A Must Read Note For All The 10th Class Students About Future, Career & life!
My dear 10th Pass outs, ఇప్పుడిప్పుడే స్కూల్ లైఫ్ నుంచి బయటికి వచ్చి chill అవుతుంటారు. “ఇప్పుడే అవ్వండి, లేదంటే తర్వాత అవ్వలేరు” అనే ముక్క నేను అస్సలు చెప్పను. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను. 10th class అనేది మనం తాగే water అనుకుంటే, మనం ఇప్పుడు water తాగి బయటికి వస్తే, పక్కనే ఎవడొకడు వచ్చి water కన్నా soda ( Intermediate or Any other thing ) తాగు అంటాడు. Soda try చేసాక Pepsi ( B.Tech or Mbbs ) try చెయ్యి అని అంటారు. కానీ ఇన్ని try చేసాక కూడా మనకి clarity రాదు చివరికి ఏది బాగుందో అనేది. Topic చాలా non sync గా అనిపిస్తుందా ? ఐతే కొద్దిగా లోపలి వెళ్దాం.
ఇప్పుడిప్పుడే బయటికి వచ్చిన మీకు చుట్టాల నుంచి, పక్కింటోళ్ల నుంచి, friends దగ్గర్నుంచి అందరూ “ఇప్పటివరకు నువ్వు ఆడుతూ పడుతూ చదివేసావ్, ఇక నుంచి కష్టపడాలి లేదంటే జీవితం లో పైకి రావు అంటుంటారు” కానీ మీకు గుర్తుండే ఉంటుంది…. నరసింహ cinema లో ఒక పాట ఉంటుంది “జీవితమంటే పోరాటం…పోరాటం లో ఉంది జయం అని” ఈ భూమి మీదకి వచ్చి రావడం తోనే మనం కష్టపడుతూ వచ్చా0. కాబట్టి కష్టం అనేది ప్రతీ moment లోనూ ఉంటుంది. ఇప్పుడిప్పుడే కాలీ గా ఉండీ, holidays enjoy చేద్దాం అని అనుకుంటుంటారు. కానీ ఇంటర్మీడియట్ లాంటి colleges మీ ఇంటికి consultants ని వదులుతారు. వాళ్ళు వచ్చి వాళ్ళ college గురించి చెప్పిన మాటలు మీరు ఎప్పుడైతే వింటారో అప్పుడే మీరు ఒక పేద్ద ఊబి లో పడినట్టు.
మన దేశం లో ఉన్న one of the గొప్పతనం ఏంటి అంటే….. ఏ పనీ లేక, ఇంట్లో ఏం చెయ్యాలో తెలియక సాయంత్రం park కి వెళ్లి పల్లీలు కొనుక్కుని తింటూ అమ్మాయిలని చూసే వాడు కూడా నీకు engineering అంటే ఏంటో చెప్తాడు…. Doctor అంటే ఏంటో చెప్తాడు. ముందు అలంటి వాళ్ళ మాటలు అస్సలు వినకండి. మనకి ఉన్న కర్మ ఏంటి అంటే మనం చదవాలనుకునే time కి అవగాహన ఉండదు. చదివేసిన తర్వాత వచ్చిన అవగాహన దేనికీ పనికిరాదు. Law కానివ్వండి, ఇంకేదైనా డిగ్రీ కానివ్వండి, Engineering కానివ్వండి, Mbbs కానివ్వండి. దేని value దానికి ఇప్పటికీ అలాగే ఉంది. కాకపోతే సమాజం లో అపోహ ఏ range కి వెళ్ళింది అంటే “B.Tech చదివితే దేంట్లోకి ఐనా వెళ్ళిపొచ్చు, Mbbs చదివితే చాలా డబ్బులు , కష్టం అవుతుంది, CA చాలా కష్టం….. ఇంక మన ఇంట్లో అందరూ డిగ్రీలు చేసి కాలీగా ఉన్న వారే, కాబట్టి నువ్వు B.Tech లోనే join అయిపో” అన్నా ఈ ముక్కలు ఏమీ తెలుసుకోకుండా, కేవలం నోటి మాట ద్వారానే చెప్పేస్తున్నారు. ఎంత దారుణం కదా!
ఇది ఒక side. ఇంకో వైపు CD లు, బ్రోచర్ లు, ఇచ్చి ప్రలోభపెట్టడం. ఇలా 10th రాసి వచ్చారో లేదో కనీసం ఆలోచించుకునే టైం కూడా ఇవ్వకుండా తీస్కెళ్లిపోవడం. ఇక్కడే మొత్తం బోల్తా కొడ్తుంది. ఈ చిన్న విషయం వల్లనే ఎందరో students ఇష్టం లేని చదువు చదివి, చివరికి సంబంధం లేని jobs లో settle అవుతున్నారు. మనిషి maximum బ్రతికేది ఒక 75 years వేసుకుందాం. అందులో 25 years ….అంటే 3 parts లో ఒక part education కే అయిపోతుంది. అలాంటిది ఎంత జాగ్రత్త గా ఉండాలి ?
ఇంకో side కూడా ఉందండోయ్. కొంతమంది ఇంకా తెగించి… నీ జాతకం చూపించాం…నువ్వు Engineering ఏ చెయ్యాలంట, పెద్దల మాట వింటే నువ్వే పైకి వస్తావ్. అదే నిజమైతే ఈరోజు దేశం లో సకానికి పైగా B.Tech చేసిన వారికీ జాబ్స్ రావట్లేదు ఎందుకు ? ఒకప్పుడు Town కి ఒక engineering college ఉండేది. ఇప్పుడు ? సందు సందుకీ ఒక కాలేజీ! జాతకాలు నిజమైతే దేశం లో పద్మ awards లాంటివి ఇంజినీర్లకు ఎందుకు రావట్లేదు ? B.Tech చదివి చిన్న చిన్న జాబ్స్ కే పరిమితమైపోతూ ఉన్నారు ఎందరో . ఆ మాట కి వస్తే ప్రతీ జాబ్ వేరే వాడికి ఎదో విధం గా అవసరమవుతుంది. కానీ నువ్వు గడిపేసిన 1/3rd లైఫ్ అంతా అందుకోసమేనా ?
“Sports కి సినిమాలకి ఉన్నంత value ఎవడూ education కి ఇవ్వరు” అని parents అనుకుంటుంటారు. “ఎడ్యుకేషన్ కి ఇస్తున్న value sports సినిమాలకి ఇవ్వరు” అని మనం అనుకుంటుంటాం. ఆ చిన్న gap లోనే ఎవరికీ నచ్చింది వాళ్ళు చేస్కుంటూ Olympics కి Cinema లు కి వెళ్తుంటారు. వాళ్ళ success చూసి, నువ్వూ అలా కష్టపడాలి అని మళ్ళీ తిరిగి parents మనల్నే అంటారు. ఈ cycle ఇలాగే repeat అవ్వుద్ది.
కాబట్టి matter ఏంటి అంటే….. ఎవడో బయటి వాడు వచ్చి “మీ అమ్మాయిని ఇందులో జాయిన్ చెయ్యండి, మీ అబ్బాయిని అక్కడికి పంపండి” అంటే గుడ్డి గా నమ్మేయకుండా…. ముందు మనకి ఏది ఇష్టమో తెలుసుకోండి. అది ఏది ఐనా సరే. చెప్పనిదే ఎవరికీ అర్థమూ కాదు. అందుకే parents కి అది ఏంటో, అది మీకు ఎందుకు ఇష్టమో, అన్నీ explain చెయ్యండి. ఒక course కానీ ఏదైనా చదివే ముందు do a research. కేవలం నోటి మాటల ద్వారా వెళ్లారో అంతే సంగతులు.
ఈ article or letter ఒక తోపు suggestion కాదు, ఒక శ్రీకాంత్ అడ్డాల movie అంతకన్నా కాదు. మీ గతి మీకు గుర్తుచేయడం కోసం చేసిన ఒక honest attempt మాత్రమే !!!
If you wish to contribute, mail us at admin@chaibisket.com