This Conversation Between A 90’s Kid and A Present Day Kid Will Hit You Right In The Feels!

 

90’s Kid : హాయ్ రా ! నేను 90’s వాడిని !

Present Kid : Hello Bro! I’m Present Day’s kid.

90’s Kid : నిన్ను చూద్దాం అని Time Machine ఎక్కేసి నీ కాలం లోకి వచ్చేసా !

Present Kid : Nenu kuda ninnu chudham ani adhee Time machine ekkesi vachesa.

90’s Kid : సరేలే చదివేవాళ్ళని confuse చెయ్యకుండా పాయింట్ కి వచేద్దామ్.

Present Kid : Haa adhi…. Iddariki same age annamata ippudu…iddaram oka Weekend kalusukunnam, aaah Saturday jarigina conversation ippdu chudham. Again…Nice to meet you raa…!!!

90’s Kid : మాకు మాత్రం ఇంగ్లీష్ రాదనుకున్నావా ఏంటీ ?? Nice to meet you too! హా అర్థమయ్యిందా ?

Present Kid : Haa ayyindhi ayyindhi. Em ilaa kalisav nannu? Emaina cheppala? cheppalante fast ga cheppey….. facebook create cheskovali nenu eroju.

90’s Kid : ఎందుకు రా బాబు మనకి ఆ Facebook లు . చందమామ కథలు చదువుకుందామా ? సాయంత్రం మా ఇంటికి వచ్చేయ్ !

Present Kid : Avem kathalu raa? Nuvvu raasava enti kompadeesi? Sarle repu Sunday kadha ., nee plans enti?

90’s Kid : ఏముంటాయి రా ….పొద్దున్నే 6 కి మా అమ్మ లేపేస్తది నన్ను . తర్వాత డాడీ తో మార్కెట్ కి వెళ్లి వచ్చాకా , ETv లో పంచతంత్రం miss అవ్వకుండా చూడాలి.

Present Kid : Inaa sunday kuda 6 ki lechipothava….? Inaa adem chustav ra babu. Naakaithe assalu nachadhu. Paigaa market ki velthavaa?

90’s Kid : ఎందులో ఐనా దూకి సచ్చిపో రా …. పంచతంత్రం నచ్చదు అన్నవాడిని నిన్నొక్కడినే చూస్తున్నా . ఐనా Sunday అంటే ఈటీవీ లో పంచతంత్రం, ఇంట్లో చికెన్ common ఏ రా మాకు . సరేలే నువ్వేం చేస్తావ్ మరి ?

Present Kid : Nenu lechedhe 10 ki. Lechaka Tv lo cinemalu vesthadu gaa. Inka ave time pass naku.

90’s Kid : అవునూ సినిమాలు అంటే గుర్తొచ్చాయి … నా దగ్గర చాలా collection ఉన్నాయ్ తెల్సా సినిమా పాటల పుస్తకాలు . మేము క్లాస్ లో break ఇచ్చినప్పుడు పాడుకుంటాం .

Present Kid : Avna….. inaa annii youtube lo videos vachesayi gaa. Sarele…tarwatha em chesthav?

90’s Kid : తర్వాత కుదిరితే నేనూ , మా పక్కింటి ఫ్రెండ్స్ కలిసి అష్ఠాచెమ్మా లేదా రాముడు సీత ఆడతాం . తర్వాత అమ్మ భోజనానికి పిలుస్తాది .

Present Kid : Adem game raa? Ramudu Seetha vinna kani aadatam radhu naku. Repu nenuu meetho adataniki vastha. Naku kuda nerpinchu.

90’s Kid : సరే రా పొద్దున్నే పదిన్నర కి మా ఇంటికి వచ్చేయ్ ………

Present Kid : Tarwatha thinnaaka em chesthav? Padukuntaavemo kadha…

90’s Kid : అస్సలు పడుకోను . పడుకుంటే sunday waste అయిపోతుంది కదా . కుదిరితే ఇల్లు సర్దుతా లేదా , Telephone బుక్ చిన్నది తయారుచేస్కుంటా !

Present Kid : Illu mee amma sardhadhaa? Nuvvenduku sardhadam? Telephone book cheskovadam enti ardamkaledhu.

90’s Kid : నాకు ఇల్లు సర్దడం అనేది ఒక సరదా .చాలా బాగుంటది తెల్సా ! Telephone book చిన్నది నా దగ్గరున్న waste papers అన్నీ కలిపి gum తో లేదా అన్నం మెతుకులతో అతికించి తయారుచేస్తా . ఇప్పటికీ నేను చేసిన రెండు books ఉన్నాయ్ తెలుసా మా ఇంట్లో …… ..మా డాడీ ఆ బుక్స్ ఏ వాడతారు ఇప్పటికీ ఎవరికైనా phone చెయ్యాలంటే !

Present Kid : Arey nakuu nerpisthava? Nenuu nerchukunta. Avnuu chethilo enti idhi? Eee tape ni ekkadoo chusa kani gurthuravatledu.

90’s Kid : అరేయ్ ఇవి తెలీవా నీకు ? Pistol tapes రా . నా దగ్గర gun కూడా ఉంది తెలుసా …Gun తోనే కాదు ….. గోడకి గీసినా ఇవి సౌండ్ వస్తాయ్ !

Present Kid : Arey bhale undi raa, nakuu kavali ekkada ammautharo cheppu tarwatha konukkunta.

90’s Kid : మరి మధ్యాహ్నం అంతా ఏం చేస్తావ్ రా ?

Present Kid : Emundhi… nenuu appudappudu padukonu. Pogo lo Chota Bheem leda Youtube lo cinemalu chustha. elaago intloo wifi untadi ga maku.

90’s Kid : నేను , మా పక్కింట్లో పిల్లలు కలిసి బొంగరం ఆట , చింత పిక్కల ఆట ఆడుకుంటాం తెలుసా రేపు !!!

Present Kid : Avna…. ayya baboiii nuvvu matladedhi naku edhii sarigga ardamkavatledhu raa. Avanni nuvvu naku nerpinchali repu. Anni 1st time vintunna nenu.

90’s Kid : సరే రా …. రేపు మా పదిమంది గ్యాంగ్ లో నువ్వూ కలిసిపోతావ్ అన్నమాట .

Present Kid : Enti padhi mandhi untara neku aadukovadaniki? Maa apartment lo nenu okkadine aadukovali edaina…adi kuda phone lone chaalavaraku………..

90’s Kid : హా అలా సాయంత్రం 4 అవ్వగానే అందరం పోగుఅవుతం . ముంజులు తిన్నా తర్వాత వాటితో బండి చేసుకొని Cricket ఆడతాం .

Present Kid : Avnaa ithe adhi kuda nerpinchu ela cheyyaalo …inkem chestharu?

90’s Kid : అలా సాయంత్రం అయ్యేసరికి అందరం ఇంట్లో మిగిలిన దీపావళి సామాను లో పాము బిళ్ళలు , వెన్నముద్దలు పోగేసుకుని కాల్చుకుంటాం .

Present Kid : Ithe nenuu vastha raa, naa daggara kuda chala unnay. Deepavali ki nenu okkadine kalchukunna. Meru rojuuu padhi mandhi kalisi kalustharu. Chalaa miss ayyaanu ra nenu!

90’s Kid : రేయ్ వర్షం పడేలా ఉంది ఇప్పుడు .ఆకాశం లో మబ్బు చూడు ఎంత ఉందో …..పేపర్ బోట్స్ చేసుకుందామా ?

Present Kid : Naaku cheyyadam radhu raa….nadhi kuda nuvve chesi ivvu.

90’s Kid : నీకు రాదా ?చాలా easy రా బాబు . నేను ఇదే కాదు గాలిపటాలు , Paper rocket, gun, ఇంకా చాలా చేస్తా తెలుసా …

Present Kid : avanni naku kuda nerpinchu. Hey naku galipatam ela cheyyalo cheppava please please …..

90’s Kid : అంటే నీకు ఇప్పటిదాకా గాలిపటం చెయ్యడమే రాదా ? అంటే ఇంకెప్పుడు ఎగరెయ్యడం నేర్చుకుంటావ్ రా ?ఐనా నీ దగ్గర యూట్యూబ్ ఉంది గా …….. అందులో చూసి నేర్చుకో రా ………

Present Kid : Nuvvu youtube lo chudakundane nerchukunnav ga. Naakuu alaage nerpinchu. Areyi athanu evaru raa? Enti adhi?

90’s Kid : అరేయ్ ఇంత లేట్ గా చెప్పావేంటి రా బాబు . జరుగు జరుగు …… పుల్లైస్ రా అది . నాకు రెండు కావాలి . నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వూ కొనుక్కుందువు రా …

Present Kid : Chala bagundhi raa… neneppuduu thinnaa, bayata Scoops ae thinta. Idhi inka bagundhi.

90’s Kid : అవును మరి నువ్వేం చేస్తావ్ సాయంత్రం తర్వాత ? తినేసి పడుకోవడం ఏనా ?

Present Kid : Home Works unte cheskoni, tinesi padukunta raa….anthe. Mari nuvvem chesthav?

90’s Kid : ఓరి నీ …, మీ తాతయ్య నీకు విక్రమాదిత్యుడు బేతాళుడు కథలు , రామాయణం లో బాలకాండ కథలూ చెప్పరా ?

Present Kid : Ledhu raa… vallu eppudo kani maa intiki raaru . Vachinappudu Serials chustharu. Inka naakem cheptaru?

90’s Kid : అవును నాకో doubt రా …నేను ఇందాకడినుంచి అచ్చ తెలుగు లో మాట్లాడుతుంటే …నువ్వు Tenglish లో మాట్లాడతావేంటి ?

Present Kid : Inka Ardamkaalendhenti? Chadive vallaki teliyali kada nuvvu 90’s vi, nenu Present kid ni ani.

90’s Kid : సరేలే ఇది మాత్రం correct గా చెప్పావ్ . ముందు ఐస్ తిను …… కారిపోతుంది …………

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: , ,