Breaking Down The Hard-Hitting Lyrics Of ‘Arupu’ That Reflect The Harsh Reality Of Society

 

కల్మషం లేని చిరునవ్వు వెనుకాల కామాన్ని వెతికే రాక్షసుల మధ్య ఉంటున్నాం మనం. విద్యార్థులను తమ పిల్లలుగా భావించి, పాఠాలు నేర్పి, మంచి చెడులు చెప్పాల్సిన గురువులే..తమ పిల్లల వయసున్న అమ్మాయిల దగ్గర ద్వంద్వార్ధాలు వచ్చే మాటలు మాట్లాడి, మీద చేతులు వేస్తున్నా.. ” ఈ విషయం ఇంట్లో చెబితే నన్ను ఇక కాలేజీకి పంపరేమో?? ఒకవేళ పంపినా నన్ను పరీక్షల్లో ఫెయిల్ చేస్తారేమో?” అనే భయంతో, ఒకవేళ చెప్పినా.. ” నీకు ఇలా జరిగింది అని బయటకి చెప్పకు, చెప్తే మన పరువే పోతుంది..నీకు పెళ్లి చెయ్యటం కూడా కష్టం అవుతుంది” అనే ఆలోచనతో తల్లిదండ్రులు కూడా వారి ఆగ్రహాన్ని అణుచుకుని మౌనంగా ఉండిపోయి ఆ రాక్షసులను రక్షిస్తున్నారు. ఆ రాక్షసులు ఈ మౌనాన్ని ఆసరాగా తీసుకుని విరుగుడు లేని వ్యాధిలా వ్యాపిస్తునే ఉన్నారు. వాళ్ళు పడే ఆవేదనని చూసి నవ్వుతూనే ఉన్నారు.

నీ మౌనాన్ని వీడు#Breakthesilence అంటూ, “మమ్మల్ని వదిలెయ్యండి, ఏమి చెయ్యకండి” అని ప్రార్ధించే చేతులని పిడికిలిగా మార్చి, ఈ కలికాలంలో ప్రతి ఒక్క స్త్రీనీ కల్కిలుగా మారి ఆ రాక్షసులని సంహరించమంటూ, ప్రస్తుత సమాజం లో ఆడవాళ్ళు ఎదుర్కుంటున్న ఎన్నో సమస్యలని ( Molestation, Acid Attacks, Dowry, Child sexual abuse, Sexual Harassment, Discrimination) కళ్ళకి కట్టినట్టు చూపిస్తూ, వాళ్ళు పడే బాధలను ‘అరుపు‘ అనే ఒక పాట (RAP) రూపం లో మన ముందుకి తీసుకుని వచ్చారు రోల్ రైడ & KAMRAN. చదువుతున్నా సరే మనల్ని భావోద్వేగాలకు గురయ్యేలా చేసే ఈ పాట లిరిక్స్ మీకోసం:

P.S:తప్పులు ఉంటే క్షమించండి.


 

పుట్టగానే ఏడ్చినప్పుడు తెలియలేదు, చచ్చేవరకు ఏడుస్తూనే వుంటానని


 

లోకం మొత్తం నాదే అసలు,
నా లోపలె జీవం మొదలు..
అయ్యా నేడే మీకే అలుసు ,
నా కోపమె మీకేం తెలుసు…
పేగు పేగు నాతో కలిసి,
నా నెత్తురె నీకే పంచి ..
పెంచా.. పెంచా.. నాపై దుమికే ఈ రాక్షసుల 

అత్యాచారం చేసినోన్ని ఉరి తీయాలి
మెడ పట్టి , గొంతు పిసికి, కాలబెట్టాలి
నేను చెప్పేదంతా లోకం మొత్తం వినపడాలి
నీ చెల్లి కోసం ఏరోజైనా నిలబడాలి
నేను పడేది పాటనె కాదు, చిన్నారి మాటల్లే ఇవి, కన్నులు కళ్ళార తడి కాపాడేదెవరు మరి,
అమ్మాయిల వాకిళ్ళలోనే సంకెళ్లు భందించి మరి,
రంగుల ముగ్గుల పొడి రక్తంగ మారేనె పడి


 

మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితె
అంకుల్ నా చెయ్యి పట్టి మీద మీద పడితే
యేమని చెప్పను నేను ఎవ్వరికి చెప్పను నేను
మీరే మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని


 

ఎందుకు మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను అసలు
వినాలన్న నేను చందమామ కథలు
ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు
పుట్టగానే చంపేసుంటె తప్పుతుండె ఉసురు


 

చిన్న బట్టలేసుకుంటె చంపేయ్యాల?
ఇంకెన్ని రోజుల్ దాచుకుంట ప్రాణం ఇలా
నేను చదువుకోవాలా, లేదా బడికెళ్లాలా
న్యూస్పేపర్ మెయిన్ స్టోరీ ఐపోయానివాల


 

చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనిషనే రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయింది
ఎనిమిది ఏళ్ళ చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపినా ఘటన మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిపోయింది 

Village పిల్లాని కాలేజికెల్లాను
Distinction కొట్టేసి డిస్ట్రిక్ట్ లు దాటాను
సిటీ కి రాగానే సీటీ లు కొట్టారు
నల్లగున్నానని నేను నవ్వులపాలయ్యాను


 

తల మీద చెయ్యివేసి దీవించె గురువులు
నడుం మీద చెయ్య వేసి కోరారు పరుపులు
జింక పిల్లలాగ నేను తీసాను పరుగులు
చనిపోయిన కూడా మీద పడ్డారు పురుగులు


 

ఎదో సాధిద్దామని క్లాస్సేస్ కి వెళ్తే
కొవ్వెత్తి లవ్ అంటూ నా వెంట పడెనె
చిన్నచూపు చూసి నా చున్నీ లాగాడు
ఆసిడ్ దాడుల్లో నా పేరెక్కించాడు 

రోడ్డు మీద రేప్ చేసి రోకల్ తో చంపారు
ఇది విన్న మా డాడీ గుక్కపెట్టి ఏడ్చాడు
కాండిల్ పట్టుకొని వాకింగ్ చేస్తారు
కాండిల్ ఆరిపోగానె ఇంటికెళ్ళిపోతారు


 

ఒరేయ్ అన్నయ్యా నన్ను పెంచావుగా
నా పెళ్లి కోసం బరువులెన్నో మోసావుగా
ఇల్లు వదిలి ఇంటిపేరు మార్చారుగా, ఐన ఏడ్పు కూడా నవ్వుతోనే దాచానురా 

అమెరికా సంభందం అన్నారు మొదట్లొ
వెన్నంటే ఉంటాను అన్నాడు అప్పట్లొ


 

అనుమానం పెట్టేసి దాచాడు గుప్పెట్లొ
దెబ్బలన్ని కాచుకొని ఏడుస్త చీకట్లొ
సారీ అన్నయ్యా అది ఆయిల్ మరక కాదు సిగరెట్ అని చెప్పాలంటే నాకు నోరు రాదు
కుంటుతున్న అంటే నేను కింద పడలేదు


 

కోడలనుకున్న కానీ.. పనిమనిషిని నేను
నా కాలే కట్టి, గుడ్డ నోట్లో పెట్టి, కట్నం అంటూనె క్రికెట్ బాట్ తోటే కొట్టి
ఎవరు భాద్యులు కారు అని లెటర్ ఏ రాసి, నా చేతిలో పెట్టి ఫ్యానుకి ఉరి వేశారు
చేతులు దులిపేసారు 

భయపడి, తలదించి, కాళ్ళమీద పడకు
యెగబడు, తలువని బలిసిందారా బాడకౌ
ప్యాంటు జిప్పు విప్పగానే మొగాడు కాదు
గల్లా పట్టి కొట్టుడు కొట్టు జోలికసల్ రాడు 

Roll Rida and Kamran
We request you to be strong women
Stronger than all


 

ఈ పాటని భవిష్యత్తులో మనం విని/చూసి
ఇప్పటికీ అమ్మాయిల పరిస్థితి ఇలానే ఉంది‘ అనే బాధపడే రోజుకన్నా.. ‘ ఆరోజుల్లో అమ్మాయిల పరిస్థితి ఇలా ఉండేది‘ అని చెప్పుకునే రోజు కోసం ప్రయత్నిద్దాం.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , ,