Here’s Everything You Need To Know About Hari Teja – The Most Hyper Active Contestant Of Bigg Boss Telugu!

 

బిగ్ బాస్ కు ముందు హరితేజ ఎన్నో సీరియల్స్, సినిమాలలో Act చేశారు.. దాని వల్ల తనకు పేరు వచ్చిందా రాలేదా అనేది తర్వాతి సంగతి.. ఎప్పుడైతే బిగ్ బాస్ ఇంట్లో హరితేజను ప్రతిరోజు చూడడం మొదలుపెట్టామో అప్పటి నుండి హరితేజ మనస్తత్వం, వ్యక్తిత్వం తెలిసింది. ప్రతి ఇంట్లోను ఇలా సరదాగ అల్లరి చేస్తూ ఉండే అమ్మాయిలలో తనని కూడా పోల్చుకుంటున్నాం. పైకి అలా అల్లరి చేస్తున్నట్టు కనిపించినా కాని హరితేజ మంచి టాలెంటెడ్. సింగర్ గా, క్లాసికల్ డాన్సర్ గా, మంచి నటిగా తనలో ఎంతో టాలెంట్ దాగి ఉంది.హరితేజ మాత్రమే కాదు వారి అమ్మ నాన్నలు, బంధువులందరూ కూడా మంచి సింగర్సే. వారిది లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలి, ఐనా గాని హరితేజ గారి తల్లిదండ్రులు తనకి ఐదు సంవత్సరాల నుండే కూచిపూడి నేర్పించారు. కేవలం సంగీతం, నాట్యం నేర్చుకోవడం కోసమే చెన్నై, తిరుపతి లాంటి ప్రాంతాలలో ఉండేవారు, అలా వివిధ ప్రాంతాలలో గొప్ప గురువుల దగ్గర నేర్చుకున్నారు. తనకు నాట్యం నేర్పించిన వారిలో మంజు భార్గవి గారు కూడా ఒకరు. పెద్దయ్యాక క్లాసికల్ డాన్సర్, సింగర్ అవ్వాలనుకున్నారట కాని ఇండస్ట్రీ నుండి అవకాశాలు రావడంతో ఫోకస్ అంతా నటన మీదే పెట్టారు. ఐనప్పటికి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ప్రొఫేసర్ గారి దగ్గర ఇప్పటికి నాట్యం నేర్చుకుంటున్నారు.బ్రెక్ అప్ స్టోరి:
(ఈ బ్రెక్ అప్ స్టోరి గురించి చాలా ఇంటర్వూలలో స్వయంగా హరితేజ గారే చెప్పడం వల్ల ఆర్టికల్ లో మెన్షన్ చేస్తున్నాం)

ఇద్దరి మనస్తత్వాలు చాలా దగ్గరిగా ఉంటే వారు త్వరగా స్నేహితులు ఐపోతారు ఆ స్నేహానికి పై స్థితి ప్రేమ. హరితేజ, రఘురామ్ ఇద్దరూ మంచి సింగర్స్ అవ్వడంతో ఇద్దరి మధ్య బంధం ఏర్పడింది. కాని ఇరు కుటుంబాల మధ్య ఏర్పడిన కొన్ని మనస్పర్ధలు, ఇతర కారణాల వల్ల ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత ఆ పెళ్ళి ఆగిపోయింది.


దీపక్ తో:
ఇది పెద్దలు కుదిర్చిన వివాహమే. దీపక్ హరితేజ ల పెళ్ళికి ముందు రెండు సంవత్సరాల క్రితమే పెళ్ళి చూపులు జరిగాయి. దీపక్ బెంగుళూర్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఐతే హరితేజ నాన్న గారు తన కూతురు భవిషత్తును దృష్టిలో ఉంచుకుని దీపక్ గురించి ఎంక్వేరి చేస్తు దీపక్ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ అడిగారట, “నేను చెప్పినా గాని నా మాట మీద నమ్మకం లేదా” అని చెప్పి మొదట దీపక్ వెనక్కి వెళ్ళిపోయాడట. హరితేజ నాన్న గారు అడిగిన విషయంలో న్యాయం ఉందని భావించిన దీపక్ తర్వాత మళ్ళి కలవడం, పెళ్ళి జరగడం చకచకా ఐపోయాయి. మన స్కీన్ ప్లే కన్నా భగవంతుని స్ర్కీన్ ప్లే బాగుంటుంది. మనం ఎంచుకున్న వ్యక్తి కన్నా భగవంతుడు నిర్ణయించిన వ్యక్తి బాగుంటాడు అన్నట్టుగా వారిద్దరు ఒకటయ్యారు.త్రివిక్రమ్ గారితో అనుబంధం:
ఈటీవి అభిరుచి ప్రోగ్రామ్ కి చాలా కాలం నుండి హరితేజ యాంకర్ గా చేస్తున్నారు ఆ ప్రోగ్రామ్ కు తను ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యారు. కొన్ని కారణాల వల్ల తనని మారుస్తున్నారని తెలిసింది. అప్పుడు మనసు బాగోలేక త్రివిక్రమ్ గారికి కాల్ చేసి విషయం చెప్పింది. “నువ్వు ఆ ప్రోగ్రామ్ కు ఎమోషనల్ కనెక్ట్ అవ్వలేదు తొక్కా లేదు, నీకు ఆ ప్రోగ్రామ్ అంటే ఎందుకిష్టమో చెప్పనా.. పక్కన రాజుగారు(కుక్) వంట చేస్తుంటే వాటిని చూస్తు ఉండడం, తినడం ఇష్టం అందుకే బాధ పడుతున్నావ్ అంతే!!” అని త్రివిక్రమ్ గారు బదులిచ్చారట. దానికి హరితేజ కు నవ్వు ఆపుకోలేక పోయిందట అలా నవ్వించి తనని ఓదార్చారు.


హరితేజను త్రివిక్రమ్ గారు సరదాగ సూర్యకాంతం అని పిలుస్తారు(సూర్యకాంతం గారిలా అన్ని క్యారెక్టర్స్ చేయగలదు అని) అ.ఆ.. సినిమా తన కెరీర్ కు ఎంత ఉపయోగపడిందో ఆరు నెలల పాటు జరిగిన షూటింగ్ లో త్రివిక్రమ్ గారి నుండి ఎంతో నేర్చుకున్నారట. “ఒక ధృడమైన జన్మ ఎన్నో జన్మలను కదిలించగలదు”. త్రివిక్రమ్ గారి వల్ల హరితేజ తన జీవితానికి అవసరమయ్యే గొప్ప పుస్తకాలు చదవడం మొదలుపెట్టారు.


 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , ,