తులను ఉదహరించడానికి వాడుతుంటాం. అసలు టైటిల్ అహం అని పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది.?

నరేంద్ర: మొదట నేను “స్వతంత్రుడు” అనే టైటిల్ అనుకున్నాను. పబ్లిష్ అయ్యే 15రోజుల ముందు “అహం” ను ఫైనల్ చేశాం. అహం అంటే నేను, నేను అనేది ప్రతి మనిషిలో ఉండే భావన. అహంకారం అంటే అహానికి మీరిచ్చే అహంకారం. నేను ఇది అనుకోవడం అహంకారం. “నేను” వేరు “నేను ఇది” అనుకోవడం వేరు. అహంకారం అంటే నేను చీఫ్ మినిష్టర్ ని, నన్ను వెళ్ళనివ్వవా.? అహం అంటే అది కాదు”నేను”. సమాజం కోసం ఈ నేను ను వదులుకోకూడదు, ఆ నేనును వదులుకొనప్పుడే మీరు బ్రతకగలుగుతారని అయాన్ రాండ్ చెబుతారు. అందుకే “అహం”.

 


 

7. అహం ఎవరు పబ్లిష్ చేస్తున్నారు.? మరిన్ని గొప్ప ఇంగ్లీష్ పుస్తకాలు అనువాదం చెయ్యాలనే ఆలోచన ఉందా.?

నరేంద్ర: నేను ఇంకా నా మిత్రుడు రమణ కలిసి పబ్లిష్ చేస్తున్నాము. భవిషత్తులో immanuel kant, friedrich nietzsche, jean paul sartre, hegel మొదలైన వారి ఫిలాసఫీ ని ఒక పుస్తకంలో పొందుపరిచి వివరించాలని ఉంది.

 

8. ప్రపంచవ్యాప్తంగా కొట్లాదిమందిని అయాన్ రాండ్ ప్రభావితం చేశారు. ప్రస్తుత ప్రపంచం ఈ విధంగా ఉండటానికి గల కారణాలలో ఆవిడ కూడా ఒకరు. అచ్చ తెలుగు అక్షరాలలో రాబోతున్న అయాన్ రాండ్ సాహిత్యం తెలుగువారిని ఎలా ప్రభావితం చెయ్యబోతుంది.?

నరేంద్ర: ఒక కొత్త థాట్ ఏదైనా దాన్ని అందరూ చదువుకోలేకపోయినా దాన్నుండి వచ్చిన మనుషులు మన సొసైటీ లో ఉంటారు. ఎలాగోలా మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు కొత్తగా the fountainhead చదివినా గాని ఇలాంటి థాట్ నాకు తెలుసు కదా అని అనిపిస్తుంది. థాట్ ఎప్పుడూ అది పుట్టిన చోట ఆగదు. ప్రపంచమంతా చేరుకుంటుంది. ఒకప్పుడు రాజ్యాలు, రాజులు ఉన్నారు అది మంచిది కాదని అంతరించిపోయింది ఇప్పుడు కొత్తగా నేను రాజుని అంటే ఎవ్వరూ అంగీకరించరు. అందుకే థాట్ ఎక్కడ మొదలైన దాని influence మీ వరకు చేరుకుంటుంది. అయాన్ రాండ్ the fountainhead తెలుగువారందరికి తెలియకపోయినా తెలుగువారిలో కొంతమంది చదివిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ ద్వారా అయాన్ రాండ్ ఎంటో తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా అయాన్ రాండ్ surprising గా ఉండదు, మన చుట్టూ మన సొసైటీలో మీలో జరుగుతున్న వాటి విషయంలో స్పష్టత వస్తుంది. అది తెలుగువారిలోను అందరిలోనూ జరుగుతుంది.

 


 

9. అయాన్ రాండ్ భావాలను సరిగ్గా అనువాదం చెయ్యలేకపోతున్నానని మీ కలం ఎప్పుడైనా వణికిందా.?

నరేంద్ర: 0 తను తన స్టొరీ చెప్పాలని అనుకోలేదు తన ఫిలాసఫీ చెప్పాలని అనుకుంది. ఆ ఫిలాసఫీ చుట్టూ మనుషులను అమర్చారు. నాకు అది తీసుకోవడం కాస్త కష్టమయ్యింది. పెద్ద Conversations, అయాన్ రాండ్ ఆర్కిటెక్చర్ గురుంచి చాలా సీరియస్ గా డిస్కస్ చేస్తుంటారు ” Gothic Constructions” ను వర్ణించడంలో, మరికొన్ని సందర్భాలలో నా కలం వణికింది!!

 

10. అయాన్ రాండ్ గురుంచి ఒక్క లైన్ లో చెప్పమంటే ఏమని చెబుతారు.?

నరేంద్ర: Builder Of Modren Society.

 

11. అలాగే the fountainhead గురుంచి కూడా ఒక్క లైన్ లో చెప్పమంటే ఏమని చెబుతారు.?

నరేంద్ర: Bible Of Individualism.

 


 

12. Finalగా మీ వ్యక్తిగత వివరాలు తెలియజేయగలరా.?

నరేంద్ర: మాది విజయవాడ. నాన్న వెంకటరామయ్య గారు విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ లో పనిచేస్తారు. అమ్మ ఆనంతవాణి టీచర్, నాకో తమ్ముడు ఉన్నాడు మధు, వాడు ఖమ్మంలో పనిచేస్తాడు. నేను మెకానికల్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో, ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఇంకా కువైట్ లో పనిచేశాను. ప్రస్తుతం the fountainhead అనువాదం చేశాను(కాస్త బిగ్గరగా నవ్వుతూ)

 

ఈ పుస్తకం కోసం ఈ క్రింది నెంబర్లను సంప్రదించవచ్చు:6304423040, 9581238935

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: , , , ,