This Short Poem Takes Us Through The After Effects Of War

Contributed By: Dixith Reddy
యుద్ధం ముగిసింది….
ఇరు వర్గాల్లో అందరూ మరణించారు…..
ఒక్కడు తప్ప
అతను గెలిచాడు
అతను నమ్మిన సిద్ధాంతం గెలిచింది!!
కానీ….
ఆ విషయాన్ని చెప్పడానికి మరో మనిషి లేడు
నేను గెలిచాను….మనం గెలిచాం….మనం సాధించాం
అని అరవాలని ఉంది అతనికి
కానీ ఏం లాభం…
వినే వాడు లేనిదే చెప్పేవాడికి విలువ ఏముంది
మరో మనిషి లేనిదే అతనికి తను మనిషని చెప్పే అవకాశం ఏది
ఆ క్షణం
అతనిలో మొదటిసారి ఆలోచన మొదలైంది
తనని తాను ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాడు…
ఈ యుద్ధం చేయకపోతే మనం చచ్చిపోతామన్నారే
ఈ యుద్ధం గెలిస్తే తిరిగి స్వర్ణ యుగం వస్తుందన్నారే
ఈ యుద్ధంలో చనిపోయినా అమరులమయినట్టే అన్నారే
కానీ తీరా ఈ యుద్ధం గెలిచాక మనకి జరిగిందేమిటి?
ఈ మారణహోమం మనకి మిగిల్చిందేమిటి?
మనుషుల మరణాలు తప్ప.
తెలుసుకున్నా తన తప్పును సరిదిద్దుకునే అవకాశం లేదతనికి
పశ్చాతాపంతో ప్రాయశ్చిత్తం కలగదు ఈ పాపానికి
అంతే అతనిలో ఇక ఏ భావన లేదు
ఎవరిపై కోపం లేదు….
ఎవరిపై ప్రేమ లేదు….
ఎవరిపై ద్వేషం లేదు….
అసలు ఏవిధమైన చలనం లేదు….
ఇంతలో ఒక్కసారి హఠాత్తుగా అతని తుపాకి పేలింది
మానవజాతి సమూలంగా అంతం అయింది.
If you wish to contribute, mail us at admin@chaibisket.com