Presenting The Achievements Of The Dynamic JP In His Journey From A Collector To A Common Man!

Updated on
Presenting The Achievements Of The Dynamic JP In His Journey From A Collector To A Common Man!

దేశానికి సేవ చేయడానికి పదవి అవసరం లేదు.. అధికారం అవసరం లేదు.. కేవలం మన రాజ్యాంగం ఇచ్చిన హక్కులను మనం ఉపయోగించుకుంటే చాలు అని జయప్రకాష్ గారు పదే పదే చెబుతారు. ఒక రకంగా జయ ప్రకాష్ నారాయణ గారు అధికారంలో ఉన్న రాజకీయ నాయకునిలానే దేశానికి సేవ చేశారు. ఆయన జాయింట్ కలెక్టర్ గా ఉన్ననాటి నుండి ఇప్పటివరకు చేసిన కొన్ని Great Achievements పరిశీలిద్దాం.

• విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ఎన్నో కుటుంబాలు వేరే చోటుకు వెళ్ళవలసి వచ్చింది. వారికి ఉద్యోగాలు ఇవ్వాలనే సంవత్సరాల తరబడి ఉన్న సమస్యను JP గారు పరిష్కరించారు. ఆయన జాయింట్ కలెక్టర్ గా ఉన్నప్పుడు 8,000(మిగిలిన యువతకు కూడా) ఉద్యోగాలు కల్పించారు.

• ప్రకాశం జిల్లాకు కలెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో 2,00,000 ఎకరాల వ్యవసాయ భూమికి నీటిని అందించే ప్రక్రియలో కీలక పాత్ర పోషించారు.

• East Godavari జిల్లాకు కలెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో కృష్ణ, గోదావరి డెల్టాల నీటిపారుదల వ్యవస్థను పున:నిర్మించడంలో ఆయన ప్రదర్శించిన నేర్పరితనం వల్ల అక్కడి వ్యవసాయం ఇప్పటికి ఎంతో మెరుగైన ఫలితాలను సాధిస్తున్నది.

• JP గారి ప్రతిభను గుర్తించి అప్పటి ముఖ్యమంత్రి(ఎన్.టి.రామారావు గారు), గవర్నర్ తమ Personal Secretary గా నియమించుకున్నారు.

• వివిధ పధకాలు, స్వయం ఉపాధి కల్పన ద్వారా మహిళా సాధికారత కోసం ఏంతో కృషి చేశారు.

• అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రూరల్ కోర్టులలో త్వరగా Judgement వచ్చేలా అందుకు తగిన చర్యలు తీసుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఆర్ధిక సంస్కరణలు చేసి తెలుగు రాష్ట్రం ఆర్ధికంగా బలంగా మారేందుకు పకడ్భంది ప్రణాళికలు అమలుచేశారు.

• ప్రతి ఒక్కరు ఓటు హక్కును ఉపయోగించుకోవాలి అని ఓటర్ల నమోదు ప్రక్రియను సులభం చేశారు.

జయప్రకాష్ గారి లక్ష్యం మొదటి నుండి ఒక్కటే దేశాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడం. కలెక్టర్ గా ఉద్యోగం చేస్తూ అందుకోసం ఎంతో కృషి చేశారు కాని రాజకీయ నాయకుల స్వార్ధ ప్రయోజనాల దృష్ట్యా అభివృద్ధి జరగడం లేదని, ఇంకా ఎన్నో సంస్కరణలు చేయాలనుకున్న గాని నాయకుల ఒత్తిడి మేరకు అది సాధ్యపడడం లేదని భావించి ర్యాంక్ లో సాధించిన IAS ఉద్యోగానికి రాజీనామా చేసి స్వతంత్రంగా పోరాడుతున్న గొప్ప వ్యక్తి ఆయన. రాజీనామా చేసిన తరువాత ఆయన ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేశారు. దేశంలో గత 15 సంవత్సరాలలో వచ్చిన కొత్త చట్టాలలో కీలకమైన చట్టాలన్ని ఆయన ఇచ్చిన Inputs ద్వారానే రూపొందించినవి. అవి.

1. Disclosure Of Candidate Details, & The Disclosure Law. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులందరు వారి ఆస్తులు, వారి మీద నమోదైన నేరాల వివరాలను కూడా ఎన్నికల అధికారికి తెలియజేయాలి(2003). 2. రాజకీయ పార్టీలకు అందుతున్న ఫండ్స్ వివరాలు పూర్తి ఆధారాలతో తెలియజేయాలి(2003). 3. ప్రభుత్య మంత్రి వర్గంలోని సభ్యుల సంఖ్య సాధ్యమైనంత వరకు తక్కువ ఉండాలి(91st Amendment, 2003). 4. దేశంలో జరుగుతున్న అవినీతిని ప్రజలందరికి తెలిసేలా చేసి అభివృద్ధి లో కీలకంగా ఉపయోగపడే చట్టం 'సమాచార హక్కు చట్టం(2005)" ఆయన ఇచ్చిన సూచనల ద్వారా రూపొందించినదే. 5. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్(2005). 6. గ్రామ్ న్యాయాలయ (2009). 7. లోక్ పాల్ బిల్ (2011) 8. కో-ఆపరేటివ్ సంస్థలకు స్వయం ప్రతిపత్తిని(Autonomy) 97th Constitution Amendment ద్వారా సాధ్యం చేశారు(2012). 9. National Judicial Appointments Commission(121st Amendment, 2015). 10. ఈరోజు దేశంలో జరుగుతున్న భయంకరమైన స్కామ్ ల గురుంచి ప్రతి సామాన్యుడు సులభంగా తెలుసుకునేందుకు ఆయన రూపొందించిన చట్టాలు బయటి ప్రపంచానికి తెలిసేలా ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. 11. సంవత్సరానికి పదుల సంఖ్యలో తనలాంటి దేశానికి ఉపయోగపడే శక్తివంతమైన పౌర సైన్యానికి శిక్షణ అందించి దేశానికి అంకితమిస్తున్నారు.

ఇవన్నీ కేవలం ఆధారాలతో వెలుగు చుసిన కొన్ని నిజాలు మాత్రమే. ఒకవేళ జయప్రకాష్ గారి లక్ష్యం డబ్బు సంపాదించడమే ఐతే ఇప్పటికీ IAS అధికారిగానే ఉండేవారు. ఒక వేళ JP గారి లక్ష్యం డబ్బు సంపాదించడమే ఐతే లోక్ సత్తా పార్టీ ద్వారా కులం, ఆకర్షణ పూరిత పథకాల పేర్లు చెప్పి రాజకీయంగా ఎదిగేందుకు ప్రజలను మభ్య పెట్టేవారు. అమాయక ప్రజలకు సేవ చేస్తా అని చెప్పి ఆశించినంత ఫలితాలు రాకుంటే తిరిగి వెనిక్కి వెళ్ళి వారి వ్యాపారాలు చేసుకుంటున్నారు JPగారు మాత్రం అలా కాదు IAS అధికారిగా, లోక్ సత్తా రాజకీయ పార్టీ అధ్యక్షునిగా, ఇప్పుడు బాధ్యతయుత పౌరునిగా దేశానికి, దేశప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు. పరిస్థితులకు తగ్గట్టు ఆయన ప్రస్థానం మారింది, ఆయన పద్ధతలు మార్చుకున్నారు కాని దేశాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యం మాత్రం మారలేదు.. జయ ప్రకాష్ నారాయణ గారు నిరంతరం వెలుగుతూ దారి చూపిస్తున్న ఒక చైతన్యపు కాగడ.