Here Is The Inner Meaning Of Beautifully Penned “Dhaga Dhaga Mane” Song From Agnyaathavaasi!

 

ధగ ధగ మనే
తూరుపు దిశ
పడమర నిశై ముగిసేనే

– సూర్యుడు ఉదయించడం కారణంగా కొద్ది సేపటి క్రితం వరకూ ధగ ధగమంటూ మెరిసిపోయిన తూరుపు ప్రాంతం నెమ్మదిగా ఆ వెలుతురుని పడమర మీదుగా కోల్పోయి .. చీకటి అలముకుంది/ చీకట్ల తో నిండిపోయింది

|| గల గల మనే నది పదనిస
కన్నీరులో తడిసెనే

– ఎప్పుడూ హ్యాపీగా గల గల అంటూ తన పరవళ్ళ తో పదనిసలు పాడే నది ఒక్కసారిగా కన్నీరు లో తడిసిపోయిందట

|| కొడవలి భుజమున వేసి
కొడుకే కోతకు కదిలే

– ఒక పక్క కన్నీరు లో నది ఉండగా , దిశలు అన్నీ చీకటిగా మారుతుంటే .. ఇక తప్పదు అన్నట్టు కొడుకు ఆ చీకటి లో పంట కోతకి బయలు దేరాడు ..

|| దర్బ ను ధనువుగ విసిరే
భార్గవరముడు వీడే

– దర్బ అంటే గడ్డి పోచ లాంటిది హోమాలలో వాడతారు .. అంత చిన్న గడ్డి ముక్కని కూడా ధనువు గా(ధనువు అంటే విలు Arrow bow ) మార్చగలిగిన భార్గవ రాముడు అంతటి వ్యక్తిత్వం ఉన్న వాడట అతను ..

|| సాధువు కలే వెలుగున పడి
సత్యం ఇలా మెరిసెనే ..

– ఎవరో ఒక అపరిచిత సాధువు కలలో నిజా నిజాలు బయట పడి అతనికి మ్యాటర్ రీచ్ అయ్యింది

|| అజ్ఞాతమే మరుగన పడి
ఆయుధమెగసెనే

– ఇనాళ్ళూ తెలిసో తెలీకనో అతను ఉన్న అజ్ఞాతం ఒక్కసారిగా ముక్కలు అయిపోయి .. ఆయుధం(weapon) ఎగసింది . అతన్ని ఆయుధం తో పోల్చాడు రైటర్ .. అంటే ఎవరో చేతికి ఆయుధంగా మారాల్సి ఉన్నా ఇన్నాళ్ళూ సైలెంట్ గా ఉన్న అతను ఇప్పుడు ‘ఎగసాడు’ – బయలు దేరాడు

– – – – – – –

High Pitch –

|| ఎర్రగా తడిపెనే
ఏ రాచ రక్తమో నింగినే ..

– విశాలంగా , ప్రశాంతంగా ఉన్న ఆకాశాన్ని చెడు రక్తం ఎర్రగా తడిపిందట(హాని చేస్తూ) (రాచ అంటే bad or dangerous)

|| కోరగా మెరిసెనే
పసిగరిక అంచునో కిరణమే

– ఆకాశం అంతా చెడు రక్తం తో తడిచిపోయిన క్షణాలలో .. ఎవ్వరికీ ఆశలు లేని టైం లో ఎక్కడో ఒక పసి గరిక – మొన్ననే చిగురించిన గడ్డి మొక్క అంచున కిరణం మెరుస్తూ ఆశలు కోల్పోయిన వారికి ఆశలు అందిస్తోంది ..

|| మెరుపుల దీపం
చముర్రల్లే చీకటి ఒంపి
మబ్బులో వెలుతురు
నింపి చిరుజలులు కురిపిస్తాడే

– వీరి దృష్టిలో అతననొక చిన్న గడ్డి ముక్క కావచ్చు కానీ అతని స్టామినా మాత్రం అమోఘమాట .. మెరుపుల దీపం — మెరుపు లలో వచ్చే lightening ని ఉపయోగించి , అక్కడున్న చీకటితో ఆ lightening ని fuel గా వాడుకుని (చమురు అంటే fuel) కనపడకుండా పోయిన మబ్బుల్లో వెలుతురుని నింపి వాటిల్లో ఉన్న clouds previous గా evaporate చేసుకున్న వాటర్ తో చిన్నపాటి జల్లులు కురిపిస్తాడట

|| చినుకల దారం
చివరంచుకు నింగిని చుట్టి
చిగురించే నేలకు కట్టి
రెండిటిని కలిపేస్తాడే

– అలా పడుతున్న చిరు జల్లులో చినుకుల కి దారం కట్టేసి ఆ జల్లుల ద్వారా క్రితం పరిస్థితులు మళ్ళీ సరిగ్గా మారుతూన్న (చిగురిస్తున్న ) నేల కి కట్టి .. ఆ రెండిటినీ కలిపేస్తాడు .. అంటే పరిస్థతి ని ఇదివరకు ఉన్నట్టు మార్చేయగలడు

|| ఆవుని వరం ఈలేదని
అయ్యోరినే నరికేనే
అంబా అని
అనలేదని పసి దూడనే నలిపెనే

– జమదగ్ని ఆవుని వరంగా ఇవ్వలేదు అని కోపం తో ఆ ముని ని చంపేస్తాడు Kartavirya Arjuna , పరశురామ – కార్తవిర్య అర్జున ల హిందూ Mythology లోంచి ఈ లైన్స్ తీసుకున్నాడు రైటర్ .. అంటే villians ఇక్కడ కర్తవిర్య లాగా దుర్మార్గులు అని ..

|| కొడవలి భుజమున వేసి
కొడుకే కోతకు కదిలే
ధర్భను ధనువుగ విసిరే
భార్గవరముడు వీడే ..

– పై విషయాలు తెలుసుకున్న అతను .. వస్తున్నాడు ..

|| సిద్ధుడి ప్రణవంలా వీడు
బుద్ధుడి శ్రవణం లా వీడు
యుధమంత శబ్దం వీడు
వీడొక ప్రమాణం

– ఆ వస్తున్న వ్యక్తి ఎలాంటి వ్యక్తిత్వం తో ఉంటాడు అంటే . సిద్ధుడి యొక్క ప్రణవం(మూలం) ఇతను , బుద్ధుడి వినే పద్ధతి వీడు , యుద్ధం జరిగేటప్పుడు వచ్చే శబ్దం అంత ఇంపాక్ట్ ఇతని ఒక్క చర్య లో కనపడుతుంది , వీడొక parameter – ప్రమాణం

|| రణములా నినదిస్తాడు
శరములా ఎదురొస్తాడు
మరణశరణ తోరణమితడు
వీడొక ప్రమాదం

– War declare చేసి , అదే war లో Sharp weapon లాగా ఫైట్ చేస్తాడు . He himself is a Danger

|| రెప్పంచున కల
అడుగడుగున నిజమై కనిపించేలా
వీడో విడుదల ..
ఎన్ని ప్రాణాల మౌనాలకి వేళ

– ఎప్పుడో కన్న కలలో కనపడ్డ SAVIOUR .. ఇప్పటికి నిజమై కనిపించబోతున్నాడు .. ఎంతో కాలం నుంచీ సైలెంట్ గా నరకం అనుభవిస్తున్న ఎన్నో ప్రాణాలని విడుదల చెయ్యబోతున్నాడు ఇతను ..

– – – – – – –

|| ఎర్రగా తడిపేనే
ఏ రాజ్య రక్తమో నింగినే
కోరగా మెరిసెనే
పసిగరిక అంచులొ
కిరణమే….

|| ముళ్లిన్నని
వివరించదే పువ్వుల యదె
ఎన్నడూ ..

– పైకి అందంగా కనపడే పువ్వు (rose flower was reffered anukunta) .. తన stem , హార్ట్ నిండా ముళ్ళు ఉన్నాయ్ కావాలంటే చూడండి అని చూపించుకోదు ఎప్పుడూ ..

|| కన్నీళ్ల నే వడపోయదె
మేఘం ఎప్పుడూ

– భూమి మీద వాగులు వంకలు సముద్రం లాంటి ప్రాంతాల లోంచి నీటిని EVAPORATE చేస్కునే ఆ మేఘం – క్లౌడ్ .. ఈ నీళ్ళలో ఎక్కడైనా చెడు నీరు , కన్నీరు కనపడినంత మాత్రాన వాటిని వడబోసి వెనక్కి పంపించేయదు .. అన్నిటినీ ఒకేలాగా స్వీకరిస్తుంది అని ..

#############################

ఈ పాట విన్న తరవాత / అర్ధం తెలుసుకున్న తర్వాత .. అప్పటి వరకూ అజ్ఞాతం లో ఉన్న హీరో తన వారు ఎవరు తను ఎక్కడి వక్తి అనేది తెలుసుకుని అగాధం లో మునిగిన తనవాళ్ళ కోసం అజ్ఞాతం ని బద్దలుకొట్టుకుని వచ్చి ఒక్కొక్కడి బాక్సులు బద్దల కొడతాడు అని అనిపిస్తోంది .. ఆ సింపుల్ లైన్ ని శ్రీమణి చాలా అద్భుతంగా రాసాడు ..

ఇక వీడియో విషయానికి వస్తే .. ఆస్తులు అన్నీ కోల్పోయి , సర్వం వదిలేసుకునే టైం లో ఈ లక్షల కోట్ల ఆస్థులకి వారసుడు ఉన్నాడు అంటూ ఖుష్బూ కోర్టు పిటీషన్ వేసిన టైం లో’ ధగ ధగ మనే .. ‘ లిరిక్ దగ్గర ఖుష్బూ , పడుతున్న నరకం , ఇబ్బందులు చూపించి .. కాసేపటికి ‘ఎర్రగా తడిపెనే ఏ రాచ రక్తమో నింగినే .. ” అన్న లైన్ దగ్గర కెమెరా ఫోకస్ అబ్రాడ్ లో ఉన్న కళ్యాణ్ మీదకి షిఫ్ట్ అయ్యి .. త్రివిక్రమ్ స్టైల్ లో ఒక పీక్ elevation పడితే …… ఆ అద్భుతాన్ని మీ ఊహకే ఒదిలేస్తున్నా ..

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , ,