మన గోదారి రాజు గారి రంగు కాయ ‘ARTOS’ కి 100 ఏళ్ళు – Here’s A BBC Short Documentary On ARTOS

 

నమస్కారం అండి.. నేను మీ గోదారోడ్ని. చాలా రోజులైందండి మిమల్ని పలకరించి.. ఈసారి ఏ వార్తతో వచ్చావ్ అబ్బాయ్..! అని అనుకుంటున్నారా.. ఆయ్ ! సెప్తానండి. అదేనండి మన గోదారోల్ల ఫేవరెట్ డ్రింక్, గోదారోల్లకి ఏంటీ…! మొత్తం మన తెలుగోళ్లకే బాగా పరిచయమున్న “ఆర్టోస్” లేదు.. అయ్యో ! ఇంకా గుర్తుకురాలేదా.. మీరు ఈ మధ్యోచ్చిన డ్రింక్స్ మోజులో పడి మన ఈ బ్రిటీషోల్ల కాలంనుంచే ఉండి, మనకంటూ ఒక ప్రత్యేకమైన పేరు తెచ్చి, మనకి ఒక మంచి అనుభూతిని ఇస్తూ కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న మన రాజు గారి రంగు కాయనే మర్చిపోయారండి.. సర్లేండి అందాక ఈ లింక్ పై నొక్కి మన ఆర్టోస్ గురించి మొత్తం తెలుసుకొండి..
Artos Drink


 

ఇక మన విషయానికి వస్తే.. ఎప్పుడో 1919 లో అడ్డూరీ రామచంద్ర రాజు గారు, జగన్నాథరాజు గారు మొదలెట్టిన ఈ డ్రింకు 100 యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా YouTube లో దీనిపై ఒక వీడియో బాగా ఆదరణ పొందుతుంది…

 

 

ఆ వీడియో మీకు చుపెట్టాటనికే ఇదంతా చెప్తున్నా.. ఇక ఈ సంస్థ ప్రస్తుత పరిస్థితికి వస్తే, జగన్నాథరాజు గారి మనవడు అడ్డూరి జగన్నాథవర్మ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌. ఇక ఆయన్ని పరికిస్తే…

 

‘మా కూల్‌డ్రింక్‌ని ఇన్నేళ్లుగా ఇక్కడి ప్రజలు ఆదరిస్తున్నారంటే అందుక్కారణం స్థానికంగా దొరికే పండ్లూ, ఇతర పదార్థాలతో వచ్చే ప్రత్యేకమైన రుచీ, వాసనే. ఎక్కడ స్థిరపడినా ఇక్కడికొచ్చినపుడు ఆ వాసన చూస్తే చాలు, చిన్ననాటి రోజులు గుర్తొస్తాయంటారు చాలామంది. వారి ప్రేమ, స్వదేశీ బ్రాండ్‌ అన్న నమ్మకమే మమ్మల్ని నడిపిస్తున్నాయి. 2001 నుంచి విజయవాడ, తాడేపల్లిగూడెం, భీమవరంలోనూ అమ్మకాలను ప్రారంభించాం. మేం ముగ్గురు అన్నదమ్ములం. వీరభద్రరాజు, పద్మనాభవర్మ, నేను. త్వరలోనే ఆర్టోస్‌ బాధ్యతల్ని మా పిల్లలకి అప్పగించి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలనుకుంటున్నాం’ అంటారు జగన్నాథవర్మ.

 

అదండీ మన 100 యేళ్ళ ఆర్టోస్ అసలు విషయం.. ఆయ్ ! ఈ రోజుకి క వుంటానండి.. టాటా !!
Video Source : BBC News Telugu

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , , ,