This Passionate Acting Guru Lives, Breathes & Dreams Of Acting Every Second!

 

“వచ్చే సంవత్సరాలలో ఇండస్ట్రీలో నిజమైన యాక్టర్స్ లేకుంటే ఆ తప్పు నాదే అవుతుంది. -మహేష్..”

కొన్ని సంవత్సరాల క్రితం మహేష్ గారు “గురువు” అనే పదానికి పర్యాయపదంగా భావి భారతీయులకు ఉజ్వల భవిషత్తును అందిస్తున్న రామకృష్ణ మఠం(హైదరాబాద్) లో శిక్షణ తరగతులకు అటెండ్ అయ్యారు. ఆ రోజు ఓ స్పీకర్ సినిమాల గురించి, నటీనటులు, వారి నటన గురించి వాస్తవ పరిస్థితులకు అనుగూణంగా కొంత తక్కువ చేస్తూ భోదించారు. అదే క్లాస్ లో ఉన్న మహేష్ గారికి ఆ మాటలు ఎంతో స్పూర్తిని నింపాయి.. ఘనత వహించిన రామకృష్ణ మఠంలోనే “యాక్టింగ్ కోర్సులు” భోదించాలి అని నిశ్చయించుకున్నారు. కొన్నాళ్ళకు రామకృష్ణ మఠం హైదరాబాద్ శాఖకు అన్నీ తానై చూసుకుంటున్న స్వామి జ్ఞానదానంద గారని మహేష్ గారు కలిసి “నటన” గురించి వివరించారు. “ఇంత చిన్న వయసులో ఇంతటి జ్ఞానం, నటనపై ఉన్న విస్తృత పరిజ్ఞానికి ఆశ్ఛర్యానికి గురైన స్వామిజీ వెంటనే మహేష్ గారి ఆద్వర్యంలో “రామకృష్ణ మఠంలో యాక్టింగ్ కోర్సులను మొదలుపెట్టారు”. నటనను డబ్బు సంపాధించుకోవడానికి ఉపయోగించుకుంటున్న చాలామంది మనకు కనిపిస్తుంటారు. కాని అదే నటనను ఒక యోగంగా భావిస్తూ ఎంతోమంది కళాకారులను తీర్చిదిద్దితున్న ఓ యువ కెరటం గురించి ఈ రోజు తెలుసుకుందాము.


 

అభినయ యోగం:

ప్రతి మనిషి తనని తాను మర్చిపోయి, ఆ పరిస్థితిలో లీనమవ్వడాన్ని ఎంతో ఇష్టపడుతుంటాడు. అది ఒక సినిమా చూడడం కావచ్చు, స్నేహితులను కలవడం కావచ్చు, మందు తీసుకోవడం కావచ్చు. లేదంటే మరొక క్యారెక్టర్ లో లీనమైనా అతనికి ఆ స్థితి వరకు ముక్తి లభిస్తుంది. ఈ ఆలోచనల నుండి “అభినయ యోగం” అనే కాన్సెప్ట్ తో నటనపై శిక్షణ ఇస్తున్నానంటారు మహేష్ గారు. మహేష్ నాన్న గారు ఎం.ఆర్.ఓ గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. మైక్రోబాయాలజీలో డిగ్రీ చేస్తుండగానే మైక్రోస్కోప్ ద్వారా కణాలను పరిశీలించేవారు. ఆ పరిశీలనల ద్వారానే మనుషులను గమనించడం, వారిలోని రకరకాల ఎమోషన్స్ కు కేంద్రబిందువులపై ఎంతో రీసెర్చ్ చేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో యాక్టింగ్ కోర్స్ లో పీ.జి పూర్తిచేసి “అభినయ యోగం” అనే Acting Research Centre ను నెలకొల్పారు. మహేష్ గారు(9392345674)కేవలం నటన మీదనే శిక్షణ ఇస్తుంటారు తప్పా అవకాశాలు ఇస్తాము అనే ఆశను పుట్టించరు. నాటి రామకృష్ణ మఠంలో కోచింగ్ మొదలుకుని నేటి వరకు కొన్ని వేలమందికి శిక్షణ ఇచ్చారు. దిల్ రాజు గారి కేరింత సినిమాలోని కొత్త నటుల దగ్గరి నుండి “Airtel Add అమ్మాయి శషా వరకు ఇలా వేలమందికి శిక్షణ ఇచ్చారు.. ఇస్తున్నారు.


 

“రావణాసురిడిని చంపడానికి భగవంతుడే తనని తాను రాసుకుని రాముడిగా నటిస్తూ, బ్రతికి రావణుడిని చంపుతాడు. రామావతారం కూడా ఒక క్యారెక్టర్ యే కదా..!

మామూలు మనిషికి నటుడికి ఉన్న తేడా.?

“నువ్వు నువ్వు కాదు అని తెలిస్తే నువ్వు చేసే నటనలో మరింత స్వేచ్చ వస్తుంది”. అవును ఒక యాక్టర్ తనతో తాను ఎక్కువ సమయం గడిపితే, తన అభిరుచులను మాత్రమే ఇష్టపడితే మరో వ్యక్తి లా నటించడానికి ఇబ్బంది పడుతుంటాడు. అందుకే మహేష్ గారి కాంపౌండ్ లోకి అడుగు పెట్టగానే అతని పేరుతో కాకుండా కొత్త పేరుతో పిలవడం జరుగుతుంది. మామూలు మనిషికి నటుడికి పది రెట్లు ఎక్కువ తేడా ఉండాలి. క్యారెక్టర్ ను ఎక్కువ అర్ధం చేసుకోగలగాలి, దర్శకుడు చెప్పినదాని కన్నా తనదైన శైలిలో క్రియేటివిటీని ఉపయోగించి ఇంప్రువైజేషన్ చేయాలి, ఒక్కసారి చెబితే వెంటనే క్యాచ్ చేసేలా Concentration, Observation Skills ఎక్కువగా ఉండాలి. గొప్ప నటుడు కావాలనుకున్న వారు ముందుగా ఇందులో నిష్ణాతులవ్వాల్సి ఉంటుంది. అందుకే మహేష్ గారి ఇన్స్టిట్యూట్ లో జాయిన్ కాగానే వెంటనే సినిమా డైలాగులు చెప్పించుకోవడం కాకుండా పైన తెలిపిన వాటి మీద శిక్షణ ఇస్తుంటారు. 

టెక్నిక్స్:

నటుడు “నవ్వుతూ” చేస్తున్నంత మాత్రానా అది హాస్యరసం అవ్వదు.. నటుడు “సీరియస్” గా ఉన్నంత మాత్రానా అది “రౌద్రరసం” కూడా అవ్వదు. ప్రేక్షకులు నవ్వితేనే అది హాస్యరసం అవుతుంది, ఏడిస్తేనే కరుణ రసం అవుతుంది.. ఉదాహరణకు “ఖాన్ దాదా” క్యారెక్టర్ లో బ్రహ్మానందం గారు సీరియస్ గానే ఉంటారు కాని ప్రేక్షకులు మాత్రం విపరీతంగా నవ్వుకుంటారు. నీకు ఎవరైనా కోపం తెప్పిస్తే ఎలాంటి బాడీ లాంగ్వేజీతో రియాక్ట్ అవుతావో పాత్రాలకు తగ్గట్టుగా, దాని భావాలకు అనుగూనంగా అలాగే క్యారెక్టర్ లో లీనమవ్వాలి. ఇలా నటుడిగా ఎదగడానికి కొన్ని టెక్నిక్స్ ఉపయోగపడతాయి. విజువలైజేషన్, బాడీ లాంగ్వేజీ, నాడీ శుద్దీ(బ్రీతింగ్ ఎక్సర్ సైజ్), వాయిస్ మాడ్యులేషన్, మనస్తత్వాన్ని మార్చుకోవడం, వాయిస్ లెవల్స్ డబ్బింగ్ విషయంలో కేరింగ్, క్యాలెండర్ టెక్నిక్ తో పాటుగా ప్రతిరోజు ఔత్సాహిక నటుడు ఓ కథ చదవాల్సి ఉంటుంది ఆ కథను మిత్రులకు వివరించాల్సి ఉంటుంది.. ఎంతటి Input ఇస్తే అంతటి Output వస్తుందనడానికి ఈ టెక్నిక్స్ ఉదాహరణలు.


 

ఆశయం:

నటనను ఓ యోగంలో భావిస్తూ శిక్షణ ఇస్తున్న మహేష్ గారి మస్తిష్కంలో ఎన్నో ఆశయాలున్నాయి. భారతదేశంలోనే మొదటిసారి “అభినయ క్షేత్రం” అనే యాక్టింగ్ యూనివర్సిటీని నెలకొల్పి ప్రతి బ్యాచ్ కి పదిమంది చొప్పున కేవలం 100మందికి మాత్రమే నటనలో శిక్షణ ఇవ్వాలనే ఆశయంతో ఉన్నారు. అలాగే ప్రతి ఊరికెళ్ళి యాక్టింగ్ కు సంబంధించిన వర్క్ షాప్స్, ప్రతి గవర్నమెంట్ స్కూల్ లో పిల్లలకు యాక్టింగ్ పై అవగాహనా తరగతులు నిర్వహించబోతున్నారు. నటనలో అవగాహన ఉంటే ఆత్మవిశ్వాసంతో పాటుగా, స్టేజ్ ఫియర్, మరియు అన్ని రకాలుగా ఓ నిర్ధిష్టమైన వ్యక్తిగా ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇండస్ట్రీని దేవాలయంగా భావించి తన పనిని ప్రార్ధనగా చేసే వ్యక్తులు అరుదుగా ఉంటారు.. మహేష్ గారి లాంటి యువకుడు రాబోయే తరానికి ఉన్నతమైన నటులను తీర్చిదిద్దుతుండడం ఇండస్ట్రీకి, ఔత్సాహికులకు శుభ పరిమాణం.


 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , ,