కల, నమ్మకం, ధైర్యం తన సైన్యాలు గా గమ్యాన్ని చేరుకుంటున్న ప్రతి అమ్మాయి పయనం – A Short Poem
అనగనగా ఒక అమ్మాయి
ఆ అమ్మాయి కళ్ళు అందమైన కలలను కంటున్నాయి..
పాదాలు విజయాల వైపుకు నడవాలనుకుంటున్నాయి..
చేతులు అందరూ గౌరవించే ఘన చరిత ను రాయాలనుకుంటున్నాయి..
మనస్సు లోని భావాలెన్నో అంతులేని లోకానా స్వేచ్ఛ గా ఎగరాలనుకున్నాయి..
కానీ …
మగాళ్ల మధ్యనున్న మృగాల వల్ల, ఆ కలలు కల్లలు గానే మిగులుతున్నాయి..
అమ్మాయి అనే తేడా, ఎంతో దూరం నడవాల్సిన పాదాలను వంటింటి నాలుగు గోడల మధ్యనే నడిపిస్తున్నాయి.
సమాజం మీదుండే భయం, పట్టాలు పట్టవలసిన చేతులకు గరిట ని అందిస్తున్నాయి.
పద్ధతులు, పరిమితులు, ఆ మనస్సుల రెక్కలను బంధిస్తున్నాయి.
అయినా…
ఎక్కడో చిన్న ఆశ, తనపై తనకుండే చిన్న నమ్మకం, తనని తన గమ్యాన్ని బతికిస్తున్నాయి.
If you wish to contribute, mail us at admin@chaibisket.com