This Story Reminiscing The Summers We Spent At Our Grandma’s During Childhood Will Make You Nostalgic!

Contributed By RJ Avi
నాకు సెలవులు అనగానే గుర్తుకొచ్చే ఏకైక Emotion
అత్తారింటికి వచ్చిన లేడీస్ అందరికి పిల్లల హాలిడేస్ పేరుతో వాళ్ళ పేరెంట్స్ చూడడానికి మన tradition లో పెట్టిన ఒక పెద్ద gift
ఈ గిఫ్ట్ గురించి చెప్పాలంటే
కొంచెం వెనక్కి వెళ్దాం రండి !!
అప్పట్లో annual exams అయిపోయాక
Relatives ఎప్పుడొస్తున్నారో కనుక్కుని
మా అమ్మమ్మ వాళ్ళ ఊరు మనకి అలవాటు
ఈ gap లో ఎదో పీకేద్దాం మనకి స్కూల్ ఇచ్చే హాలిడేస్ వర్క్ అని తీసుకెళ్తామ్
రాద్దాం అని కాదు …రాద్దాం లే అని
ఒక్కసారి journey స్టార్ట్ అయితే ఎదో తెలియని ఆనందం
మధ్యలో బస్ ఆగితే బస్ విండో లో నుండి
జామకాయల బ్యాచ్
అది తిని ఒక sleep ఏసే లోపల
బస్ ఊరికి రీచ్ అవుతోంది అనగానే
ఎదో తెలియని excitement
సెలవల మీద ఒక expectation
వీటితో పాటు luggage ని కూడా తీసుకుని రిక్షా దిగగానే
అమ్మమ్మ తాతయ్య వెల్కమ్ చేస్తూ ఇచ్చే smile !! అబ్బా ఎం happiness
Next roju అక్కడ లేవగానే ఎదో pleasant ఫీలింగ్ కోయిల సౌండ్
పొలాల గాలి ఇంకా ఏమి అక్కర్లేదు అనిపిస్తుంది
వెళ్లిన ప్రతిసారి మా పండు గాడి స్పెషల్ ఉల్లిదోస తినాల్సిందే
” మూర్తి గారి మనవళ్ళు వచ్చారు అనగానే ఒక చిన్న సెలబ్రిటీ ఫీల్స్ లే ”
బాగా లేట్ గా రెడి అయి పక్క పల్లెటూరులో పిన్ని మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్లడం
సాయంత్రం ఏం సినిమా చూడాలా అని మధ్యాహ్నం లంచ్ నుండే మన పిల్ల గ్యాంగ్ ప్లాన్ వేసుకోవడం
హై స్కూల్ దగ్గర బాగా లేట్ అయ్యే వరకు క్రికెట్ ఆడితే అమ్మ అరుస్తూ గ్రౌండ్ నుండి తీసుకెళ్లడం
సాయంత్రం అయితే 2 హార్స్ పవర్ కట్ అనే facility
ఎందుకంటే
ఈ గాప్ లో మళ్ళీ సబ్జా ఇన్డోర్ ఆడుకోవాలి
ఆడి ఆడి అలిసిపోయిన మాకు మా అమ్మమ్మ ఒక్కొకరికి గోరు ముద్దలు పెట్టడం
” నాకు పె……ద్ద ముద్ద కావాలి ”
మన ఫేవరెట్ dialogue
కొంచెం పది అవ్వగానే ఏం భయం లేకుండా
హాయిగా బయట మడత మంచాలు వేసుకుని
ఒక table fan oscillation లో పెట్టుకుని
పడుకుని చందమామ చూస్తూ
మన relativesతో జోకులు వేసుకుంటూ నిద్రపోవడం
అబ్బో ఇది కాకుండా
మావిడి కాయలు కొట్టం
ముక్కలు చెయ్యడం
అలా చేసిన ఆవకాయని
ఎవరి వాటా వాళ్ళు జాడీలో సర్దడం
ఇంకా మన relatives ఎవరైనా టీచర్ అయితే వాళ్ళు చెప్పే సమ్మర్ classes
Torture
అంత …. enjoyment ని
ఇంత ….education ని
కొంత… బాండింగ్ ని
ఎంత చెప్పిన అవ్వని మెమోరీస్ ని
నేను నిజంగా జాబ్ లో కొంచెం లీవ్ కూడా దొరక్క
నా ప్రపంచాన్ని
నా హాయిని మిస్ అవ్వుతుంటే ఎలా ఉంటుందో తెలుసా !!
మీకు ఎలా ఉంది ??
కామెంట్ చెయ్యండి
If you wish to contribute, mail us at admin@chaibisket.com