Everything You Need to Know About The Books Written By ANR garu!

చదువు కేవలం జ్ఞానాన్ని మాత్రమే ఇస్తుంది. విజ్ఞతను కాదు.. మనం తరుచూ వింటూ ఉంటాం.. మన పెద్ద వాల్ల నుంచి ఇదేనా నీకు నువ్వు చదువుకుంటున్న చదువు నేర్పింది అనీ…! అవును మనందరం చదువు క్రమశిక్షణను,సంస్కారాన్ని నేర్పేది అనే నమ్మకాన్నీ ఏర్పరుచుకున్నాం. కానీ ఒక్క సారి ఆలోచించండి!

పి.హెచ్. డి లు చేసి నేరాలు చేసిన వారు ఉన్నారు,ఒక్క ముక్క చదువుకోకపోయినా నీతిగా బ్రతుకుతున్నవారు ఉన్నారు కదా..! ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకుంటూ ఎందుకు పట్టుబడతారు?అడ్డంగా ఆదాయానికి మించి అక్రమాస్తులు సంపాదించి ఎందుకు జైలు పాలవుతారు? చదువుకుంటే సంస్కారం అబ్బే అవకాశం ఉంది కానీ దాన్ని అలవర్చుకోవడం,ఆచరించడం ఆ వ్యక్తి పై ఆధార పడి ఉంటుంది. వాస్తవానికి పుస్తకాల్లోంచి చదువు కోవడం కంటే చుట్టూ ఉన్న మనుషుల నుంచి,సమాజం నుంచి నేర్చుకోవడం ఎక్కువ అవసరం. ఏ పాఠ్య పుస్తకాల్లోనూ ఎలా ప్రవర్తించాలి?,ఎలా మాట్లాడాలి?ఎలా నడుచుకోవాలి అంటూ ప్రత్యేకమైన పాఠాలు, సిలబస్ ఏమీ ఉండదు.ఏది మంచో,ఏది చెడో ఎంచుకునే విచక్షణా జ్ఞానం మన చుట్టూ ఉన్న పరిస్థితులపై,మనం పెరిగిన వాతావరణం పై ఆధారపడి ఉంటుంది. ఇక ఏ రంగంలో నైనా చదువు కున్నవాడిదే పై చేయి, వాడిదే విజయం అని కూడా అందరూ అనుకుంటూ ఉంటారు..సాహిత్యం లో ఆసియా నుంచి మొట్టమొదటి నోబుల్ పురస్కారాన్ని గెలుచుకున్న విశ్వ కవి రవీంద్రనాధ్ ఠాగూర్ అసలు బడికే వెల్లలేదంట.

చాలా దశాబ్దాల క్రితం భారత దేశంలో అత్యధిక భాగాన్ని అత్యంత సమర్ధవంతంగా పరిపాలించిన అక్బర్ మహారాజు కూడా ఏమీ చదువుకోలేదంట. మన తెలుగు వారిలో ఇదే కోవకు చెందిన వారిలో “అక్కినేని” తప్పక ఉంటారు.ఆయన చదువుకుంది నాల్గొవ తరగతి వరకే, కానీ తర్వాత పట్టుదలతో ఆంగ్లం నేర్చుకున్నారు..!అనర్గళంగా మాట్లాడేవారు కూడా, అక్కినేని చదువుకోకపోయిన ఆయనకు చదువు విలువ తెలుసు.అందుకే ఆయన సొంత ఊరైన గుడివాడలోని కళాశాలకు ఎన్ఆర్ కళాశాల (ANR College) స్థాపనకు తోడ్పడ్డారు. పేదరికంలో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్ధులకు ఉపకారవేతనాలు, విరాళాలు ఏర్పాటు చేశారు!

ఆయన మనకు తెలుగు ప్రేక్షకులను దశాబ్దాల పాటూ అలరించిన ఓ మహానటుడిగానే తెలుసు. కానీ ఆయన ఓ గొప్ప రచయిత కూడా. ఆయన తన జీవిత విశేషాలను రంగరించి నాలుగు పుస్తకాలు రాసారు..! తప్పక చదవవల్సినవి అవి.

1. అక్కినేని ఆలోచనలు(అఆ లు)

ఆ పుస్తకంలో `నా నట జీవితానికి, జీవితానికి సత్యమార్గాన్ని చూపించిన, సహాయంచేసిన సహృదయులు, సద్విమర్శకులు అయిన పత్రికా రచయితలందరికీ కృతజ్ఞతలతో ఈ అ ఆ లను సమర్పిస్తున్నాను’ అని రాసుకున్నారు అక్కినేని.1996లో దీన్ని ప్రచురించారు.

‘వివేకం, విజ్ఞానం ఉన్న శత్రువు కంటే అవివేకం, అజ్ఞానం ఉన్న మిత్రుడు ప్రమాదకరం.’’ ‘‘నువ్వు మంచివాడవని అందరూ అనుకోవాలని ఆలోచించకు. చెడు చేయకూడదని ఆలోచించు. అది చాలు.. నువ్వు నీకు తెలియకుండానే మంచివాడివే అవుతావు.’’ లాంటి జీవిత సత్యాలను అందులో రాసారు అక్కినేని.
 
16798_front_cover
 
2. నేను చూసిన అమెరికా

తన విదేశీ పర్యటన అనుభవాల్ని “నేను చూసిన అమెరికా” అనే గ్రంధంలో వివరించారు అక్కినేని. అక్కడ ఆయనను ఆకట్టుకున్న విషయాలను,అక్కడి అభిమానుల ద్వారా లభించిన ఆదరణనూ ఇందులో రాసుకున్నారు అక్కినేని. (అమెరికా ప్రభుత్వ ఆహ్వానంపై భారతదేశ సాంస్కృతిక రాయబారిగా అక్కినేని అమెరికా ను సందర్శించారు. అప్పుడు చేసిన రచన ఇది)

3. మనసులోని మాట

ఇది అక్కినేని స్వీయచరిత్ర.
“ఈ నా నట జీవిత సాగరంలో లేచి పడిన తరంగాలు, సుడిగాలులు, అల్లకల్లోలాలు గురించి చర్చించడమే ఈ పుస్తకం. సినిమా నటుడు ఎదుర్కునే స్థితిగతులు తెలియజెప్పాలనే ఈ పుస్తకం”. అంటూ ముందుమాటలో రాసుకున్నారు అక్కినేని.ఎన్నో జీవితానుభవాలను ఈ పుస్తకం లో పంచుకున్నారు అక్కినేని.
 
Manasuloni_Mata_comp-300x450
 
4. నేను నా జీవితం

“కృషిని నమ్మినవాడ్ని. నేను అదృష్టం అనేది ఎప్పుడూ నమ్ముకోలేదు” అంటారు అక్కినేని.ఆయన తన సుదీర్ఘ నటజీవితంలో చవిచూసిన అనేక మలుపులను ఉదాహరిస్తూ,తన జీవితంలోని అనుభవాలను ప్రస్తావిస్తూ ఈ పుస్తకం రాసారు అక్కినేని.
 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: