These Lyrics Of “Aasa Paasam” Song From Care Of Kancharapalem Are In Perfect Sync With The Present Corona Scenario

 

Contributed By Hari Atthaluri

 

మన జీవితాన్ని ప్రతిబింబించే పాట తో
మనిషికి..మనసుకు.. విడదీయలేని అనుబంధం ఎప్పటికీ ఉంటుంది..

 

అలాంటి సందర్భానుసారం రాసే పాటల్లో జీవం ఎప్పటికీ ఉంటుంది…
పదం పదం వెతికితే మనిషి జీవితం వాటిలో ఎప్పటికీ వినిపిస్తుంది..

 

C/O కంచెరపాలెం కోసం రాసిన “ఆశ పాశం”
అంటూ సాగే ఈ పాటని.. అచ్చ తెలుగు వాడుక పదాలు వాడి, వాటిని అంతే అందం గా, పొందిక గా కూర్చి పాట కి ప్రాణం పోశారు..

 

అలా ప్రాణం ఉంది కాబట్టే విన్న ప్రతీ సారీ ఈ పాట మనల్ని స్పందించేలా చేస్తుంది….

అలా ఇంకో సారి వినగా..వినగా..

ఈ పాట నన్ను ఇంకోలా ఆలోచించేలా చేసింది..

ఇప్పటి మన పరిస్థితిని..
ఈ పాట తో ముడి పెడుతూ చూస్తే…
ఇంకో కొత్త భావం కనిపించింది..
దానికి ఇలా అక్షర రూపం ఇచ్చేలా చేసింది..

 

“ఆశ పాశం బందీ సేసేలే..
సాగే కాలం ఆడే ఆటేలే..
తీరా తీరం..సేరేలోగానే ఏ తీరౌనో..

 

(కరోనా వచ్చి నిజంగానే మన ఆశల్ని, మనల్ని బందీ చేసింది..
ఇది కాలం ఆడే ఆట లాగే కనిపిస్తుంది..
కానీ ఆ ఆట అయ్యేలోపు మన జీవితం ఏం అవుతుంది అంటే.. ఏమో తెలియదు అనేలా చేసింది)

 

“సేరువైనా సేదూ దూరాలే…
తోడౌతూనే ఈడే వైనాలే…
నీదో కాదో తేలేలోగానే ఎదేటౌనో
ఆటు పోటు గుండె మాటుల్లోనా… సాగేనా…”

 

(ఓ ప్రయత్నం.. ఓ ఉద్యోగం..
ఓ ఆశ.. ఓ అవకాశం.. ఓ అదృష్టం..
అలా దగ్గరకు వచ్చినట్టే వచ్చి ఇలా ఈ కరోనా వల్ల దూరం అయ్యాయి..
అది అవుతుందా లేదా అనే అయోమయం లో ఉంటూ, గుండె లో వంద ఆలోచనలు పెట్టుకుని బ్రతుకుతున్నాం)

 


ఏలేలేలేలో కల్లోలం ఈ లోకంలో
లోలో లోలోతుల్లోల ఏ లీలో ఏద కొలనుల్లో..

(కల్లోలం. కరోనా రూపం లో.. ఈ లోకం లో.,
మన మనసేమో ఏం తోచని అంతు చిక్కని ఆలోచనల్లో)

 

నిండు పున్నమేళ
మబ్బు కమ్ముకొచ్చి
సిమ్మ సీకటల్లిపోతుంటే..
నీ గమ్యం గందరగోళం..
దిక్కు తోచకుండ తల్లడిల్లి పోతు,
పల్లటిల్లిపోయి నీవుంటే..
తీరేనా నీ ఆరాటం..

 

(అంతా బాగానే ఉంది…
అంతా బాగానే అవుతుంది..
ఇలా అనుకునే లోపు నువ్వు ఊహించని ఓ సమస్య కరోనా రూపం లో నీ చుట్టూ చేరి, నీ ఆశల్ని చిమ్మ చీకట్లో నెట్టేస్తే.. నువ్వు బాధ పడుతూ..భయపడుతూ కూర్చుంటే ఎలా !! నీ గమ్యం చేరేదెలా.. నీ సమస్య తీరేదెలా ?? )

 

“ఏ హేతువు నుదుటి
రాతల్ని మార్చిందో
నిశితంగా తెలిసేదెలా..
రేపేటౌనో తేలాలంటే..
నీ ఉనికి ఉండాలిగా..
ఓ… ఆటు పోటు గుండె మాటుల్లోన… సాగేనా…

 

(ఇది కూడా మన మంచికే ఏమో!
మన జీవితంలో మంచి మార్పు కోసమే ఏమో!
అసలు ఇది మన తల రాతల్ని ఎందుకు మార్చింది తెలియాలి అన్నా,
దాని వెనక ఉన్న ఆంతర్యం అర్థం కావాలి అన్నా..
నీకు చేసే ఆ మంచి నువ్వు చూడాలి అన్నా..
ముందు నువ్వు ఉండాలి కదా !)

 

ఏ జాడలో ఏమున్నదో..
క్రీనీడలా విధి వేచున్నదో..
ఏ మలుపులో ఏం దాగున్నదో..
నీవుగా తేల్చుకో నీ శైలిలో..

 

(విధి ఇచ్చిన ఈ అవకాశం వాడుకో..
నీ జీవితం లో ఏం మలుపు వస్తుందో,
నీకు ఉన్న తెలివి తో ఆలోచించుకుని..
నిన్ను నువ్వు మార్చుకుని..నువ్వు వెళ్లే దారి మార్చుకో..
ఏమో ఎవరికి తెలుసు..ఇది అంతా ఓ కొలిక్కి వచ్చాక అదృష్టం నిన్నే వెతుక్కుంటూ రావొచ్చు అదే దారిలో)

 

“సిక్కు ముళ్ళు గప్పి రంగులీనుతున్న
లోకమంటె పెద్ద నాటకమే తెలియకనే సాగే కథనం..
నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని
పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కథలే దూరం..
నీ సేతుల్లో ఉంది సేతల్లో సూపించి
ఎదురేగి సాగాలిగా
రేపేటౌనో తేలాలంటే నువ్వెదురు సూడాలిగా..”

 

(నీ చేతుల్లో లేని దాని గురించి నువ్వు బాధపడకు..
అది నీకు తెలియకుండానే అయిపోతుంది..
నమ్మకం పోతున్నా కూడా..
మళ్లీ నీ ఆలోచన ని నువ్వే నమ్మాలి..
అది నీ చేతుల్లోనే ఉంది..
దాన్నే నీ బలం గా మార్చి..
పరిస్థితులకి ఎదురు వెళ్లి పోరాడాలి..
అందులో నీ గెలుపు ని నువ్వు చూడాలి అంటే ముందు నువ్వు దిగులు పడకుండా ధైర్యం గా ఉండాలి గా..!!)

 

“ఇలాంటి సమయంలో జీవితం మీద ఇలాంటి ఆశావహ దృక్పథంతో మనం ఉంటే..
ఆ ఆలోచనే అన్నీ ఇస్తుంది..
మనల్ని మన గమ్యం చేరుస్తుంది..”

 

ఇప్పుడు ఈ పాట మళ్లీ వినండి..
మీకు ఓ కొత్త అనుభూతి కలుగుతుంది.. ఈ పాట సాహిత్యాన్ని సులువైన పదాలతో లోతుగా రాసిన విశ్వ గారికి, మనసు తాకేలా సంగీతం అందించిన స్వీకర్ అగస్తి కి, అందంగా అద్భుతంగా ఆలపించిన అనురాగ్ కులకర్ణి చాలా ధన్యవాదాలు.


 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , ,