10 Hilarious ‘Aragundu Thitlu’ From Aha Na Pellanta That You Can Scold Your Friend

 

27 నవంబర్ 1987 ఒక సినిమా రిలీజ్ అయ్యింది. ఆ సినిమా పేరు “అహ నా పెళ్ళంటా”. ఆ సినిమా మనకు “బ్రహ్మానందం” లాంటి బహుమతి ని ఇచ్చింది. ఎన్నో పాత్రలతో మనల్ని నవ్వించిన బ్రహ్మానందం గారి ప్రయాణం లో మొదటి అడుగు పడింది ఈ సినిమా తోనే. అరగుండు గా తన అయ్యగారి మీద కోపాన్ని బయట పెట్టలేని ఒక సగటు పనోడిలా, తన అయ్యగారి పిసినారితనానికి, పిచ్చితనానికి మొదట బలయ్యే అమాయకుడిలా బ్రహ్మానందం గారు ఎప్పటికి మనకు గుర్తుండిపోతారు. అరగుండు frustration ని ఎదో ఒక సమయం లో మనం relate చేసుకుంటాం. ఇప్పుడు మాత్రం అరగుండు తన అయ్యగారిని తిట్టే తిట్లను చదువుతూ, నవ్వుతూ, ఇంకొంచెం relate అవుదాం మరి..

 

1. తన పేరు గోవిందు అయినా, “అరగుండు” అని పిలిచే తన అయ్యగారికి, మన అరగుండు ఇచ్చిన బిరుదు.


 

2. పేపర్ పంచె ని కట్టుకున్న తన అయ్యగారిని అరగుండు వర్ణించే తీరు ఉంది చూసారు..


 

3. వాన కాలం వర్షాలు కురావట్లేదని జీతం లో 10 రూపాయలు విరగ కోసేసినప్పుడు :


 

4. చారు పెట్టుకోవడం కోసం వీధి లో ఉన్న పుల్లలు ఏరమని చెప్పినప్పుడు:


 

5. నిప్పుకోసం రాళ్ళని కొట్టమన్నపుడు :


 

6. పెళ్లి చూపులకి వచ్చినవాళ్లు, తినడానికి ఆవకాయ్ జాడి తెప్పించమన్నప్పుడు  :


 

7. తన అయ్యగారు కోడిని వేలాడదీసి ఉత్తన్నం తినడం చూసినప్పుడు:


 

8. అసుద్ధ భక్షక అంటే అన్ని శుద్ధం చేస్కుని తినేవాడని తన యజమాని వివరిస్తున్నప్పుడు..:


 

9. తన మీద చాడీలు చెప్పినందుకు, ఆరు రూపాయిల పది పైసల జీతం లో ఆరు రూపాయిలను కోసేసినప్పుడు…:


 

10. అర్ధరాత్రులు బస్టాండ్ దగ్గర టీ అమ్మమని చెప్పినప్పుడు:


 

11. అయ్యగారు తన బామ్మరిది ని పిచ్చోడ్ని చేసినప్పుడు :


 

12. “ఇప్పుడు ఎందుకింత డబ్బు” అని అన్న తన అయ్యగారి మాటలకి ఆశ్చర్యపోతూ.. :


 

13. ఇక చివరికి తన యజమాని తో విసిగి వేసారి పోయిన మన అరగుండు, open up అయిపోయి అన్ని రోజులు మనసులో అనుకున్నవి అన్ని బయటపెట్టేసాడు :
నోర్ముయి సన్నాసి పీనుగా. చేతులకి చెప్పులేస్కుని, కాళ్ళ వేళ్ళకి  ఉంగరాలు పెట్టుకునే వాడి మొహం నువ్వును. ఒక సామాన్య కుటుంబికుడు, తల తాకట్టు పెట్టి లక్ష రూపాయిలు తెచ్చి, రైలింజను లో బొగ్గేసే పారల్లాంటి నీ చేతుల్లో పెడితే, ఆ డబ్బు ని శుబ్బరంగా ఇనప పెట్టెలో దాచుకుని ఇప్పుడు ఇవ్వలేదంటావా?
రేయ్ ప్రపంచం లో నీ అంత నికృష్టుడు ఇంకొకడు ఉండడు రా.  శవం మీద మరమరాలు ఏరుకుని తినేవాడిలా ఆ మొహం చూడు. 
నువ్వు పీకేదేంట్రా పిచ్చి కుంక. నేనే మానేస్తున్న ఈ ఉద్యోగం. మంచితనం మానవత్వం లేని నీ లాంటి వాడి దగ్గర పనిచేయడం కంటే, ఒక గోచి పెట్టుకుని , నాలుగు పందులని పెంచుకున్న, గౌరవం గా మనశాంతి తో బతకచ్చు. అలా నిప్పులు కక్కిన గాడిదలా ఓండ్ర పెట్టకు.  తెగిపోతాయి.
” అని చివరిగా LAST PUNCH వేస్తాడు.


 

అలా అరగుండు తన అయ్యగారి తిట్టించడమే కాదు. అందరి జీవితానికి పనికొచ్చే ఒక మంచి మాటని కూడా పలికించారు జంధ్యాల గారు. సినిమా మొదలు నుండి చివరి వరకు చిన్న gap కూడా ఇవ్వకుండా నవ్విస్తారు ఈ సినిమా. అప్పటివరకు కొన్ని సినిమాలు చేసిన కోట శ్రీనివాసరావు గారి మంచి పేరు తెచ్చిన సినిమా కూడా ఇది. నూతన ప్రసాద్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, రాళ్ళపల్లి గారు అందరు కడుపుబ్బా నవ్విస్తారు. ఇప్పటికి మొదటి సరి చూసినప్పుడు ఎంతలా నవ్వుతామో అలానే నవ్వుతాం. ఇంకెందుకు ఆలస్యం ఇంకోసారి show ఏసేయ్యండి మరి.


 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , ,