జరిగిన కథ: Part - 1, Part - 2, Part - 3, Part - 4, Part - 5
అమ్మ నా భుజం మీద చేయి వేశారు. “నన్ను క్షమించండి అమ్మ, నా వల్లే ఇదంతా జరిగింది” అని గుక్కపెట్టి ఏడ్చాను. అదేం లేదు అన్నట్టు, ఆవిడ తన గడ్డాన్ని కిందికి వంగి ఏడుస్తున్న నా తల పై ఆనించి నా వీపు నిమిరారు. “నువ్వు propose చేసినందుకు గొడవ అయిందా?” అని మా బాధలు ఏమి పట్టనట్టు జగదీశ్ మళ్లీ ప్రశ్నించారు. ఆయన మమ్మల్ని చూసి ఏ మాత్రం చలించనట్టుగా కనిపించాడు. ఎంత కర్కశం..,అని అనుకున్నాను. “గొడవ అందుకు మాత్రమే కాదండి,” అని ఆపాను. “మరి దేనికి?” అని ఆ ప్రశ్నల దాడిని ఆయన కొనసాగించాడు. “మేమిద్దరం ఫైనల్ ఇయర్ లో ఉన్నాం. తన మీద చాలా రోజులుగా నాకున్న ప్రేమను ఆరోజు చెప్పేయాలి అనే ఉద్దేశం తోనే కాలేజీ కి వెళ్లాను. లంచ్ టైం లో ప్రతి రోజులాగే ఇద్దరం కాంటీన్ లో కలిసి భోజనం చేసేందుకు వెళ్తున్నాం. మధ్యాహ్నం క్లాసులు bunk కొట్టి సినిమా కి వెళదాం అని శరణ్య అంది . నేను సరే అన్నాను. అక్కడికి వెళ్ళగానే కొత్తగా రిలీజ్ అయిన సినిమా కదా, టికెట్లు దొరకలేదు. అక్కడి నుండి ఏదో ఫుడ్ ఫెస్టివల్ అంటే చూద్దామని ట్యాంక్ బండ్ వెళ్లాం.బాగా తిని వెళ్లి అక్కడ గడ్డిలో కూర్చున్నాం. తను అప్పుడు ఐస్ క్రీం తింటోంది తనకు విషయం చెప్పేందుకు ఇదే సరైన ప్లేస్ అనిపించి “శరణ్య.. నీకొకటి చెప్పాలి” అని ధైర్యం చేసి అన్నాను. “ఏంటి ఐస్ క్రీం కావాలా? ఇది నేనివ్వను. కావాలంటే వెళ్లి ఇంకొకటి తెచ్చుకో” అని తను తెచ్చుకున్న ఐస్ క్రీంని నా నుండీ దూరం జరుపుతూ అన్నది. నేను విసుగ్గా చూశాను. “ఓహో అది కాదా ఐతే చెప్పు..” అని ఐస్ క్రీం తింటూ పరధ్యానంగా అంది. ఒక్కసారి అలా గుండెల్లో గాలిని, మనసులో ధైర్యాన్ని నింపుకుని, “మన ఇద్దరికీ పిల్లలు పుడితే నీలాగా ఉంటారా లేకపోతే నాలాగా ఉంటారా?” అని అడిగి కాస్త బెరుకుగా తన వంక చూసాను.
నోట్లో ఐస్ క్రీం పెట్టుకుని ఒకింత ఆశ్చర్యంతో బిగ్గరగా నవ్వింది. తనకు నా ఉద్దేశం అర్థమయిందో కాలేదో అర్థం కాక నాకు పిచ్చి పట్టింది. ఈసారి నేరుగా “శరణ్య.. I want to marry you, ఎందుకంటే I love you..” అని మాట తడబాటు లేకుండా నా ఉద్దేశం తనకు తేటతెల్లం చేశాను. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న శరణ్య మొఖం కాస్త serious గా పెట్టి లేచి నిలబడి అటు ఇటు చూసి ఏమి జరగనట్టు, “పద వెళదాం,” అని అంది. నాకేం అర్థం కాలేదు. తనను బైక్ ఎక్కించుకుని ఇంటి దగ్గర వీధిలో drop చేశాను. తను నాతో దారిలో అంతా ఏమి మాట్లాడలేదు. ఒక్కసారిగా బుర్రంతా blank అయిపోయింది. డ్రాప్ చేసాక కూడా వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళుతున్న తనను చూసి నాకు అసహనం వచ్చింది. “ఏదో ఒకటి చెప్పు!” అని గట్టిగా కేక వేశాను. అప్పుడు ఒక క్షణం అలాగే నిలబడి, మళ్లీ నడిచి వెళుతూ ఉండడం చూసి నాకు ఇంకా పిచ్చి పట్టింది. “నేను కూడా నువ్వు ఏ విషయం చెప్పేదాకా మాట్లాడను!” అని మళ్లీ గట్టిగా కేక వేశాను. మళ్లీ అలాగే ఒక క్షణం ఆగి వెనక్కి తిరగకుండా ముందుకు వెళ్ళింది. ఒకింత అసహనంతో నేను కూడా తిరిగి వెళ్ళిపోయాను. “విషయం చెప్పేదాకా ఏమి మాట్లాడను అని చెప్పిన నేను తను అన్నిసార్లు కాల్ చేసేసరికి, తనకింకా టైం కావాలేమో అనిపించి ఫోన్ చేసి మాట్లాడాను.తను కూడా మామూలుగానే మాట్లాడింది.అంతే అంతకు మించి ఏమి లేదు సర్” అని చెప్పాను.
“ఓకే ఓకే...Mrs. Bharathi, మీరు చెప్పండి.. నిన్న ఇంట్లో తను రాత్రి ఏమని చెప్పి వెళ్ళింది?” అని ప్రశ్నించాడు. అప్పుడు ఆవిడ “నా కూతురు నాతో ఏ రోజు అబద్ధాలు చెప్పలేదు. చాలా responsible గా behave చేస్తుంది సర్, నిన్న రాత్రి నాతో గచ్చిబౌలి వెళ్ళాలి అని చెప్పింది. ఇంత రాత్రి వేళ ఎందుకని ప్రశ్నించాను. రేపు నా ఫ్రెండ్ క్రిస్ birthday అమ్మ, పన్నెండుకు wish చేయకపోతే ఎలా చెప్పు?అని నాతో అంది. “ఫ్రెండ్ ఆ బాయ్ ఫ్రెండ్ ఆ?” అని ఏడిపించాను. బాగా బ్రతిమాలింది. నేను “సరే... కాని జాగ్రత్త” అని చెప్పాను. తనను తాను manage చేసుకునే శక్తి ఉంది కనుక నేనేం భయపడలేదు. కాని ఫోన్ ఇంట్లోనే మరిచిపోయి వెళ్ళింది. అర్దరాత్రి I.H.S నుండి కాల్ వచ్చింది. “తరువాతంతా మీకు తెలిసిందే” అని చెప్పి కళ్ళు తుడుచుకుంటూ నా వైపు చూసింది. గోడ మీద క్యాలెండర్ వంక చూశాను. జనవరి 13 అని ఉంది. నా మనసు లోలోపలే కాలిపోయింది. నా ముక్కుల్లోకి ప్రవహిస్తున్న గాలి లోలోపల భగ్గుమంది.నేను ఈరోజు పుట్టానని నాకు కూడా గుర్తులేదే! అసలు నేనెందుకు పుట్టాను అనిపించింది. నా పుట్టినరోజు జరిపేందుకు తన ప్రాణాన్నిపణంగా పెట్టిందా? ఎవరూ లేని ఈ అనాథ బ్రతుకులో ఒక candle వెలిగించేందుకు వచ్చి తానే ఆహుతి అయిపోయిందా? గోడకు తలను ఆనించుకుని తీవ్రంగా, ఒళ్లంతా అదిరి పడేలా ఏడ్చాను. ఆవిడ నా చేయి పట్టుకుని ఓదార్చే ప్రయత్నం చేసింది. “క్రిస్, she loves you” అని చెప్పి ఆవిడ కూడా తన శోకాన్ని ఆపుకోలేకపోయింది.ఇంతలో జగదీశ్ కి ఫోన్ వచ్చింది. “Is it?” అని ఫోన్ లో ఒకింత ఆశ్చర్యంతో కేక వేశాడు. “నా డౌట్ నిజమే అయింది, we are coming” అని ఫోన్ కట్ చేసి మా వైపు చూశాడు. “బాడీ మీదున్న ఫింగర్ ప్రింట్స్ తో అదే ఏరియా లో నిన్న రాత్రి పార్టీ జరుపుకున్న నలుగురితో match అవుతున్నాయి. “పదండి వెళదాం.. i think we caught hold of them” అని తన కార్ లో కూర్చోబెట్టి హుటాహుటిన బండి కదిలించాడు.
శరవేగంగా గచ్చిబౌలి లోని పోలీసు స్టేషన్ కి మమ్మల్ని తీసుకొచ్చాడు. వేగంగా లోపలి వెళ్లాం. లోపలికి, బయటకు చాలా మంది వస్తూ పోతూ ఉన్నారు. మేము జగదీశ్ ను అనుసరిస్తూ లోపలికి వెళ్ళాము. ఆయనని చూసి అందరు సెల్యూట్ కొడుతున్నారు. లోపల టేబుల్ వెనుక కుర్చీ వేసుకున్న ఖాకి ఈయనకు సెల్యూట్ చేసి నిలబడి చేయి ఎడమ వైపుగా చూపించాడు. ఒక పక్కగా నలుగురు వ్యక్తులు చిరిగిన బట్టలతో తలలు దాచుకుని మోకాళ్ళ పై నిలుచున్నారు. జగదీశ్ వెళ్లి మొదటి వాడి తల పైకి లేపాడు. అన్ని evidenceలు,ఫింగర్ ప్రింట్స్, match అయ్యాయా రమేష్? అని కేకేసాడు. “Forensic report వచ్చింది సర్, వీళ్ళే చేసింది.. confirmed” అని అతనుసమాధానం చెప్పాడు. లాఠీ తీసుకుని ఆయన నలుగురిని కుళ్ళ పొడిచాడు. వాళ్ళు చేతులు అడ్డు పెట్టుకుని తమను కాపాడుకుంటున్నారు.నాకు కూడా ఆవేశం ఆగలేదు.ఉక్రోషంతో పిడికిలి బిగించి పళ్ళు గట్టిగా కొరికాను.కసి తీరేలా వీళ్ళందరినీ తన్నాలి, నరకాలి అనిపించింది.ఇంతలో నాకు వాళ్ళలో ఉన్న నాలుగో వాడిని చూసినట్టు అనిపించింది. వాడి దగ్గరగా వెళ్లాను. వాడు నన్ను చూసి వెనక్కి జరుగుతున్నాడు. వేగంగా వెళ్లి వాడి తల పైకి లేపాను. ఒక్కసారిగా అలా కంగు తిన్నాను. సార్ వీడు,...వీడు నాకు తెలుసు అని కళ్ళు పెద్దవి చేసి జగదీశ్ వంక చూశాను.