12 Actors Who Received Glorious Telugu Titles As Appreciation From Their Fans!

 

మన తెలుగు వాళ్ళు ఎవరినైనా అభిమానిస్తే గుండెల్లో పెట్టేసుకుంటారు . ఇక సినిమాల విషయంలో అభిమాన తారల గురించి అయితే చెప్పక్కర్లేదు . తమ అభిమానాన్ని చాటుకోడానికి సినీతారలకు బిరుదులు ఇచ్చేవారు అభిమానులు. ప్రభుత్వాలు ఇచ్చే పురస్కారాల కంటే అభిమానులు ప్రేమతో ఇచ్చే ఈ బిరుదులంటేనే నాయకానాయికలకి ఎంతో మక్కువ . వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులని మెప్పిస్తూ ఎప్పటికప్పుడు వారిని అలరించే తారాగణానికి అభిమానులు గౌరవసూచకంగా ప్రేమతో వారి నటనా కౌశలాన్ని కీర్తిస్తూ బిరుదులు అందించేవారు. ఆలా మన సినీతారలు – వారి బిరుదులు ఓసారి చూద్దాం

 

1. ఎస్వీ రంగారావు – నట సార్వభౌమ


 

2. నందమూరి తారక రామారావు – నట రత్న , విశ్వ విఖ్యాత నట సార్వభౌమ


 

3. అక్కినేని నాగేశ్వరరావు – నట సామ్రాట్


 

4. కృష్ణ – నట శేఖర


 

5. శోభన్ బాబు – నట భూషణ్


 

6. కొంగర జగ్గయ్య – కళా వాచస్పతి


 

7. రావు గోపాలరావు – నట విరాట్


 

8. కైకాల సత్యనారాయణ – నవరస నటనా సార్వభౌమ


 

9. రాజేంద్రప్రసాద్ – నటకిరీటి


 

10. మోహన్ బాబు – నట ప్రపూర్ణ


 

11. బాలకృష్ణ – యువరత్న


 

12.నాగార్జున- యువ సామ్రాట్


 

నటీ నటులకే కాదు దర్శకులకి కూడా ఇలాంటి బిరుదులు ఉన్నాయి
కే విశ్వనాధ్ – కళా తపస్వి
దాసరి నారాయణరావు – దర్శకరత్న
రాఘవేందర్రావు – దర్శకేంద్రుడు
జంధ్యాల – హాస్య బ్రహ్మ

 

మరెవరినైనా మరచిపోయుంటే కామెంట్స్ విభాగంలో మాతో పంచుకోగలరు

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: , ,