This Guy’s Open Letter Asking Filmmakers Not To Defame Kadapa In The Name Of Faction Is Spot On!

 

“Rayalaseema Rathanala seema” – we have come across this line in many books and stories. But what we are being shown in the movies is completely different. It’s been years since the factionism ended there but the movies which are being made even today show it as a land of factionism and place of revenge. However, on the contrary, there are lot of things which show the greatness of Kadapa, yet the directors prefer to show it in the same way. Did we just stereotyped it such a way that people living there are still living in verge of killing their opponents? Such type of questions raised again with the release of recent RGV’s flick “Kadapa” which is based on story of factionism in Kadapa. It’s not a story which inspires us, it is also a biography which motivates us, rather it just gives others a wrong opinion about what is happening now there. This is not a conclusion or criticism, this is just an opinion shared by a person raised in the same region. We better say it is all about the greatness and great people in Kadapa.

A Note written by Siva Racharla

ఫ్యాక్సన్ భూతం

ఫ్యాక్సన్ గతించిన చరిత్ర.ముఠానాయకులు వర్గ పొరును వదిలి రాజకీయాలు, వ్యాపారలు, ఆత్యాధ్మికం ఎవరికి నచ్చిన మార్గంలో వాళ్ళు జీవిస్తున్నారు.

బుల్లెట్ దండలేసుకోని ఒకప్పుడు ఊరేగిన నాయకులు ఇప్పుడు తెల్లకండువాలేసుకోని తిరుగుతున్నారు.

1992లొ విజయభాస్కర్ రెడ్డి ముఠానాయకులకు గన్ లైసెన్సులు రద్దు చేసినప్పటి నుంచి బాబుగారు,YSR ప్రయత్నాలతో ముఠాపోరు దాదాపు సమసిపొయింది. ప్రజలు కూడ ప్రశాంతంగా జీవిస్తున్నారు.

ఇప్పుడెవరు వారి ఇల్లలొ వారు తిని నాయకుడు కోసం ప్రాణాలు ఇవ్వటం, తియ్యటంలాంటి పనులు చెయ్యటం లేదు.స్వయంగా వ్యవసాయమొ మరేదైన చిన్నపాటి వ్యాపారమో చేసుకుంటు పిల్లలను చదివించుకుంటున్నారు. ఫ్యాక్సనుకు దూరంగా వుంటే చాలని మహిళలు కుటుంబాన్ని తీసుకొని బెంగుళూరు,ముంబై లాంటి నగరాలకు వెళ్ళి వాళ్ళు పనిచేస్తు కుటుంబాలను పోసిస్తున్న వాళ్ళువున్నారు.

ఫ్యాక్సన్ ఒక సామాజిక రుగ్మత.చారిత్రిక కారణాలు,ఆర్ధిక వెనుకబాటు తనంలాంటి అనేక కారణాలు మొదలైన ఫ్యాక్సన్ సహజ వనరుల మీద ఆదిపత్యం,రాజకీయ ఆదిపత్యం కోసం జరిగిన వికృత పొరులొ అనేక మంది చనిపోయారు.

గతంలొ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత గొడవలున్న వర్గాలే కలిసిపొయ్యాయి. నాయకులందరు ఒకే పార్టి గొడుగు కిందికి చేరుకున్నారు.

హింస,సెక్సు ప్రధానంగా సినిమాలు తీసిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు “కడప” పేరుతో web series మొదలు పెట్టి నిన్న ట్రైలర్ విడుదల చేశారు.

ఫ్యాక్సన్ సున్నితమైన అంశం కాని తీవ్రంగా నష్టపరిచింది. ఇప్పుడు ముఠాలు లేవు,ముఠాపోరు లేదు.ప్రజలు కూడ ప్రశాంతంగా జీవిస్తున్నారు…ఇప్పుడు వర్మ మానిన గాయాన్ని లేపటానికే ఈ కడప సీరిసును మొదలుపెట్టినట్లుంది.

వర్మకు సమాజానికి సందేశాలు ఇవ్వటం నచ్చదు అని చాలాసార్లు స్వయంగా చెప్పారు.ఇప్పుడేమన్న మనసు మార్చుకోని ఫ్యాక్సన్ వలన జరిగిన నష్టాన్ని చెప్తు అందరు ఫ్యాక్సనుకు దూరంగా వుండండి అని సందేశం ఇవ్వాలనుకుంటే ఫ్యాక్సనులొ భర్తలను కోల్పోయిన భార్యలు, తండ్రులను కోల్పోయిన పిల్లల కథతో documentary తియ్యండి. హింసను ప్రోత్సహించేలా భయంకరమైన సన్నివేశాలను చిత్రించి,సెక్సు చేసే సన్నివేశాలు తీసి ప్రశాంత పరిస్థితిని చెడగొట్టటం,పాత ఫ్యాక్సన్ నాయకులను రెచ్చగొట్టటం తప్ప సాధించేది ఏమిలేదు.

వర్మా రాజారెడ్డి మీదనో రాజశేఖర్ రెడ్డి మీదనో సినిమా తియ్యాలనుకుంటే గతంలో ఆయన ప్రకటించిన “రెడ్డి గారు పోయారు” తీసుకోండి.

ఈ సందర్భంలో నేను ఒకటి అంగీకరించాలి,కొందరు నాయకుల చిలకపలుకులు చూసి వారి ఫ్యాక్సన్ కథను రాశాను.బహుశా ఒక ఐదు పోస్టులు రాసివుంటాను.నా రచనా శైలి,వాడే పదాలు రెచ్చగొట్టేవి కాదు,ఉద్రేకపూరిత అంశాలను తొలగించి dryగా రాయటం నాపద్దతి.

ఫ్యాక్సన్ మీద రాసి ఏమిలాభం శివ?ఏమి చెప్పదలుచుకున్నావ్? అన్న ఒక్క ప్రశ్నతో ? నాకు ఆలోచన కలిగింది.అవును ఒక నాయకుడి గురించి చెప్పటం కోసం గతించిన ఫ్యాక్సన్ చరిత్రను రాయటం ఎందుకు?గత 5,6 నెలలుగా ఒక్కటి కూడ ఫ్యాక్సన్ కథ రాయలేదు.

ఫ్యాక్సన్ పోస్టులు రాసి ఎప్పుడు సంతోషపడింది లేదు…చరిత్ర మీద పోస్టు రాస్తే చాలా ఆనందం కలిగేది. కబాలి సినిమా కథతో మొదలు పెట్టి సిద్దవటం కోట మీదుగా “చెన్నపట్టణం” పేరు రావటం వెనుక వున్న కథను రాసిన రోజు నిజంగానే ఆత్మసంతృప్తి కలిగింది.

ఫ్యాక్సన్ కథలు కాదు అతను రాసిన కొన్ని కడప చరిత్ర పోస్టులు చూడండి.

కబాలి-చెన్నపట్టణం

కడప నాడులు

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: , , , , ,