These 22 Year Old Students Invented ‘AC Helmets’ For People Who Work In Hot Places!

 

శ్రీకాంత్, కౌస్తుబ్, ఆనంద్ ఈ ముగ్గురు కలిసి ఇప్పుడు ఏసి హెల్మెట్ తో యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్నారు. ఈ విజయం వెనుక వీరి ఫ్యామిలీ సపోర్ట్ మరువలేనిది.. 2వ తరగతి చదువుతున్న తుంటరి శ్రీకాంత్ ఓ రోజు అప్పుడే నాన్న కొత్తగా కొన్న వాటర్ ట్యాంకర్ (ప్లాస్టిక్) కు శుభ్రంగా నిప్పు పెట్టేశాడు.. కట్ చేస్తే ఇంట్లో పెద్ద మంటలు.. అయ్యే మీ ఇల్లు తగులబడిపోతుందే అని ఇరుగుపొరుగు వారు గగ్గోలు పెడుతుంటే తేరుకుని మంటలర్పేశాడు శ్రీకాంత్ నాన్న. కట్ చేస్తే మనోడు బాగా ఏడుపు ఎందుకు రా అంటే నా వల్లే ఇంతటి ఘోరం జరిగిపోయిందని.. సరిగ్గా ఈ టైంలో మాములుగా ఏ తండ్రైనా కొట్టడమో మందలించడమో చేస్తుంటారు కాని శ్రీకాంత్ నాన్న మాత్రం “నువ్వేమి బాధపడకు అదికాక పోతే ఇంకోటి అని ఓ చిన్నపాటి స్టాల్ కి తీసుకెళ్ళి జూస్ కొనిచ్చారాట”. ఆనంద్ నాన్న గారు “చదువు మాత్రమే నా పిల్లలకు అందించే గొప్ప ఆస్థి”.. అని ఓ చిన్నపాటి టీ ట్రేడింగ్ ను నడిపిస్తూ తన ఐదుగురు పిల్లలను ప్రయోజికులను చేశారు.. ఇప్పుడు వారందరూ జీవితంలో విద్య అనే గొప్ప ఆస్థితో స్థిరపడ్డారు.. కౌస్తుబ్ నాన్న గారు ఈ ఏసి హెల్మెట్ ప్రొడక్షన్ కొరకు బ్యాంక్ లోన్ అనుమతి నుండి అన్ని రకాలుగా తన విలువైన అనుభవంతోఎంతగానో సహకారాన్ని అందిస్తున్నారు. వీరందరిది కూడా మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే “ఐడియా” అనే వెలకట్ట లేని ఆయుధంతో తమ జీవితాలను మార్చుకుంటున్న ఈ ముగ్గురి యువకుల కథ ఈరోజు..


 


 

ఈ ముగ్గురి స్నేహం హైదరాబాద్ వి.ఎన్.ఆర్ విజ్ఞాన జ్యోతి లో చిగురించింది. మెకానికల్ ఇంజినీరింగ్ విషయంలో మాత్రమే కాదు కెరీర్ పరమైన అభిప్రాయాలు కూడా ఏకమవ్వడంతో క్లాస్ మేట్స్ కాస్తా పార్టనర్స్ ఐయ్యారు. ఏదైనా కనుగొనాలి అది సమజానికి ఉపయోగపడాలి వారికి కూడా ఈ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపుని తీసుకురావాలి.. వారందరి ఆలోచనలన్నీ ఒక కూర్పుగా సృష్టించబడినదే ఈ ఏసి హెల్మెట్. ఇంజినీరింగ్ చివరి సంవంత్సరంలో ఉండగానే పనులను మొదలుపెట్టారు. దీని కోసం పెద్ద యొత్తునే రిసేర్చ్ చేశారు. ప్రఖ్యాత వేగా హెల్మెట్ ఫాక్టరీ వెళ్ళి మామూలు హెల్మట్ల తయారీపై పరిపూర్ణ అవగాహన పెంచుకున్నారు.


 


 

భారత ప్రభుత్వం ఎం.ఎస్.ఎం.ఈ నుండి కూడా ఫండ్స్ లభించాయి. ఇక ప్రభుత్వం తరుపున ఐటి మంత్రివర్యులు కే.టి.ఆర్ గారి సహకారం టస్క్, ఈశ్భ్, ట్ హుబ్ మరియు వి.ఎన్.ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాల ప్రెసిడెంట్ డి.ఎన్. రావు గారు చేసిన అన్ని రకాల సహకారం ఎన్నటికి మరువలేనిది. ఆ తర్వాత బైక్ హెల్మెట్లకు ఏసి పరికరాలను అమర్చి సక్సెస్ సాధించారు. ప్రస్తుతానికి పరిశ్రమల్లో పనిచేసే వారికి, నిత్యం ఎండలో ఉండి విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసుల కోసం దీనిని తయారుచేశారు. మొదట కొన్ని ఏసి హెల్మెట్లను ఇండియన్ నేవి వారికి, టాటా మోటార్స్, డి.ఎస్ గ్రూప్ మొదలైన వారికి శాంపిల్స్ ను అందజేసి ప్రసంసలను అందుకున్నారు.


 


 

ఇటు అవార్ఢులను కూడా జాతీయ స్థాయిలో అందుకున్నారు. టి.సి.ఎస్ నుండి ఉత్తమ ఆవిష్కరణ పేరుతో బంగారు పతకం గెలుచుకున్నారు. ఇండియన్‌ సొసైటీ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ బెస్ట్‌ ఇన్నొవేషన్‌ నుండి టైటిల్ వరించింది. గేట్‌ ఇండర్‌ రింగ్‌ అంతర్జాతీయ పోటీల్లో మన దేశం నుంచి ఉత్తమ సంస్థగా కుడా ఎన్నికయ్యింది..! సిఐఐ సంస్థ నుంచి మరో రెండు అవార్డులు కుడా వచ్చాయి..


 

ఈ ఏసి హెల్మెట్ ప్రస్తుతానికి ఎక్కువ సేపు ఎండలో ఇండస్ట్రియల్ పనులు చేస్తున్నవారి కోసం, ట్రాఫిక్ కానిస్టేబుళ్ళ కోసం తయారుచేశారు. ఈ ఏసి హెల్మెట్ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి.. మన శరీరంలో కేవలం 10% బరువుండే తలలోనే 40% ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది.. వాహనానికి ఇంజిన్ ఎలాగే శరీరానికి తల అలాగా. ఇంజిన్ వెడెక్కినంతగా మిగిలిన వాహనం వేడెక్కదు. అలా తలలోని ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయగలిగితే తక్కువ అలసిపోవడం జరుగుతుంది. ఈ హెల్మెట్ వల్ల జుట్టు తక్కువ ఊడిపోతుంది. చెమట చిరాకు రాకపోవడంతో కార్మికులు ఉత్సాహంగా పనిచేసుకుంటారు.


 

రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం కొద్దిరోజులలోనే వందల సంఖ్యలో ఏసి హెల్మెట్లను తమ “జార్జ్ ఇన్నోవేషన్స్” తో తయారుచేయబోతున్నారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 8 గంటలపాటు వచ్చేలా దీనిని రూపొందిస్తున్నారు. ఈ ఎసి హెల్మట్ల కోసం ఎంతో డిమాండ్ ఉంది. పరిశ్రమలు కార్మికుల రక్షణ కోసం, కార్మికులు త్వరగా అలసిపోకుండా ఎక్కువ గంటలు పనిచేసేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇంత సాధిస్తున్న ఈ ముగ్గురి వయసు ఎంతో తెలుసా కేవలం 22 సంవత్సరాలు మాత్రమే.. ఇంజినీరింగ్ తర్వాత సుమారు సంవత్సరం పాటు వివిధ కోచింగ్స్ తీసుకుంటూ సంవత్సరం పాటు కృషి చేస్తే తప్ప ఉద్యోగం రాదు.. అలాంటిది వీరు కేవలం ఇంజినీరింగ్ లోనే విప్లవాత్మకమైన సంస్థను ఏర్పాటుచేశారు. ఈ విజయం కేవలం ఈ ముగ్గురిది కాదు.. ఎన్నో త్యాగాలు చేసి అండగా నిలుచున్న తల్లిదండ్రులది, అన్నిరకాల ప్రోత్సాహమిచ్చిన కాలేజీ సిబ్బందిది..


 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: , , , , , , , ,