This Story Of A Hardcore Cinema Fan Is Something All Fans Can Surely Relate To!

 

ఓ అభిమాని కథ

ఏరా! మీ వోడి సినిమా రేపే రిలీజ్ అంటగా? ఈసారి అయిన హిట్ వస్తోందంటావా ? మళ్లీ ఎప్పటిలాగానేనా !!

సినిమా కొంతమందికి ఆనందాలని ఇస్తుంది , కొంతమందికి జీవితాలని ఇస్తుంది , కొంతమందికి తానే జీవితమవుతుంది. నా పేరు రాజు నేను చేసే పని పెద్దగా ఏమి లేదు . సినిమా సినిమా సినిమా ఇదే న పని ఇదే నా జీవితం అదే నా వ్యసనం
” సినిమా నాది కాదు , డబ్బులు నావి కావు మరి ఎందుకు నాకింత పిచ్చి? ” అని చాలా మంది నన్ను అడుగుతుంటారు
“నువ్వు ఎంత చేసిన ఆ హీరో కి నీ పేరు కూడా తెలిదు . అలాంటి వాళ్ళ కోసం ఎందుకురా ఇంత డబ్బులు ఖర్చు చేస్తావ్? ” అని తిట్టే వాళ్లు కూడా ఉన్నారు .
నన్ను జులాయి అంటారు, పిచ్చోడు అంటారు , చవట అని అనేవాళ్ళు కూడా ఉన్నారు కానీ నాకు మాత్రం నేను ఓ ” అభిమానిని “

రాళ్ళలో రప్పల్లొ ఉన్న రూపాలకి పూజలంటూ కోట్లు గుమ్మరిస్తారు , రూపం ఎలా ఉంటుందో తెలియని ఆ పటాలకు అలంకారాలు చేస్తారు. అదే అభిమాని ఆశలను నిలపటానికి తనను నమ్మిన మనుషులను పైకి తీస్కురవటానికి రాత్రింబవళ్ళు కష్టపడే నా హీరోని పూజిస్తే తప్పు .. మా కోసం కస్టపడి మమ్మల్ని ఆనందపరిచే మా హీరోనే మా దేవుడు థియేటర్ మా గుడి .. మీరు ఆ రాళ్ళలో దేవుడిని చూసుకుంటే మేము సినిమా తెరపై మా దేవుడిని చూసుకుంటాము.

” రేయ్ శీనుగా మీకు మీ వోడు గొప్ప , మాకు మా వోడు గొప్ప .. సినిమా పోయిన మా గుండెల్లో ఆయన పేరు చెరిగిపోదు. అయినా సినిమా పోయిందని హాల్ లో బొమ్మ మార్చినంత తేలిగ్గా మార్చలేం రా మా అభిమానాన్ని.”

పైకి ఎలా ఉన్న లోపల మాత్రం ఏదో ఒక భయం ” అన్నా ! ఈ సారైనా సినిమా హిట్ అవ్వాలి అని ఆశ,
ఎదుటి వాళ్ళు వెక్కిరిస్తున్నా మా హీరో మీద నమ్మకం మాత్రం పోదు. నమ్మకం , బాధ , అనుమానం ఆశ ఈ నాలుగిటి మద్యనే ఇరుక్కుపోయిన జీవితం మాది

“రేయ్ అన్న సినిమా రిలీజ్ రేపు, హాల్లు మొత్తం కళకళ లాడి పోవాలి ”

పూట గడవటానికి జేబులో చిల్లి గవ్వ లేకపోయినా అభిమాన హీరో సినిమా రిలీజ్ అయితే అప్పుచెసైన అలంకారాలు చెయ్యాల్సిందే .. మొదటి రోజు మొదటి ఆట చూడాల్సిందే

రోజు గడిచింది ….. మొదటి ఆట పడింది … హల్లో మొత్తం హడావిడి .. అరుపులు.. అన్న కనిపిస్తే చాలు కేకలు…
“రేయ్ ఏంట్రా ఆ పాటలు, అన్ని చావు డప్పులే”
“ఓడియమ్మ మీ వాడు ఏది సొంతంగా చేయడార చివరికి పోస్టర్ కూడా కాపీ అంటగా? ”
ఇలాంటి ప్రశ్నలు ఎన్నో మనసులో కదులుతున్నాయి, పడిన ప్రతి సీన్ ఆ బాధ ను చెరిపేస్తుంది, ఆట ఆటకి హౌస్ ఫుల్ బోర్డు పడుతుంటే సినిమాకి పాజిటివ్ వస్తుంటే, మనల్ని ఎక్కిరించిన వాడి ముందు తల ఎత్తుకుని వెళ్తుంటే ఆ వచ్చే ఆనందం లక్ష కోట్లు ఉన్న రాదు.

ఇది నా కథ, మన కథ, ఓ అభిమాని కథ..

 

Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: , , ,