ఆది పురుషుడు : A Deeper Meaning Into Title Of #Prabhas22 Adipurush

 

పొద్దున్న నుండి ఒక వార్త మారుమోగిపోతోంది. అది ప్రభాస్ 22 వ సినిమా గురించి వచ్చిన కబురు. ఆ సినిమా పేరు “ఆదిపురుష్”. తానాజీ సినిమా ని డైరెక్ట్ ఓం రావుత్ ఈ మూవీ ని డైరెక్ట్ చేస్తున్నారు.


 

ఈ సినిమాలో ప్రభాస్ “శ్రీ రాముడి” పాత్రని పోషిస్తున్నారనే విషయం కూడా చాలా ఆసక్తి కలిగించింది. అయితే శ్రీ రాముడికి “ఆది పురుషుడు” అనే పేరు ఎలా వచ్చింది అనేది ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం రండి..

 

ఒక సారి, బ్రహ్మకి విష్ణువుకి “ఆదిపురుషుడు” ఎవరు అనే విషయం పై వాగ్వివాదం జరిగింది. అప్పుడు పరమేశ్వరుడు లింగం గా అవతరించి, తన మొదలు ఒకరిని, తుది ఒకరిని కనుక్కోమని ఎవరు ముందు కనుకుంటే వారే “ఆదిపురుషుడు” అని చెప్పారు. ఆ సమయం లో, “నీవు అంతం లేని వాడివి” అని , శివుడ్ని శరణు వేడగా, అప్పుడు శివుడు “విష్ణువు నాభి నుండి బ్రాహ్మణ జన్మించాడు కాబట్టి” విష్ణువే “ఆది దేవుడు (పురుషుడు_” అని చెప్పాడు.. ఈ విషయం “స్కాందపురాణం” “శివ పురాణం” లో ఉన్నాయి.

Source:Cick here

 

అన్నమయ్య కూడా “అందరికాధారమైన ఆదిపురుషుడీతడు” అనే తన కీర్తన లో విష్ణువుని ప్రస్తావిస్తూ రాసారు రాసారు..

అందరికాధారమైన ఆదిపురుషుడీతడు
విందై మున్నారగించె విదురునికడ నీతడు
|| అందరి ||

సనకాదులు కొనియాడెడి సర్వాత్మకుడీతడు
వనజభవాదులకును దైవంబైనతడీతడు
యినమండలమున చెలగేటి హితవైభవుడీతడు
మునుపుట్టిన దేవతలకు మూలభూతి యీతడు
|| అందరి ||

సిరులొసగి యశోదయింట శిశువైన తడీతడు
ధరనావుల మందలలో తగరించె నీతడు
సరసతలను గొల్లెతలకు జనవులొసగె నీతడు
అరసి కుచేలుని అటుకులు ఆరగించె నీతడు
|| అందరి ||

పంకజభవునకును బ్రహ్మపదమొసగెను యీతడు
సంకీర్తనాద్యులచే జట్టిగొనియె నీతడు
తెంకిగ నేకాలము పరదేవుదయిన యీతడు
వేంకటగిరిమీద ప్రభల వెలసినఘనుడీతడు

|| అందరి ||

 


భావం:

‘ఏక మేవాద్వితీయం బ్రహ్మ’ అని వేదం పేర్కొనినట్లు సకల జగత్తునకు, సకల ప్రాణులకు ఆధారభూతుడైన ఈ ఆది పురుషుడు అందరివాడు! ’భక్తి కొలద పరమాత్ముడు’, ’ఎంత మాత్రమున నెవ్వరు దలచిన’ అని అన్నమయ్యే పేర్కొనినట్లు, శ్రీ మహావిష్ణువును ఎవరెవరు ఎలా ఆరాధిస్తారో, వారికి ఆయా రూపాలలో సంతుష్టిని కలుగచేస్తూ, అనుగ్రహిస్తాడు! దానికి ఈ సంకీర్తనయే చక్కని ఉదాహరణ! సనకాదులు కీర్తించే సర్వాత్మకుడు ఈ ప్రభువు! పార్వతీ దేవికి, బ్రహ్మకు ప్రత్యక్ష దైవము ఈతడు! సూర్య మండలంలో నిత్యం ప్రకాశించే వైభవమూర్తి ఈ స్వామి! దేవతల వైభవానికి మూలకారకుడు ఈ మహనీయుడు! రేపల్లెలొ ఆలమందలలో గోపకాడై అల్లరి చేసిన కృష్ణుడీతడు! హృదయ నివేదన చేసిన గొల్లెతలకు చనవును(సామీప్యాన్ని) ప్రసాదించిన బంధువు ఈతడు! బాల్యమిత్రుడైన కుచేలుడు ప్రేమతో సమర్పించిన అటుకులనే అమృతాహారాన్ని స్వీకరించినవాడు ఈ వాత్సల్యమూర్తి! పద్మంలో జన్మించిన బ్రహ్మకి బ్రహ్మ పదవిని ఒసగిన కారుణ్య మూర్తి ఈతడు! అట్టి స్వామి కలియుగంలో సంకీర్తనతో పరవశుడై, ఇహ పరాలకు దేవుడైన ఆ విరాణ్మూర్తి వేంకటగిరి మీద దివ్య ప్రభలతో వెలుగొందుతున్నాడంటున్నాడు అన్నమయ్య!

అరసి=తెలిసికొని, గమనించి

Source: Click here


 

మనకు చాలా పురాణాలు ఉన్నాయి. అందులో ఒకటి “శ్రీ కూర్మ పురాణం”. అందులో.. 7వ అధ్యాయం లో ఇలా ఉంది..

అహం బ్రహ్మవిదాం బ్రహ్మా స్వయంభూ ర్విశ్వతోముఖః | మాయావినా మహం దేవః పురాణో హరి రవ్యయః || || 3 ||

యోగినా మస్మ్యహం శంభుః స్త్రీణాం దేవీ గిరీంద్రజా | ఆదిత్యానా మహం విష్ణు ర్వసూనా మస్మి పావకః || || 4 ||

రుద్రాణాం శంకర శ్చాహం గరుడః పతతా మహమ్‌ | ఐరావతో గజేంద్రాణాం రామః శస్త్రభృతా మహమ్‌ || || 5 ||

 

భావం:
ఒక్కో విభాగం లో “ఆది (మొదటివాడు)” ఎవరు అనే విషయాన్ని వివరించారు ఈ శ్లోకం లో:
నేను జ్ఞానులలో బ్రహ్మను, లీలలు చేసేవారిలో హరిని. యోగులలో శంభుడను. స్త్రీలలలో పార్వతి దేవిని. ఆదిత్యులలో(అదితి గర్భం లో జన్మించిన వారిలో) విష్ణువును (సూర్యుడిని విష్ణువు అని కూడా పిలుస్తారు). వసువులు (వసువుకి జన్మించిన వారిలో) పావకుడుని. రుద్రులలో సంకరుడిని, పక్షులలో గరుడని. గజేంద్రులలో ఐరావతమును. శస్త్రములు ధరించిన వారిలో (రాజులలో, యోధులలో, పురుషులలలో) శ్రీ రాముడిని.

 

ఇంకొంచెం సవివరంగా ఈ కింద లింక్ లో రాసారు.
click here:

 

త్రేతా యుగం లో “మానవుడిగా” జన్మించి. మానవుడిగా పెరిగి, మానవుడిగా బాధలు అనుభవించి “తాటకి సంహారం” “రావణ సంహారం”
చేసి, చెడు పై మంచి ని గెలిచేలా చేసిన తొలి రాజు శ్రీ రామచంద్రుడు. ఒక రాజు, ఒక పురుషుడు ఎలా ఉండాలి, ఎలా మసులుకోవాలి అనే విషయాన్నీ రాముడు ని చూసి చాలా నేర్చుకోవచ్చు. తోలిసారి ఒక మానవ ప్రయత్నం చెడు పై గెలిచింది. కాబట్టే రాముడు మనకు మన మానవ జాతికి “ఆది పురుషుడు”. రాముడ్ని దేవుడిలా కాదు మనలో ఒకడైన ఒక మానవుడిగా చూస్తే ఆయన కథ ఇంకా బాగా అర్థమవుతుంది. ఎన్ని సార్లు వచ్చిన మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది రామాయణం. ఇప్పటికి చాలా కథలో రామాయణం ప్రభావం ఉంటుంది. బాపు గారి తీసిన ప్రతి సినిమా లో రాముడి ప్రస్తావన ఉంటుంది. అలాంటి రామాయణ గాథ ని ఇంకోసారి ఇంకొంచెం ఘనంగా చూడబోతున్నాం.


 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , , ,