If You’re A Health Conscious Person Who Prefers Green Tea, This ‘Araku Chai’ Is A Saviour

 

నేల తల్లి ఒడిలో కొలువై ఉన్న అరకు పచ్చని ప్రకృతి సౌందర్యానికే కాదు, శ్రేష్ఠమైన వన మూలికలకు ప్రసిద్ది. మరీ ముఖ్యంగా ఇక్కడ దొరికే కాఫీ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇంతవరకూ కాఫీ గింజలతో కాఫీనే తయారుచేశారు. ప్రస్తుతం కాఫీ ఆకులతో సరికొత్త ఛాయ్ ను భారత దేశంలో మొదటిసారి తయారుచేస్తున్నారు. 70% శాతం ఎండిన ఆకులు, 12% అనాస పువ్వు, 10% నిమ్మగడ్డి, 8% సోంపు విత్తనాల కలయికతో తయారుచేసే ఈ అరకు టీ బయట దొరికే గ్రీన్ టీ కన్నా అధిక మేలు జరుగుతుంది.


ఆరోగ్యానికి మేలు:

ఇలాంటి టీ ఎక్కువగా ఇథియోపియా లో ఎక్కువగా తీసుకుంటారు. అందువల్లనే వారిలో డయాబెటిక్ పేషంట్స్ తక్కువ అని ఇక్కడి తయారీదారులు చెబుతుంటారు. సాధారణ గ్రీన్ టీ లో ఉండే కెఫిన్ కన్నా ఇందులో 45% తక్కువ ఉంటుంది, అలాగే కలర్స్ అసలే ఉండవు. దీనికి పాలు పంచదార కలపాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా గ్రీన్ టీ తో పోల్చుకుంటే ఇందులో 17% ఎక్కువ యాంటీ యాక్సిడెంట్స్ ఉండడం వల్ల ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తుంది.


కొత్త ఆదాయం:

అరకులో ఎప్పటినుండో కాఫీ గింజల ఎగుమతి జరుగుతుంది. ఐతే ఇప్పటి వరకు గింజలను తీసుకుని ఆకులను వదిలేసేవారు. ఈ మధ్య జరిగిన పరిశోధనలలో ఆకులు కూడా టీ పొడి కి ఉపయోగపడతాయని తెలియడంతో రైతులు ఇతర సంస్థలకు అదనపు ఆదాయం వస్తుంది. బోధన్ కు చెందిన రామన్ మాదాల గారు అరకు లో దొరికే కాఫీ ఆకులను, మూలికలను అమెరికా సిలికాన్ వ్యాలీలో పరిశోధనలు చేయించారు. అనుకూలంగా రిజల్ట్స్ రావడంతో రామన్ గారు “న్యాచురల్ ఫార్మసీ ఇండియా” సంస్థ ప్రతినిధిగా అరకు నుండి వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.

ఒక ప్రాంతంలో అద్భుతమైన వనరులు ఉంటే అవి స్థానికులకు కూడా ఆదాయ మార్గంగా ఉండాలనే ఉద్దేశ్యంతో రోజువారీ కూలీలుగా కాకుండా అరకు మన్యంలో ఉండే రైతులు సంఘాలుగా ఏర్పడి ఆకులను సేకరిస్తుంటారు. సేకరించిన ఆకులకు న్యాచురల్ ఫార్మసీ ఇండియాకు అమ్మి వచ్చే లాభాలను పంచుకుంటున్నారు..

For additional details visit their FB page.


 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: , , , , ,