Telangana Govt To Launch “Urban Genie” App That Is Set To Provide All Types Of Household Services!

 

ప్రపంచంలోనే అత్యధికంగా వెనుకబడిన దక్షిణాఫ్రికాలో పెద్దమొత్తంలో బంగారు గనులున్నాయి.. ఐనా కాని ఇప్పటికి అది పేద దేశం గానే ఇంకా దయనీయమైన పరిస్థితులలో ఉందంటే కారణం వారి ఆస్థిని గుర్తించలేకపోవడం, దానిని సరిగ్గా ఉపయోగించలేకపోవడం.. అవును ఒక దేశానికి వనరులు ఎంత ముఖ్యమో, ఓ వ్యక్తికి తన టాలెంట్ కూడా అంతే ముఖ్యం, ఆ ప్రతిభను సరైన స్థాయిలో ఉపయోగించుకోవడం ముఖ్యం. ఇంతకు ముందంటే కమ్యూనికేషన్ వ్యవస్థ అంతగా లేదు కాని ఇప్పుడు ఈ ఇంటర్నెట్ విప్లవంలో కూడా మన టాలెంట్ నిరూపయోగంగా మిగిలిపోకూడదు, మరిన్ని అవకాశాలు రావాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వ పురపాలక శాఖ “అర్బన్ జీని” అనే ఓ కొత్త యాప్ ప్రారంభించబోతుంది.


ఇంతకి ఇందులో ఏముంటుంది.?
పిల్లలకు ఇంటివద్దనే ట్యూషన్ చెప్పడానికి టీచర్ దగ్గరి నుండి, వైద్యులు, డ్రైవర్లు, ప్లంబర్లు, కార్పెంటర్స్, ఎలక్ర్టీషియన్స్ ఇలా రకరకాల స్వయం ఉపాధి కల్పించుకున్న వ్యక్తులందరి వివరాలు, ఫోన్ నెంబర్, ఏ ప్రాంతానికి చెందినవారు లాంటి తదితర వివరాలన్నీటిని ఈ యాప్ లో పొందుపరుస్తారు. యాప్ లో వారి రేటింగ్ కూడా చూపించబోతుండడంతో వినియోగదారులకు ఎంతో మేలు జరుగబోతున్నది. కేవలం ఇంతకుముందే నైపుణ్యత కలిగినవారిని మాత్రమే కాదు సాక్షాత్తు ప్రభుత్వం వారే నిరుద్యోగులకు వారు నిష్ణాతులు అయ్యే వరకు శిక్షణ ఇచ్చి ఈ యాప్ లో వారికి సంబంధించిన వివరాలను కూడా పొందుపరుస్తారు.

ఈ ప్రణాళికపై ఉన్నతాధికురాల నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతోయుద్ధప్రాతిపదికన కేవలం నెలరోజులలోనే యాప్ ను సిద్ధం చేసి గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులోకి తేనున్నారు. ఇందులో పేరు పొందుపరుచకోవడానికి, ఇంకా శిక్షణ తీసుకోవడానికి ఎటువంటి ఫీజు తీసుకోకుండా పూర్తి ఉచితంగా ప్రభుత్వం వారు దీనిని తీసుకురాబోతున్నారు. భారతదేశంలో ఇంతటి యువశక్తి ఉండడం వల్ల కాంపిటీషన్ కూడా పెరిగిపోయింది. ఫలానా ఉద్యోగం అని వేచి చూస్తూ కుర్చుంటే విలువైన సమయం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వం వారు అందించే ఈ శిక్షణ తరగతులకు హాజరయ్యి నిరుద్యోగులు విలువైన భవిషత్తును నిర్మించుకోవచ్చు.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: , , , , ,